E-Paper
Advertisement

Srinivasa Mangapuram: జయ కృష్ణ ఘట్టమనేని ‘శ్రీనివాస మంగాపురం’ కీలక అప్డేట్..

Srinivasa Mangapuram: జయ కృష్ణ ఘట్టమనేని ‘శ్రీనివాస మంగాపురం’ కీలక అప్డేట్..
Advertisement

Srinivasa Mangapuram: ‘‘ఆర్ఎక్స్ 100, మంగళవారం’ చిత్రాలలో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi).. ప్రస్తుతం సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని (Jayakrishna Ghattamaneni)ని హీరోగా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా ఆయన రూపొందిస్తున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram). బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని (Rasha Thadani) ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాను అగ్ర నిర్మాత అశ్విని దత్ సమర్పిస్తుండగా, నిర్మాత పి కిరణ్ నిర్మిస్తున్నారు. శ్రీనివాస మంగాపురం ఇప్పటికే విడుదలైన టైటిల్ రివీల్, ఆకట్టుకునే ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడమే కాకుండా, సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేశాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్‌‌ని మేకర్స్ తెలియజేశారు.

Also Read- Allu Family Wedding: అల్లు శిరీష్ వివాహానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.. అల్లు అర్జున్ ఈసారి ఆ తప్పు చేయలే!

కీలక షెడ్యూల్ పూర్తి

Advertisement

ఇటీవల చిత్రబృందం తిరుపతిలో మొదలు పెట్టిన కీలకమైన మూడో షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ షెడ్యూల్‌లో కృష్ణ ఘట్టమనేని, రాషా తడాని తదితర ప్రధాన తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా తెలిపారు. అలాగే ఈ షెడ్యూల్ పూర్తవడంతో సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయిందని వెల్లడించారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. మేకర్స్ భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ విడుదల చేస్తామని ఈ సందర్భంగా మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా టాప్ టెక్నికల్ టీమ్ ఈ సినిమాకు పనిచేస్తోంది. నిర్మాణం పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అందుకు కారణం మాత్రం ఘట్టమనేని హీరోనే.

Also Read- Epic First Note: సంచారమే సాంగ్ ప్రోమో వచ్చింది.. స్పెషల్ ఏంటంటే?

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి న్యూ హీరో

Advertisement

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి చాలా కాలం తర్వాత ఒక యంగ్ హీరో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. అందులోనూ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మరో సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడి కుమారుడు కావడంతో గ్రాండ్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే కథ కోసం చాలా కాలంగా వేచి చూశారు. అజయ్ భూపతి చెప్పిన కథ నచ్చడంతో, బాలీవుడ్ బ్యూటీని హీరోయిన్‌గా పట్టుకొచ్చి మరీ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్‌తో మేకర్స్, ఘట్టమనేని ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కచ్చితంగా జయ కృష్ణకు ఈ సినిమా భారీ సక్సెస్‌ను ఇస్తుందని ఘట్టమనేని అభిమానులు కూడా భావిస్తున్నారు. చూద్దాం మరి.. ఏం జరుగుతుందో?

Also Read- Allu Arjun -Sneha Reddy: అల్లు అర్జున్ స్నేహ రెడ్డి 15 వెడ్డింగ్ యానివర్సరీ.. కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన బన్నీ!

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×