E-Paper
Advertisement

Mega158: పూనకాలు లోడింగ్ 2.O.. చిరుబాబీ ప్రాజెక్ట్ ఎక్స్‌క్లూజివ్ అప్డేట్!

Mega158: పూనకాలు లోడింగ్ 2.O.. చిరుబాబీ ప్రాజెక్ట్ ఎక్స్‌క్లూజివ్ అప్డేట్!
Advertisement

Mega158: ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), బాబీ కొల్లి (Bobby Kolli) కలిసి చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ #ChiruBobby2. మెగా158 (Mega158)గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం ఇప్పుడు అఫీషియల్‌గా లాంచ్ అవడానికి సిద్ధమైంది. రీసెంట్‌గా బ్లాక్‌బస్టర్ హిట్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu)తో రూ. 400 కోట్ల క్లబ్‌లో చేరిన మెగాస్టార్, ఇప్పుడు బాబీతో కలిసి మాస్ విధ్వంసానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఎక్స్‌క్లూజివ్ అప్డేట్ వచ్చేసింది. డైరెక్టర్ బాబీ స్వతహాగా మెగాస్టార్‌కు వీరాభిమాని. అందుకే చిరంజీవిలోని వింటేజ్ మాస్‌ను, ఆ స్టైల్‌ను ఎలా రాబట్టాలో ఆయనకు బాగా తెలుసు. అదే ‘వాల్తేరు వీరయ్య’తో నిరూపించాడు కూడా. ఇప్పుడు ‘పూనకాలు లోడింగ్ 2.0’కు ఆయన అన్నీ రెడీ చేశారనేది తాజా అప్డేట్. ఆ విషయంలోకి వస్తే..

Also Read- Heroines: అసభ్యకర రీతిలో, జూమ్ చేసి మరీ మా శరీరాలను చూపించాల్సిన అవసరమేంటి?

కిరాక్ స్క్రిప్ట్ లాక్!

Advertisement

తాజా సమాచారం ప్రకారం, బాబీ ఈ సినిమా కోసం ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశారట. వాల్తేరు వీరయ్యలో ఆయన చూపించింది కేవలం శాంపిల్ మాత్రమేనని, ఇందులో మెగాస్టార్‌ను మునుపెన్నడూ చూడని మోస్ట్ స్టైలిష్ అండ్ పవర్‌ఫుల్ రోల్‌లో చూపించబోతున్నారట. ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయ్యిందని, అది విన్న చిరు కూడా బాబీ విజన్‌కు ఫిదా అయ్యారనేది లేటెస్ట్ అప్డేట్. ఈ సినిమా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఉంటుందని, ఇందులో మెగాస్టార్ లుక్ చాలా స్టైలిష్‌గా, గ్యాంగ్‌స్టర్ ఛాయలున్న పాత్రలో ఉంటుందని టాక్. సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ వెండితెరపై ఒక అద్భుతంలా ఉండబోతుందట. ఎవరూ ఊహించని రేంజ్‌లో ఈ యాక్షన్ పార్ట్‌ను డిజైన్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి వంటి భారీ తారాగణం ఉండబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

Also Read- Repu Udayam 10 Gantalku: ‘రేపు ఉదయం 10 గంటలకు’.. ఏంటి? అసలు విషయమేంటి?

త్వరలోనే పూజా కార్యక్రమాలు

Advertisement

మెగాస్టార్ చిరంజీవి షోల్డర్ కీహోల్ సర్జరీ తర్వాత ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో, ఫుల్ జోష్‌లో ఉన్నారు. తాజా అప్‌డేట్ ప్రకారం, త్వరలోనే ఈ సినిమా గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. మార్చి ఎండింగ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు అందించే అవకాశం ఉంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. బాబీ మార్క్ ఎలివేషన్స్, చిరు మార్క్ గ్రేస్.. ఈ రెండూ కలిస్తే థియేటర్లలో బాక్సాఫీస్ బద్దలు అవ్వడం ఖాయం. అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వెళుతుందా? అని మెగా ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. రాబోయే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నారు.

Also Read- Allu Sirish Nainika wedding: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ .. కనిపించని ముగ్గురు స్టార్స్… ఏం జరిగిందబ్బా?

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×