E-Paper
Advertisement

చైనాలో దుమ్మురేపిన ఫోన్ ఇక ఇండియాలోకి.. ఫీచర్లు చూస్తే వావ్ అనకుండా ఉండలేరు!

చైనాలో దుమ్మురేపిన ఫోన్ ఇక ఇండియాలోకి.. ఫీచర్లు చూస్తే వావ్ అనకుండా ఉండలేరు!
Advertisement

Redmi Turbo 5: రెడ్‌మీ ప్రియులకు అదిరిపోయే వార్త. చైనాలో భారీ విజయాన్ని అందుకున్న Redmi Turbo 5 స్మార్ట్‌ఫోన్ త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ఈనెల 16న ఈ హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మనదేశంలో టర్బో సిరీస్ నుండి వస్తున్న మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. ఇప్పటికే దీనికి సంబంధించిన మైక్రోసైట్ లైవ్‌లోకి రాగా, చైనీస్ వేరియంట్‌కు సమానమైన ఫీచర్లతోనే ఇది ఇండియాలో కూడా అడుగుపెడుతున్నట్లు స్పష్టమైంది.

అద్భుతమైన డిస్‌ప్లే, అదిరిపోయే లుక్:

ఈ సరికొత్త ఫోన్ 1.5K రిజల్యూషన్ కలిగిన ఫ్లాట్ ‘ఫ్లూయిడ్ డిస్‌ప్లే’తో రానుంది. అంతేకాదు.. స్మూత్ గేమింగ్, బ్రౌజింగ్ అనుభూతి కోసం దీనిలో 120Hz రీఫ్రెష్ రేట్‌ను అందించారు. స్క్రీన్ పైభాగంలో సెల్ఫీ కెమెరా కోసం పంచ్ హోల్ డిజైన్‌ను ఇచ్చారు. బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ ఫోన్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండబోతోంది.

Advertisement

Also Read: ప్రాంతీయ భాషల్లో మాట్లాడే AI ఫీచర్లతో Infinix Smart 20.. ఈ ధరలో ఇలాంటి ఫోన్ దొరకడం కష్టమే!

చైనా వేరియంట్ లాగే కెమెరా సెటప్:

కెమెరాల విషయానికి వస్తే.. చైనాలో విడుదలైన మోడల్‌ తరహాలోనే ఇందులో కూడా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను ఇస్తున్నారు. దీని మెయిన్ కెమెరా 50MPతో రానుంది. దీనికి తోడు ఫొటోలు, వీడియోలు షేక్ అవ్వకుండా ఉండటానికి OIS, EIS ఫీచర్లను జోడించారు. దీంతో పాటు 8MP అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 20MP కెమెరాను అమర్చారు.

పవర్‌ఫుల్ ప్రాసెసర్, భారీ స్టోరేజ్:

Advertisement

ఈ ఫోన్ పనితీరు చాలా వేగంగా ఉండనుంది. ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనికి తోడు 12GB ఎల్‌పీడీడీ ఆర్5ఎక్స్ RAM అందించారు. అవసరమైతే మరో 12GB వరకు వర్చువల్ RAM పెంచుకునే సదుపాయం ఉంది. అలాగే Redmi Turbo 5లో యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ టెక్నాలజీని వాడటం వల్ల యాప్స్ చాలా వేగంగా ఓపెన్ అవుతాయి.

సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్:

ఈ స్మార్ట్‌ఫోన్ 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో రాబోతోంది. దీనివల్ల ఫోన్ చాలా త్వరగా ఛార్జ్ అవుతుంది. అయితే బ్యాటరీ సామర్థ్యం, కూలింగ్ సిస్టమ్ వివరాలను కంపెనీ ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. జూన్ 16న లాంచ్ అయిన తర్వాత ఈ ఫోన్ అమెజాన్, షియోమి ఇండియా అధికారిక వెబ్‌సైట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Also Read: పూర్తిగా డిజైన్ మార్చేసిన శాంసంగ్.. కొత్త Galaxy S26 FE లుక్ చూస్తే ఐఫోన్‌ను మర్చిపోతారు!

Related News

బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్.. Vi రూ.479 రీఛార్జ్‌తో లభించే బెనిఫిట్స్ ఇవే!

వర్షాకాలంలో ACలో ఉన్న ఈ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే.. ఉక్కపోత మాయం, కరెంట్ బిల్లు సగం!

ఆన్‌లైన్‌లో మీ డేటా సేఫ్ ఉండాలంటే.. ఈ 5 గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వండి!

ఓరి నాయనో.. నిజమా? కలా? Samsung Z Fold 7పై ఏకంగా రూ.75,000 దాకా తగ్గింపు!

టీవీ కొనాలనుకుంటున్నారా? Mini LED లేదా OLED.. ఏది బెస్ట్ ఆప్షన్?

మెటా యాప్స్‌లో మన డేటాను AI వాడకుండా ఎలా ఆపాలో తెలుసా?

నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, లైవ్ టీవీ ఫ్రీ.. ఎయిర్‌టెల్ రూ.1199 ప్లాన్‌తో ఇన్ని లాభాలా ?

రూ.55 వేలలో అత్యుత్తమ టీవీలు.. ఫీచర్లు చూస్తే.. అంత పెట్టినా పర్లేదంటారు!

Big Stories

Advertisement
×