E-Paper
Advertisement

NBK 111.. థియేటర్లలో స్పీకర్లు పగిలిపోవడం ఖాయం.. బాలయ్య సినిమాపై తమన్ ఊరమాస్ అప్‌డేట్!

NBK 111.. థియేటర్లలో స్పీకర్లు పగిలిపోవడం ఖాయం.. బాలయ్య సినిమాపై తమన్ ఊరమాస్ అప్‌డేట్!

NBK 111: అఖండ,భగవంత్ కేసరి,డాకు మహారాజ్,అఖండ2 వంటి వరుస సక్సెస్ లతో జోరు మీదున్నాడు బాలయ్య. ఈ క్రమంలోనే గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో ‘NBK 111’ అనే వర్కింగ్ టైటిల్‌తో మరో సినిమాని పట్టాలెక్కించాడు బాలయ్య.ఇక ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే టాలీవుడ్‌లో సరికొత్త వైబ్రేషన్స్ మొదలయ్యాయని చెప్పాలి.
ఈ క్రమంలోనే నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించే ఒక క్రేజీ అప్‌డేట్‌ను చిత్ర సంగీత దర్శకుడు, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ఎస్ తమన్  తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు.

క్రేజీ అప్‌డేట్ వదిలిన తమన్

యస్ ..ఈ ప్రెస్టేజియస్ మూవీకి సంగీతం అందిస్తున్న తమన్, సినిమా టీజర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు రీ-రికార్డింగ్ పనుల గురించి ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ‘NBK 111’ చిత్రానికి సంబంధించిన టీజర్ వర్క్ వంద శాతం పూర్తయిందని తమన్ అధికారికంగా వెల్లడించారు. టీజర్ అవుట్‌పుట్ గురించి ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా టీజర్ మాత్రం మామూలుగా లేదని, విజువల్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్ ఊహించని స్థాయిలో చాలా పవర్‌ఫుల్‌గా వచ్చాయని స్పష్టం చేశారు.
also read :జాన్వీ ఇన్‌స్టా చాట్ లీక్.. ఆ సీన్లపై అసహనం, బుచ్చిబాబుపై గుర్రు, చెర్రీ గురించి కూడా!
ముఖ్యంగా ఈ టీజర్‌లో బాలయ్య గారిని ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని విధంగా ఒక వేరే లెవెల్‌లో చూస్తారని, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉందని వివరించారు. బాలకృష్ణ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌కు తోడు, తమన్ అందించిన ఊరమాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ఈ టీజర్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లినట్లు ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్నటాక్ .ఇక తమన్ ఇచ్చిన ఈ సాలిడ్ అప్‌డేట్‌తో నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.

జూన్ 10వ తేదీన అదిరిపోయే గిఫ్ట్

గతంలో బాలకృష్ణ, తమన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ సినిమాకు థియేటర్లలో ఏ స్థాయి రీ-రికార్డింగ్ సౌండ్ వినిపించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడంలో తమన్ మ్యూజిక్ మరియు బీజీఎం కీలక పాత్ర పోషించాయి. ఆ తర్వాత వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సినిమాలోనూ మాస్ ఆడియన్స్‌ను ఊపేసే సంగీతాన్ని అందించారు.
also read :ఫ్యాన్స్‌కు షాక్.. ‘జాతిరత్నాలు 2’ కి ఆ ఒక్కటి మైనస్ అంటున్న నాగ్ అశ్విన్!
ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో, ‘NBK 111’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ప్రతి ఏటా నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే జూన్ 10వ తేదీన బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా, ఈ చిత్రం నుండి ఒక అదిరిపోయే గిఫ్ట్ రాబోతోందని మూవీ టీమ్ ఇప్పటికే అనౌన్స్ చేసింది కూడా. జూన్ 10న విడుదల కానున్న ఈ గ్లింప్స్ లేదా టీజర్ టాలీవుడ్ రికార్డులను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

హై-వోల్టేజ్ డ్రామాను సిద్ధం చేసిన గోపీచంద్ 

ఇక ఈ సినిమా విశేషాల్లోకి వెళితే, చిత్ర దర్శకుడు బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా ఒక పవర్‌ఫుల్ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. టాప్ ప్రొడక్షన్ హౌస్ అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా రాజీ పడకుండా విజువల్స్ పరంగా రిచ్‌గా నిర్మిస్తోంది. బాలయ్య సరసన ఈ సినిమాలో కాజల్ కనువిందు చేస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారని ఇండస్ట్రీ టాక్.
మొత్తానికి తమన్ ఇచ్చిన హైప్ చూస్తుంటే థియేటర్లలో స్పీకర్లు పగిలిపోయే రేంజ్‌లో మ్యూజిక్ ఉండబోతోందని స్పష్టమవుతోంది.ఇక ఈ సినిమాని ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.చూడాలి మరి వరుస సక్సెస్ లతో దంచికొడుతున్న బాలయ్య ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని రాబడతాడో !
also read :ఆ ఒక్క టీజర్‌తో పెరిగిన అంచనాలు.. యశ్ ‘టాక్సిక్’ డైరెక్టర్ బర్త్‌డే గ్లింప్స్ వైరల్.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడేనా?

Related News

ఆగస్టు ప్రీమియర్‌కు బిగ్ బాస్ 10 రెడీ.. కింగ్ నాగ్ కొత్త లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా, ఈసారి మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీ?

ఆ ఒక్క టీజర్‌తో పెరిగిన అంచనాలు.. యశ్ ‘టాక్సిక్’ డైరెక్టర్ బర్త్‌డే గ్లింప్స్ వైరల్.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడేనా?

పాపం ఆ అమ్మాయిని టార్గెట్ చేయొద్దు.. జాన్వీ కపూర్‌పై ట్రోలింగ్..ఘాటుగా స్పందించిన జగ్గుభాయ్

ఫ్యాన్స్‌కు షాక్.. ‘జాతిరత్నాలు 2’ కి ఆ ఒక్కటి మైనస్ అంటున్న నాగ్ అశ్విన్!

జాన్వీ ఇన్‌స్టా చాట్ లీక్.. ఆ సీన్లపై అసహనం, బుచ్చిబాబుపై గుర్రు, చెర్రీ గురించి కూడా!

‘నాకు హేటర్స్ ఉన్నారా ఏంటి?’.. నెటిజన్ ప్రశ్నకు సామ్ క్రేజీ రిప్లై!

ఆ విషయంపై పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించిన రాహుల్ రామకృష్ణ.. ఏం జరిగింది అంటే?

Big Stories

×