Chiranjeevi : ఆడియన్స్ కు ఏ సినిమాలు నచ్చుతాయి అనేది అతిపెద్ద టాస్క్. అది అర్థమైనప్పుడు చాలామంది దర్శకులు సక్సెస్ అవుతారు. బహుశా దాన్ని కంప్లీట్ గా అర్థం చేసుకున్న ఏకైక దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి అని చెప్పాలి. అందుకే ఇప్పటివరకు ఎస్.ఎస్ రాజమౌళి కెరియర్ లో ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేదు. ఒక ఆ తర్వాత 100% సక్సెస్ రేట్ ఉన్న దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఆడియన్స్ కి ఏం చూపిస్తే వర్కౌట్ అవుతుంది అని బాగా తెలుసు.
అందుకే వెంకటేష్ లాంటి హీరోతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేసి దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు అయ్యేలా చేశాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి హీరోగా మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
ఒక సినిమా వస్తుంది అని తెలియాలి అంటే ఆ సినిమాకి సంబంధించిన సాంగ్స్ బాగా హిట్ అవ్వాలి. ఆ సాంగ్స్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ తో చాలామంది థియేటర్ కు వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా సందర్భాలలో జరిగింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అవ్వడానికి కారణం కూడా ఆ సినిమాలో ఉన్న గోదారి గట్టు మీద రామ చిలకవే అనే పాట. ఈ పాటను రమణ గోగుల పాడారు.
మెగాస్టార్ చిరంజీవి చాలా హిట్ సినిమాలకు ఉదిత్ నారాయణ అద్భుతమైన పాటలు పాడారు. అదే తరహాలో ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాలో కూడా ఉదిత్ తో ఒక పాటను పాటించాడు అనిల్ రావిపూడి. ఆ పాట సూపర్ హిట్ అయిపోయింది.
ఇప్పుడు మళ్లీ రమణ గోగులతో మరో పాటను పాటించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ పాట కూడా ఆల్రెడీ పూర్తయిపోయిందని తెలుస్తుంది. ఈ పాట సినిమాకి ఏ మేరకు ప్లస్ అవుతుందో వేచి చూడాలి.
ఇకపోతే ఈ పాటను నవంబర్ నెలలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ పాటకు సంబంధించిన షూటింగ్ వారం రోజులు ఉండబోతుంది. నవంబర్ 20 తర్వాత ఈ పాటకు సంబంధించిన షూటింగ్ మొదలవుతుంది. నెల ఆఖరిలోపు ఈ పాటను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది. ఇక నెక్స్ట్ సాంగ్ ఎలా ఉండబోతుందో క్యూరియాసిటీ చాలామందికి మొదలైంది.
Also Read: SSMB29 : మహేష్ బాబు, రాజమౌళి ట్విట్టర్ వార్, అప్డేట్ ఇస్తావా లేదా?