E-Paper
Advertisement

SSMB 29: SSMB 29 అప్డేట్.. జియో హాట్ స్టార్ లో ప్రసారం..సినీ చరిత్రలోనే మొదటసారి ఇలా!

SSMB 29: SSMB 29 అప్డేట్.. జియో హాట్ స్టార్ లో ప్రసారం..సినీ చరిత్రలోనే మొదటసారి ఇలా!
Advertisement

SSMB 29: టాలీవుడ్ సినీ ప్రేమికులు మహేష్ బాబు (Mahesh Babu),రాజమౌళి(Rajamouli) సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి చాలా రోజులు అవుతున్నా ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి ఓ చిన్న విషయాన్ని కూడా రాజమౌళి వెల్లడించలేదు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తే బాగుంటుందని అభిమానులు కూడా ఆశపడుతున్నారు. అయితే త్వరలోనే అభిమానుల కోరిక నెరవేరబోతుందని తెలుస్తుంది. నవంబర్లో మహేష్ బాబు సినిమాకి సంబంధించిన టైటిల్ రివిల్ ఉంటుందని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.

రామోజీ ఫిలిం సిటీలో..

తాజాగా ఈ విషయంపై చిత్ర బృందం అధికారకంగా వెల్లడించడమే కాకుండా చాలా గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించబోతున్నారని ఈవెంట్ కి సంబంధించిన టైం, ప్లేస్ కూడా ప్రకటించారు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. నవంబర్ 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా వేడుకను హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారని చిత్ర బృందం వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమానికి ఎలాంటి హాలీవుడ్ సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా పాల్గొనడం లేదని స్పష్టమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మాత్రమే పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.

జియో హాట్ స్టార్ లో ప్రసారం…

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ఒక గ్లింప్ వీడియోని కూడా విడుదల చేయబోతున్నారని సమాచారం. ఇక ఈ కార్యక్రమాన్ని అందరూ చూసే విధంగా చిత్ర బృందం ఈ సినిమా టైటిల్ రివిల్ ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ (Jio Hot Star) కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. జియో హాట్ స్టార్ లో ఈ కార్యక్రమం అవుతుందని అధికారకంగా వెల్లడించారు. అయితే ఇప్పటివరకు ఏ సినిమా టైటిల్ రివిల్ కార్యక్రమానికి సంబంధించిన హక్కులను ఏ ఓటీటీ సంస్థలు కొనుగోలు చేయలేదు కానీ మొదటిసారి మహేష్ బాబు రాజమౌళి సినిమా విషయంలోనే ఇలా జరగటం విశేషం.

2027 ను టార్గెట్ చేసిన జక్కన్న..

Advertisement

ఇక ఈ సినిమా పట్ల ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని గ్లోబల్ రేంజ్ లో విడుదల చేయడానికి రాజమౌళి అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కెన్యా, ఒడిస్సా వంటి ప్రాంతాలలో కీలక షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుది . ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) నటిస్తున్న సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకం పై కే ఎల్ నారాయణ భారీ బడ్జెట్ సినిమాగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని 2027వ సంవత్సరంలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Rashmika: రష్మికలో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా..నిజంగా గ్రేట్ అబ్బా!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×