Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 లో సెలబ్రిటీలు మరియు కామనర్లు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కామనర్స్ లో ఒకడు పవన్. అగ్నిపరీక్షలో పవన్ చాలా అద్భుతంగా ఆడాడు. తనలో ఉన్న స్పెషల్ టాలెంట్ అంతా కూడా బయట పెట్టాడు. పవన్ గేమ్ చూసి కూడా చాలామంది ఫిదా అయి తన గురించి సోషల్ మీడియా వేదికగా పొగుడుతూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. అయితే పవన్ కొన్ని టాస్కులు ఆడినప్పుడు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు మనుషుల్ని కూడా ఒక్కడే ఆపగలిగే సామర్థ్యం ఉంది పవన్.
అయితే పవన్ లోని కొన్ని విషయాలు మాత్రం విపరీతంగా చర్చనీయాంసం అవుతున్నాయి. బాగా ఆడుతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఎక్కువగా రీతుతో కలిసి ఉండటం. తనతో మాట్లాడే పద్ధతి వీటన్నిటి వలన కూడా తనకి కొంత బాడ్ నేమ్ వస్తుంది. ఒక ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు మధ్యలో రీతూ వెళ్ళిపోతుంటే పవన్ ఆపినప్పుడు రీతు బెడ్ పైన పడిపోయిన సంగతి తెలిసిందే. దీని గురించి సోషల్ మీడియా వేదికగా కూడా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.
చాలామంది ఊహించినట్లుగానే ఈ విషయం పైన నాగర్జున పవన్ పైన ఫైర్ అయ్యారు. హౌస్ నుంచి బయటికి వెళ్లిపొమ్మన్నారు. క్షమించమని అడిగినా కూడా నువ్వు చేసింది క్షమించరాని నేరం. బిగ్బాస్ మొదలైనప్పటి నుంచి ఇలా ఏ కంటెంట్ కూడా చేయలేదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అయితే పవన్ తో బిగ్ బాస్ అలా మాట్లాడుతున్న తరుణంలో రీతు కూడా అక్కడ జరిగే విషయాన్ని పవన్ కు సపోర్టుగా వివరించే ప్రయత్నం కూడా చేసింది. కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. మొత్తానికి రీతుతో ఈ రకమైన బాండింగ్ పవన్ కి ఉండటం వల్లనే ఈరోజు మాటలు పడాల్సిన అవసరం వచ్చింది.
మెయిన్ గేటు కూడా తీసి పవన్ ను బయటకు పంపించే ప్రయత్నం చేశారు. చాలాసేపు డిస్కషన్ జరిగిన తరువాత హౌస్ లో మోకరించి పవన్ క్షమాపణలు చెబితే గాని హౌస్ లో కంటిన్యూ అవ్వలేని పరిస్థితికి వచ్చేసారు. మొత్తానికి హౌస్ లో పవన్ మోకరించి క్షమాపణలు చెప్పిన తర్వాత హౌస్ మేట్ గా కంటిన్యూ అయ్యాడు.
ఏదేమైనా నాగార్జున ఈ రేంజ్ లో వార్నింగ్ ఇస్తారని ఎవరో కూడా ఊహించి ఉండరు. అయితే పవన్ దీనిని దృష్టిలో పెట్టుకొని ఇకపై హౌస్ లో ఎలా గేమ్ ఆడుతారో వేచి చూడాలి.
Also Read: Bigg Boss 9: బయట ఫుల్ నెగిటివ్.. కానీ, రోజు రోజుకి నచ్చేస్తోన్న క్యూట్ పాప