E-Paper
Advertisement

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!
Advertisement

Killer Accident: సినీ పరిశ్రమలో ఎప్పుడు ఎలాంటి విషాదం ముంచుకొస్తుందో ఊహించడం కష్టం. తాజాగా కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌ను కూడా షాక్ కి గురిచేసే ఘోర ప్రమాదం జరిగింది. వైవిధ్యమైన నటనతో, విలక్షణమైన పాత్రలతో సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్ సెట్‌లో బుధవారం తెల్లవారుజామున ఒక భారీ పేలుడు సంభవించింది. ఆయన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘కిల్లర్’ సినిమా షూటింగ్ స్పాట్‌లో గ్యాస్ బెలూన్ సిలిండర్ అకస్మాత్తుగా పేలిపోవడంతో ఒక యువ టెక్నీషియన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన చిత్ర పరిశ్రమలో ఒక్కసారిగా తీవ్ర విషాదాన్ని నింపింది.

తమిళనాడు రాజధాని చెన్నైలోని చారిత్రాత్మక బిన్నీ మిల్స్ ప్రాంగణంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ షెడ్యూల్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. యాక్షన్ సీక్వెన్స్ లేదా నైట్ ఎఫెక్ట్ షాట్స్ కోసం సెట్‌లో భారీ లైటింగ్ బెలూన్లను ఏర్పాటు చేశారు. బుధవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో, ఎవరూ ఊహించని విధంగా ఆ లైటింగ్ బెలూన్‌కు అటాచ్ చేసిన గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి సెట్‌లో ఉన్న మధురవోయల్‌కు చెందిన 26 ఏళ్ల యువ టెక్నీషియన్ మదన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదం జరిగిన వెంటనే సెట్‌లో భారీగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు.

Advertisement

అత్యంత విషమంగా ముగ్గురి పరిస్థితి 

ఈ ఘోర ప్రమాదంలో మరో పది మందికి పైగా సిబ్బంది గాయపడగా, వారిలో శక్తివేల్, సూర్య, దినకరన్ అనే ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అలర్ట్ అయిన తోటి సిబ్బంది క్షతగాత్రులను చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని, అసలు ప్రమాదానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

సాధారణంగా సినిమా సెట్స్ లో భద్రతా ప్రమాణాలు పాటించడంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఇలాంటి సాంకేతిక లోపాలు భారీ నష్టాన్ని మిగులుస్తుంటాయి. గతంలో కూడా కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్‌లో క్రేన్ విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన అప్పుడే మర్చిపోలేము. అలాగే రీసెంట్‌గా పలు భారీ యాక్షన్ సినిమాల చిత్రీకరణల్లోనూ చిన్నపాటి ప్రమాదాలు జరిగాయి. ఇప్పుడు ఎస్‌జే సూర్య సినిమా సెట్‌లో ఇలాంటి దుర్ఘటన జరగడం అభిమానులను, సినీ వర్గాలను కలవరపెడుతోంది. ఈ ఘోర ప్రమాదంపై మూవీ టీమ్ అఫీషియల్ స్పందించాల్సి ఉంది.

దాదాపు పదేళ్ళ తర్వాత  మళ్లీ మెగాఫోన్ పట్టిన ఎస్‌జే

దర్శకుడిగా ‘వాలి’, ‘ఖుషి’ వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన సూర్య , ఆ తర్వాత నటుడిగా మారి ‘స్పేడర్’, ‘మార్క్ ఆంటోని’, ‘రాయన్’ మరియు రీసెంట్‌గా వచ్చిన ‘సరిపోదా శనివారం’ తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నసంగతి తెల్సిందే.మళ్ళీ దాదాపు పదేళ్ళ తర్వాత  మళ్లీ మెగాఫోన్ పట్టి ‘కిల్లర్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్న ఈ సమయంలో ఇలా జరగడం బాధాకరం

శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై గోపాలన్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎస్‌జే సూర్యకు చెందిన ఏంజెల్ స్టూడియోస్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రీతి అస్రాణి హీరోయిన్‌గా నటిస్తోంది. ఒకేసారి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడంతో షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. తీవ్ర గాయాలపాలైన మిగిలిన సిబ్బంది త్వరగా కోలుకోవాలని, మరణించిన టెక్నీషియన్ కుటుంబానికి న్యాయం జరగాలని సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారంతా !

Also read :ఆరు పదుల వయసులో మూడో పెళ్లికి రెడీ అయిన ఆమిర్ ఖాన్.. ఆ రోజే రిజిస్టర్డ్ మ్యారేజ్?

Related News

లండన్ వీధులలో జంటగా విజయ్ త్రిష…వీడియో వైరల్!

జిమ్‌లో మాళవిక శర్మ హంగామా ..ఫొటో చూస్తే ఫ్యాన్స్ ఫిదా!

తాప్సీ ఎందుకింత కష్టం.. నీ వల్ల కాదులే – నెటిజన్స్ ట్రోల్స్!

ఈ సక్సెస్ ఒక్క రాత్రిలో వచ్చింది కాదు… నెగిటివిటీ పై కన్నీళ్లు పెట్టుకున్న వైష్ణవి!

బన్నీతో ఆ ఒక్క సీన్.. వైష్ణవిచైతన్యకి చుక్కలు కనిపించాయట!

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సుమంత్!

గోవాలో సమీరా రెడ్డి ఫ్యామిలీ హంగామా.. మధ్యలో మొసలి ట్విస్ట్!

మా వైపు తప్పే లేదు.. డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై సుమలత ఫైర్

Big Stories

Advertisement
×