E-Paper
Advertisement

మల్లెపూలపల్లకి పాటకి ముట్టింది ఎంతో తెలుసా ?

మల్లెపూలపల్లకి పాటకి ముట్టింది ఎంతో తెలుసా ?
Advertisement

Dappu Srinu:రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇరుముడి’ సినిమా థియేటర్లలో ఏ స్థాయి కలెక్షన్ల వర్షం కురిపిస్తుందో అందరం చూస్తూనే ఉన్నాం. ఎలాంటి హంగులు, అర్భాటాలు లేకుండా కేవలం భక్తి, బలమైన ఫ్యామిలీ సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్ల మైలురాయిని దాటేసి రికార్డు సృష్టించింది. గతంలో వచ్చిన ‘కాంతార’ (2022), ‘కార్తికేయ 2’ (2022), ‘హనుమాన్’ (2024) లాంటి సినిమాలు భక్తి రసంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి భారీ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు అదే కోవలో 2026 ప్రారంభంలో వచ్చిన ఈ ‘ఇరుముడి’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను తిరగరాస్తోంది.

ఈ చిత్రంలో ‘మల్లెపూల పల్లకి’ పాట పాడిన ఫోక్ సింగర్ డప్పు శ్రీనును ఈ సినిమా ద్వారా దర్శకుడు శివ నిర్వాణ వెండితెరకు పరిచయం చేశారు. విచిత్రం ఏమిటంటే, సినిమా కంటెంట్‌కు వచ్చిన ప్రశంసల కంటే ఈ ‘మల్లెపూల పల్లకి’ పాటకు వచ్చిన క్రేజ్ రెట్టింపు స్థాయిలో ఉంది.

Advertisement

థియేటర్లలో ఈ పాట వస్తున్నంతసేపు అయ్యప్ప భక్తులు, రవితేజ అభిమానులు పూనకంతో ఊగిపోతున్నారు. స్క్రీన్ ముందు హారతులు ఇవ్వడం, సక్సెస్ మీట్లలో సయితం ఈ పాటకు స్టెప్పులు వేయడం చూస్తుంటే పాట ఏ స్థాయిలో జనం గుండెల్లోకి వెళ్ళిందో అర్థమవుతోంది. అసలు ఈ పాటను డప్పు శ్రీను సొంతంగా రాసి, కంపోజ్ చేసుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్, శివ నిర్వాణ ఆయనను కలిసి అడిగిన వెంటనే సినిమా కోసం ఇచ్చేశారు. వేదికలపై కూడా శివ నిర్వాణ ఈ విషయాన్ని గర్వంగా చెబుతూ శ్రీనుకు దక్కాల్సిన గౌరవాన్ని అందించారు.

చిత్ర నిర్మాతలు కూడా ఈ పాట ప్రాధాన్యతను గుర్తించి డప్పు శ్రీనుకు భారీ పారితోషికాన్ని అందించారు. కేవలం ఈ ఒక్క పాట కోసమే ఆయనకు రూ.9 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు స్వయంగా డప్పు శ్రీను ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒక కొత్త జానపద గాయకుడికి ఈ స్థాయిలో పారితోషికం దక్కడం ఇండస్ట్రీలో అరుదైన విషయమే. ఇప్పటికే యూట్యూబ్‌లో ఈ ఆడియో సాంగ్ 24 మిలియన్ల వ్యూస్ దాటేసింది. రాబోయే అయ్యప్ప మాలధారణ సమయంలో ఈ వ్యూస్ మరిన్ని కోట్లకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement

అయితే సోషల్ మీడియా వేదికగా ఒక చిన్న చర్చ కూడా నడుస్తోంది. సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా డప్పు శ్రీనుదేనని, కానీ క్రెడిట్ మాత్రం దర్శకుడికే ఎక్కువ వెళ్తోందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఒక పెద్ద సినిమాలో పాడుకునే అవకాశం రావడం, రూ.9 లక్షల పారితోషికంతో పాటు రాత్రికి రాత్రే అంతటి గుర్తింపు రావడం డప్పు శ్రీనుకు దక్కిన పెద్ద గౌరవమేనని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ‘మల్లెపూల పల్లకి’ పాట టాలీవుడ్‌లో ఒక జానపద గాయకుడి స్థాయిని, గుర్తింపును సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags

Related News

మలయాళం నుంచి వచ్చి టాలీవుడ్‌ను ఏలేస్తున్న ఒకే ఒక్కడు.. దుల్కర్ కామెంట్స్ వైరల్!

ఆనంద్ దేవరకొండతో పెళ్లి.. ఓపెన్ గా చెప్పేసిన వైష్ణవి చైతన్య!

మంచు ఫ్యామిలిలో పుట్టకపోతే బాగుండు..ఇలా అనేసావేంటీ లక్ష్మక్క ?

చిరంజీవి హిట్ టైటిల్ తో కమిటీ కుర్రోళ్ళు హీరో కొత్త సినిమా!

భార్యతో విడాకులైనా రిలేషన్ మెయింటైన్ చేస్తున్న హీరో.. ఇదేం లాజిక్ గురూ!

బాలయ్య NBK 111కు మాస్ టైటిల్..వైరల్ అవుతున్న వీడియో!

చెన్నైలో అదితి–సిద్ధార్థ్ కొత్త కాపురం.. ఇల్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Big Stories

Advertisement
×