Tanveer Ahmed On Babar Azam: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మూడు టెస్టుల సిరీస్ లో పాకిస్తాన్ పై ఇంగ్లాండ్ అద్భుతంగా రాణించి.. సిరీస్ కైవసం చేసుకుంది. మరో టెస్ట్ మిగిలి ఉండగానే ఈ సిరీస్ సొంతం చేసుకున్న ఇంగ్లాండ్.. వైట్ వాష్ దిశగా అడుగులు వేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజంను ఉద్దేశించి మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ కంటే గొప్పవాడని బాబర్ ను తాను మెచ్చుకుంటే… ఇప్పుడు దారుణంగా ఆడుతున్నాడని ఫైర్ అయ్యారు. ఇంగ్లాండ్ గడ్డపై చెత్త ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో… పాకిస్తాన్ అభిమానులు చాలా సీరియస్ గా ఉన్నారని హెచ్చరించారు. మిస్టర్ బాబర్…పాకిస్తాన్ వీధుల్లో తిరగకు, తేడా వస్తే రాళ్లతో కొడతారని వార్నింగ్ ఇచ్చారు.
వెస్టిండీస్ పై అద్భుతంగా రాణించిన బాబర్ ఆజం, ఇంగ్లాండ్ గడ్డపై విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో తన్వీర్ అహ్మద్ రియాక్ట్ అయ్యారు. వెస్టిండీస్ పైన ఆడిన తరహాలో ఇంగ్లాండ్ పై ఎందుకు ఆడడం లేదని నిలదీశారు. ఫాస్ట్ బౌలర్లు దిగగానే… బాబర్ ప్యాంటు తడిచిపోతోందని హేళన చేశారు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో చాలా రోజులుగా సెంచరీ కోసం బాబర్ ఆజం ప్రయత్నం చేస్తున్నాడని.. 38 ఇన్నింగ్స్ లు పూర్తయిన కూడా ఒక్క సెంచరీ చేసుకోకపోవడం దారుణమని విమర్శలు చేశారు.
దీన్నిబట్టి బాబర్ ఆజం ప్రదర్శన అత్యంత చెత్తగా ఉందని చెప్పకనే చెప్పారు తన్వీర్ అహ్మద్. ఒకప్పుడు క్రికెట్ ప్రపంచం కింగ్ అని బాబర్ ఆజంను పిలిచేదని గుర్తు చేశారు. విరాట్ కోహ్లీ కంటే బాగా ఆడతాడని తాను కూడా పలుసార్లు చెప్పినట్లు గుర్తు చేశారు. కానీ ఇంగ్లాండ్ పర్యటనలో మాత్రం పాకిస్తాన్ చెప్పిన ముందుకు తీసుకు వెళ్లకుండా.. నట్టేట ముంచాడని ఆగ్రహించారు. గంటకు 90 మైళ్ళ వేగంతో వచ్చే బందులను గతంలో అలవోకగా బాబర్ ఎదుర్కొనేవాడని వివరించారు. కానీ, ఇంగ్లాండ్ గడ్డపై మాత్రం తేలిపోతున్నాడని విమర్శలు చేశారు. ఇది ఇలాగే కొనసాగితే బాబర్ కెప్టెన్సీ కూడా ఊడిపోవడం పక్క అంటూ హెచ్చరించారు తన్వీర్ అహ్మద్. ఇది ఇలా ఉండగా, రెండో టెస్టులో కెప్టెన్ గా బాబర్ ఆజం వ్యవహించిన నేపథ్యంలో కూడా పాకిస్తాన్ ఓడిపోయింది.