BigTV English

Niharika: కుటుంబానికి దూరంగా నిహారిక.. వాళ్ళే నా ప్రపంచం అంటూ!

Niharika: కుటుంబానికి దూరంగా నిహారిక.. వాళ్ళే నా ప్రపంచం అంటూ!

Niharika : తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మెగా కుటుంబం నుంచి ఇప్పటికే ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే హీరోయిన్ గా మాత్రం నిహారిక(Niharika) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈమె నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇలా నిహారిక యాంకర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఈమె సక్సెస్ అందుకో లేకపోయినా నిర్మాతగా మాత్రం మంచి సక్సెస్ అందుకున్నారు.


నా కుటుంబమే నా ప్రపంచం…

ప్రస్తుతం ఈమె వరుస సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక తన కుటుంబం గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. నిహారిక విడాకులు తీసుకొని తన భర్తకు దూరంగా ఉన్నప్పటికీ ఈమె తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం లేదని, విడిగా ప్రత్యేక ఇంట్లో ఉంటుందని తెలుస్తోంది. ఇలా ప్రత్యేక ఇంట్లో ఉంటున్నాను అంటే కుటుంబంతో గొడవలు పడి కాదని క్లారిటీ ఇచ్చారు. వారంలో కనీసం మూడుసార్లైనా తాను తన ఇంటికి వెళ్లి అమ్మ నాన్నలతో కలిసి గడుపుతానని వాళ్లే నా ప్రపంచం అంటూ నిహారిక ఈ సందర్భంగా తెలియజేశారు.

అల్లుడిని వదిలి ఉండలేను..

ఇకపోతే ఇటీవల వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠికి కొడుకు జన్మించిన సంగతి తెలిసిందే. ఇలా వారికి కొడుకు పుట్టడంతో మెగా కుటుంబంలోనూ, అలాగే మెగా అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక తన బుల్లి అల్లుడు గురించి కూడా నిహారిక ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను ఇంట్లో ఉంటే ఎప్పుడూ తన అల్లుడిని ఎత్తుకొనే ఉంటానని తెలిపారు. వాడు పుట్టినప్పటినుంచి నాకెవరు ఇంట్లో పనులు కూడా చెప్పడం లేదు ఎప్పుడు తన అల్లుడిని ఎత్తుకొని ఉంటానని వెల్లడించారు.


హీరోయిన్ గా రెడీ..

నా అల్లుడు పెరిగి పెద్దయిన తర్వాతన హీరోగా సినిమాలో మాలు చేస్తానని చెబితే కచ్చితంగా తన బ్యానర్ లోనే నా అల్లుడు చేత సినిమా చేస్తాను అంటూ ఈ సందర్భంగా నిహారిక చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్న ఈమె సరైన సినిమా అవకాశాలు వస్తే తప్పనిసరిగా తాను హీరోయిన్గా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తానని వెల్లడించారు.. ఇక తాను నటించిన మొదటి సినిమా ఒక మనసు ఈ సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డాను కానీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయిందని, మంచి కథ దొరికితే నటించడానికి తాను రెడీ అంటూ నిహారిక చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి . మరి నిహారికకు ఏ దర్శకుడు అవకాశం ఇస్తారో తెలియాల్సి ఉంది. ఇక ఈమె కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా ద్వారా నిర్మాతగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం తన రెండో సినిమా షూటింగ్ పనులలో నిహారిక ఎంతో బిజీగా ఉంటున్నారు.

Also Read: OG Hungry Cheetah Song : హంగ్రీ చీటా మోత మోగించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

Related News

Kantara Chapter 1 Pre release: నొప్పితో బాధపడుతున్న ఎన్టీఆర్.. ఎక్కువ మాట్లాడలేనంటూ!

Kantara Chapter 1 Event: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్, ఫ్యాన్స్ లో జోష్ నింపిన ప్రొడ్యూసర్

Kantara Chapter 1 Event : యాంకర్ సుమా పై మరోసారి సీరియస్ అయిపోయిన ఎన్టీఆర్

Rakul Preet Singh: బెడ్ పైన పడుకుని మరీ ఆ పని చేస్తున్న రకుల్

Upasana Ram Charan : బతుకమ్మ వేడుకల్లో మెగా కోడలు ఉపాసన కొణిదెల, ఏకంగా ఢిల్లీలో కూడా

OG Hungry Cheetah Song : హంగ్రీ చీటా మోత మోగించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

Spirit: ప్రభాస్ కు ఫాదర్ గా మెగాస్టార్, అలా ఎలా సెట్ చేశావ్ వంగా?

Big Stories

×