Coconut Price: కొబ్బరి కాయల ధర కొండెక్కి కూర్చుంది. చిన్న కాయ అయినప్పటికీ ఎన్నడూ లేని విధంగా ధర పలుకుతోంది. సాధారణంగా రూ.20–25లో దొరికే కొబ్బరికాయ ఇప్పుడు రూ.40–60 మధ్య అమ్ముడవుతోంది.
పండుగల ప్రభావం, కొరత కారణం
ఈ ఏడాది మైదాన ప్రాంతాల్లో కొబ్బరి దిగుబడి గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఉత్పత్తి తగ్గడం వల్ల సరఫరా పరిమితమైంది.
ఇక అదే సమయంలో వినాయక చవితి, దసరా, దీపావళి వంటి వరుస పండుగలు రావడంతో కొబ్బరికాయలకు భారీ డిమాండ్ ఏర్పడింది. పూజల్లో, హోమాల్లో, వివాహ వేడుకల్లో కొబ్బరి తప్పనిసరి కావడం వల్ల కొనుగోలు ఒత్తిడి పెరిగింది. సరఫరా తగ్గి, డిమాండ్ పెరగడంతో ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి.
మార్కెట్ విశ్లేషణ
సరఫరా పెరగకపోతే ధరలు రూ.70 దాకా చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా ఖర్చులు కూడా ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
అదేవిధంగా, కొబ్బరి ఉత్పత్తులైన నూనె, డ్రై కొబ్బరి ధరలు కూడా సమాంతరంగా పెరుగుతున్నాయి. కాబట్టి రాబోయే వారాల్లో మార్కెట్‌లో మరింత ప్రభావం కనిపించే అవకాశం ఉంది.
పండుగలతో, పూజలతో, ప్రతిరోజు వంటలతో అనుబంధమై ఉన్న సాధారణ పండు. సరఫరా తగ్గడం, పండుగల డిమాండ్, రవాణా ఖర్చుల పెరుగుదల.. ఇవన్నీ కలిసి కొబ్బరి ధరను ఆకాశానికి ఎక్కించాయి. ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Also Read: చిచ్చర పిడుగు.. ఔరా అనిపిస్తున్న మంత్రి కొండా సురేఖ మనవడు..
తమిళనాడులో ప్రస్తుతం టన్ను కొబ్బరికాయ ధర రూ.67,00, పలుకుతుంది. రవాణా ఖర్చులు రూ. 5వేలు టన్నుకు సైజును బట్టి రెండు వేల వరకు కాయలు వస్తాయి. ఈ లెక్కన హోల్ సేల్ వ్యాపారులకే ఒక కొబ్బరికాయ రూ.36 పలుకుతుంది. పెద్ద సైజువైతే రూ.46 పైమాటే. విజయవాడ నగర పరిధిలో గొల్లపూడి సత్యనారాణపురం, ఆటోనగర్, వన్ టౌన్ ప్రాంతంలో హోల్ సేల్ వ్యాపారులు ఉన్నారు. ప్రస్తుతం కొబ్బరికాయల ధర పెరగడం వల్ల.. డిమాండ్ లేదని పూర్తిగా వ్యాపారం పడిపోయిందని హోల్ సేల్ వ్యాపారులు చెబుతున్నారు.