E-Paper
Advertisement

Chiranjeevi -Venkatesh: 80’s స్టార్స్ రీయూనియన్.. స్పెషల్ ఫ్లైట్ లో చిరు.. వెంకటేష్!

Chiranjeevi -Venkatesh: 80’s స్టార్స్ రీయూనియన్.. స్పెషల్ ఫ్లైట్ లో చిరు.. వెంకటేష్!
Advertisement

Chiranjeevi -Venkatesh: ఇటీవల కాలంలో సినిమా సెలబ్రిటీలందరూ కూడా పెద్ద ఎత్తున రీ యూనియన్(Re Union) అవుతూ అప్పట్లో వారికి సంబంధించిన విషయాలను ముచ్చటిస్తూ కొంత సమయాన్ని చాలా సంతోషంగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే నేడు చెన్నైలో 80 ‘s స్టార్స్ (80’S Stars)అందరూ కూడా మరోసారి కలవబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయ్యాయి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం సెలబ్రిటీలందరూ ఒక్కొక్కరుగా చెన్నై చేరుకుంటున్నారు.

80’s స్టార్స్ రీ యూనియన్..

తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు విక్టరీ వెంకటేష్ (Venkatesh)మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కూడా స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ లో చెన్నై చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ రీ యూనియన్ కార్యక్రమంలో భాగంగా ఏఏ సెలబ్రిటీలు హాజరవుతున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇలా అప్పట్లో ఇండస్ట్రీలో స్టార్ట్ నటీనటులుగా కొనసాగిన వారందరూ ఒకే చోట చేరి అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకోబోతున్నారని స్పష్టమవుతుంది. మరి ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొనబోతున్నారనేది మరి కాసేపట్లో తెలియనుంది.

చెన్నై చేరుకున్న చిరు ,వెంకటేష్..

Advertisement

ఇక ఈ కార్యక్రమానికి చిరంజీవి వెంకటేష్ కలిసి వెళ్లిన నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి వెంకటేష్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. ఇక ఇద్దరు హీరోలు దాదాపు ఒకేసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరు హీరోలు కూడా ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వెంకటేష్ ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తదుపరి సినిమాతో వెంకటేష్ బిజీ కానున్నారు.

చిరు సినిమాలో వెంకటేష్..

Advertisement

ఇక అనిల్ రానిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందు రాబోతుంది అయితే ఇప్పటికే చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మన శంకర వరప్రసాద్ సినిమాలో చిరంజీవితో పాటు వెంకటేష్ కూడా కలిసిన నటిస్తుండటం విశేషం. ఇలా ఇద్దరి హీరోలు ఒకే తెరపై కనిపించబోతున్నారనే విషయం తెలిసి అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే వెంకటేష్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారని సమాచారం.. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.

Also Read: OG Movie: యూట్యూబ్‌లోకి వచ్చేసిన ‘ఓజి’ కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్.. ఎంజాయ్ పండుగో!

Related News

చిరు ‘కాక’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×