BigTV English

Rashmika: ఎంగేజ్మెంట్ తర్వాత ఫస్ట్ పోస్ట్ చేసిన రష్మిక.. మీరు ఎదురు చూస్తుంటారంటూ!

Rashmika: ఎంగేజ్మెంట్ తర్వాత ఫస్ట్ పోస్ట్ చేసిన రష్మిక.. మీరు ఎదురు చూస్తుంటారంటూ!

Rashmika: సినీనటి రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈమె నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తో నిశ్చితార్థం (Engagment) జరుపుకున్న నేపథ్యంలో ఈమెకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినపడుతున్నాయి. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్న రష్మిక తనతో కలిసి ఏడు అడుగులు నడవబోతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా తమ ఇంట్లోనే నిశ్చితార్థపు వేడుకలను జరుపుకున్నారు. ఇక ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ టీం కూడా స్పష్టం చేసింది.


నిశ్చితార్థం తర్వాత మొదటి పోస్ట్..

ఇలా నిశ్చితార్థం జరుపుకున్న విజయ్ దేవరకొండ రష్మిక వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇలా నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట ఎక్కడ కూడా నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయకపోవడంతో ఎప్పుడెప్పుడు ఈ ఇద్దరి సెలబ్రిటీల నుంచి వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు బయటకు వస్తాయా అని అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే రష్మిక సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఎంగేజ్మెంట్ తర్వాత ఈమె ఈ పోస్ట్ చేయటం విశేషం. “నాకు తెలుసు మీరందరూ దీని కోసమే ఎదురుచూస్తున్నారు అంటూ” ఈమె ఒక పోస్ట్ ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.

ది గర్ల్ ఫ్రెండ్ విడుదల తేదీ ఫిక్స్..

ఇక ఈ పోస్టు తన ఎంగేజ్మెంట్ గురించి అనుకుంటే మనం పప్పులో కాలు వేసినట్టే. ఈమె చేసిన పోస్ట్ తన సినిమా “ది గర్ల్ ఫ్రెండ్” (The Girl Friend) విడుదల గురించి తెలియజేయడంతో అభిమానులు కొంత నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. రష్మిక రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7వ తేదీ ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఒక వీడియోని కూడా విడుదల చేశారు. ఇక ఈ పోస్ట్ రష్మిక తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.


?igsh=ZWU0MXZqNms1N3Ey

రష్మిక ఎంగేజ్మెంట్ గురించి చెబుతుందని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు ఈమె సినిమా విడుదల తేదీ గురించి చెప్పడంతో కొంత నిరుత్సాహం వ్యక్తం చేయడమే కాకుండా ఎంగేజ్మెంట్ గురించి ఎప్పుడు చెబుతారు ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేయండి అంటూ కామెంట్ లు చేస్తున్నారు. మరి ఇద్దరూ తమ ఎంగేజ్మెంట్ గురించి పెళ్లి గురించి ఎప్పుడు స్పందిస్తారో తెలియాల్సి ఉంది. రష్మిక కెరియర్ విషయానికి వస్తే ఇటీవల కుబేర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. ఇక ఈ సినిమాతో పాటు థామా అనే హర్రర్ సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో హిట్ కొట్టి తదుపరి సినిమా పనులలో బిజీగా ఉన్నారు.

Also Read: Big tv Kissik Talks: మహేష్ విట్టా లవ్ లో ఇన్ని ట్విస్టులా.. నా ఆటోగ్రాఫ్ సినిమాని తలపిస్తోందిగా?

Related News

Chiranjeevi -Venkatesh: 80’s స్టార్స్ రీయూనియన్.. స్పెషల్ ఫ్లైట్ లో చిరు.. వెంకటేష్!

OG Movie: యూట్యూబ్‌లోకి వచ్చేసిన ‘ఓజి’ కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్.. ఎంజాయ్ పండుగో!

Sandhya Shantaram: ప్రముఖ నటి కన్నుమూత, బాలీవుడ్ లో అలుముకున్న విషాదఛాయలు

Tollywood: శశివదనే ప్రెస్ మీట్.. క్లైమాక్స్ ట్విస్ట్ కోసమైనా మూవీ చూడాల్సిందే!

Kalki 2: నాగ్ అశ్విన్ మూవీలో సాయి పల్లవి.. కల్కి 2లోనా? వేరే మూవీనా? ఇదిగో క్లారిటీ

Rahul Ramakrishna: ట్రోల్స్ ఎఫెక్ట్… ప్రజా సేవలోకి దిగిన రాహుల్ రామకృష్ణ

Hrithik Roshan: వార్ 2 సినిమాపై ఓపెన్ అయిన హృతిక్.. గాయంలా ఉండాల్సిన పనిలేదంటూ!

Big Stories

×