BigTV English

SV Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్‌లో కొత్త మూవీ… కొరియన్ నుంచి హీరోయిన్.. రెమ్యునరేషన్ ఎంతంటే ?

SV Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్‌లో కొత్త మూవీ… కొరియన్ నుంచి హీరోయిన్.. రెమ్యునరేషన్ ఎంతంటే ?

SV Krishna Reddy:దిగ్గజ దర్శకుడిగా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి (SV Krishna Reddy)రచయిత, సంగీత దర్శకుడు, నటుడుగా కూడా ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా విభిన్న కళలలో ప్రవేశం ఉన్న వ్యక్తిగా పేరు దక్కించుకున్న ఈయన.. కే.అచ్చిరెడ్డి తో కలిసి పలు చిత్రాలు రూపొందించి.. భారీ సక్సెస్ సొంతం చేసుకున్నారు. యమలీల, మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, ఘటోత్కచుడు సర్దుకుపోదాం రండి ఇలా ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈయిన చివరిగా 2023లో ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా ఎస్వీ కృష్ణారెడ్డి మార్కును చూపించలేకపోయింది.


మరో కొత్త మూవీ తో ఎస్వీ కృష్ణారెడ్డి..

అయితే ఇప్పుడు తాజాగా ఈయన మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘వేదవ్యాస్’ అనే టైటిల్ తో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీకి సంబంధించి పూజా కార్యక్రమాలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సినిమా కోసం హీరోయిన్ ను ఏకంగా కొరియన్ నుంచి తీసుకురావడం గమనార్హం. హీరోయిన్ కు రెమ్యునరేషన్ లక్ష డాలర్లు ( 86 లక్షల రూపాయలు ) రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారట. రెమ్యూనరేషన్ తో పాటు ఇక్కడ స్టే చేయడానికి ఆమెకు అయ్యే మిగతా ఖర్చుల కోసం రూ.35 లక్షలు కేటాయించినట్లు సమాచారం.


కొరియన్ నుంచీ హీరోయిన్.. మంగోలియా నుంచి విలన్..

హీరోయిన్ ను కొరియన్ నుంచి తీసుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి.. ఇప్పుడు విలన్ ను మంగోలియా నుంచి తీసుకున్నట్లు సమాచారం. ఈ విలన్‌కు రెమ్యునరేషన్ లక్షన్నర డాలర్లు ( ఒక కోటి 30 లక్షల రూపాయలు) రెమ్యూనరేషన్ గా ఇవ్వబోతున్నారట. ఈ సినిమాను తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు ప్రస్తుతం హీరో పేరు ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇకపోతే ఎస్వీ కృష్ణారెడ్డి వినూత్న కథలకు పెట్టింది పేరు అలాంటి ఈయన ఏకంగా ఇతర ప్రాంతాల నుంచి హీరోయిన్, విలన్లను తీసుకోబోతున్నట్లు తెలియడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా ఈ సినిమాతో ఎస్వీ కృష్ణారెడ్డి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎస్వీ కృష్ణారెడ్డి కెరియర్..

ఎస్వీ కృష్ణారెడ్డి కెరియర్ విషయానికి వస్తే.. పశ్చిమగోదావరి జిల్లా ఆరవల్లి గ్రామంలో జన్మించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను పూర్తి చేసిన ఈయన.. డిగ్రీ పూర్తి కాగానే సినిమా నటుడిగా అవకాశాల కోసం మద్రాసు వెళ్లారు. నటుడిగా ఎన్నో ప్రయత్నాలు చేసినా అవకాశాలు లభించలేదు. చివరికి ‘పగడాల పడవ’ అనే సినిమాలో పాత్ర లభించింది..కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత ఈయన కోసం ఈయన స్నేహితుడు అచ్చిరెడ్డి నిర్మాతగా మారి సినిమాలను నిర్మించారు.అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి.

ALSO READ:Mohan Babu: ఆ స్టార్ హీరో వారసుడి మూవీలో విలన్‌గా మోహన్ బాబు.. మంచి ఛాయిసే కానీ!

Related News

Manchu Manoj: మిరాయ్ హిట్ పడితే.. మనోజ్ ని ఆపడం ఎవరివల్ల కాదంతే

Akhanda 2: వినయక చవితి రోజు కూడా మౌనమే… బాలయ్య వెనకడుగు లాంఛనమేనా ?

NC24: నాగచైతన్య సినిమాలో లపతా లేడీస్ హీరో.. బాగా గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారే

Mirai Trailer: మిరాయ్ ట్రైలర్ రిలీజ్.. సరికొత్త ప్రపంచంలోకి అడుగు!

Khaidi Remake : ఇంటర్నేషనల్ రేంజ్‌కి లోకేష్ మూవీ… ఆ దేశంలో ఖైదీ రీమేక్..

Big Stories

×