BigTV English

Mohan Babu: ఆ స్టార్ హీరో వారసుడి మూవీలో విలన్‌గా మోహన్ బాబు.. మంచి ఛాయిసే కానీ!

Mohan Babu: ఆ స్టార్ హీరో వారసుడి మూవీలో విలన్‌గా మోహన్ బాబు.. మంచి ఛాయిసే కానీ!

Mohan Babu:ప్రస్తుత కాలంలో చాలామంది సెలబ్రిటీలు రీ ఎంట్రీ ఇస్తూ మళ్లీ తమ గుర్తింపును సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి కొంతమంది హీరోలుగానే కొనసాగితే.. మరికొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో సరిపెట్టుకుంటున్నారు. ఇంకొంతమంది విలన్ గా అవుతారమెత్తి తమలోని మరో యాంగిల్ ను చూపిస్తున్నారు. ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ లో శివాజీ (Sivaji ),జగపతిబాబు (Jayapathi Babu) లాంటి దిగ్గజ హీరోలు విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వీరి బాటలోనే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu)కూడా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఈయన ఒక స్టార్ హీరో వారసుడి సినిమాలో విలన్ గా నటించబోతున్నట్లు సమాచారం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


ఆ స్టార్ హీరో వారసుడి సినిమాలో విలన్ గా మోహన్ బాబు..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దివంగత నటులు సూపర్ స్టార్ కృష్ణ (Krishna) మనవడు, దివంగత హీరో రమేష్ బాబు(Ramesh Babu) తనయుడు జయకృష్ణ (Jaya Krishna) హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిసిందే. ఈ చిత్రానికి ఆర్ఎక్స్ 100 , మంగళవారం సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా ద్వారా ప్రముఖ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ (Raveena Tandon) కుమార్తె రాషా థడాని (Rasha tadani) కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమా ద్వారా విలన్ గా సీనియర్ హీరో అని తీసుకోవాలని అనుకున్నారట. అలా మొంచు మోహన్ బాబు దగ్గరకు వెళ్లి చిత్ర బృందం సంప్రదించగా ఆయన కూడా ఈ సినిమాలో విలన్ గా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. మొత్తానికైతే ఒక స్టార్ హీరో మనవడి డెబ్యూ సినిమా కోసం మోహన్ బాబును ఎంపిక చేసుకోవడం మంచి ఛాయిసే కానీ ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుంది అనే వార్తలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి మోహన్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలా సినిమాలలో విలన్ గానే నటించారు. ఇప్పుడు ఆ పాత్రను ఆయన మళ్లీ వెలికితీయబోతున్నట్లు తెలుస్తోంది.


మోహన్ బాబు సినిమాలు..

మోహన్ బాబు కెరియర్ విషయానికి వస్తే.. పరుస పెట్టి సినిమాలు చేస్తూ మళ్ళీ ఇండస్ట్రీలో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన మొదటి కొడుకు మంచు విష్ణు (Manchu Vishnu) ప్రెస్టేజియస్ మూవీ కన్నప్ప (Kannappa) సినిమాలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన వారసురాలు మంచు లక్ష్మి (Manchu Lakshmi) నటిస్తున్న ‘దక్ష’ సినిమాలో కూడా ఈయన నటిస్తున్నారు.. నాలుగేళ్ల క్రితం ‘అగ్ని నక్షత్రం’ పేరిట ఈ సినిమా టైటిల్ ని ప్రకటించగా.. ఇప్పుడు టైటిల్ ని మారుస్తూ రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో రాబోతున్న ఈ సినిమాని మంచు లక్ష్మి దాదాపు పదేళ్ల తర్వాత తన సొంత బ్యానర్ పై నిర్మిస్తూ ఉండడం గమనార్హం.

 

ALSO READ:Bigg Boss 9: అగ్నిపరీక్ష ప్రోమో రిలీజ్.. బలపరీక్షలో కసితీరా?

Related News

NC24: నాగచైతన్య సినిమాలో లపతా లేడీస్ హీరో.. బాగా గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారే

Mirai Trailer: మిరాయ్ ట్రైలర్ రిలీజ్.. సరికొత్త ప్రపంచంలోకి అడుగు!

SV Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్‌లో కొత్త మూవీ… కొరియన్ నుంచి హీరోయిన్.. రెమ్యునరేషన్ ఎంతంటే ?

Khaidi Remake : ఇంటర్నేషనల్ రేంజ్‌కి లోకేష్ మూవీ… ఆ దేశంలో ఖైదీ రీమేక్..

Hero Madhavan : భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న హీరో మాధవన్.. టెన్షన్ లో ఫ్యాన్స్..!

Big Stories

×