Mirai Trailer: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి సత్తా చాటుతున్న అతి తక్కువ మంది చైల్డ్ ఆర్టిస్టులో ప్రత్యేకంగా నిలిచిన వారు తేజ సజ్జ (Teja sajja). ఒకప్పుడు తన అమాయకత్వంతోనే కాదు అద్భుతమైన డైలాగ్ డెలివరీతో అందరినీ ఆకట్టుకున్న తేజ.. సమంత (Samantha) ఓ బేబీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి.. ‘జాంబిరెడ్డి’ సినిమాతో హీరోగా మారారు. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో ‘హనుమాన్’ సినిమా చేసి పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకోవడమే కాకుండా సూపర్ హీరోగా మారిపోయారు. అలాంటి ఈయన ఇప్పుడు తాజాగా ‘మిరాయ్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్(Manchu Manoj) విలన్ గా నటిస్తున్నారు. ఎపిక్ ఫాంటసీ యాక్షన్ డ్రామాగా పాన్ ఇండియా వైడ్ విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్నారు.
టీజర్ తో అంచనాలు పెంచిన మిరాయ్..
సెప్టెంబర్ 12వ తేదీన అంతర్జాతీయ స్థాయిలో 2D, 3D ఫార్మేట్ లలో విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి గతంలో టీజర్ విడుదల చేయగా.. ఇది భారీ సక్సెస్ అందుకుంది. ముఖ్యంగా ఇందులో హై వి ఎఫ్ ఎక్స్ సన్నివేశాలు టీజర్ కు మరింత హైలెట్ గా నిలిచాయి. ఇందులో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. జగపతిబాబు, జయరాం, శ్రియా శరన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి గౌరహరి సంగీతం సమకూర్చగా.. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ కూడా అందించారు. ఇకపోతే భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
మిరాయ్ ట్రైలర్ రిలీజ్..
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ మిరాయ్ మూవీ నుండి ట్రైలర్ ను ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్లో 12:06 గంటలకు రిలీజ్ చేశారు.3 నిమిషాల 07 సెకండ్స్ నిడివితో రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ అభిమానులలో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. సూపర్ యోధ గెటప్ లో తేజా సజ్జ చాలా అద్భుతంగా నటించారు.
ట్రైలర్ విషయానికి వస్తే..
“ఈ ప్రమాదం ప్రతి గ్రంధాన్ని చేరబోతోంది” అనే వాయిస్ తో ట్రైలర్ మొదలవుతుంది. విలన్ గా నటిస్తున్న మంచు మనోజ్ తన శక్తులతో ప్రజలను హింసించే గెటప్లో చాలా అద్భుతంగా నటించారు. ఆపదలో ఉన్న ప్రజలను కాపాడడానికి హీరోయిన్ హీరోని కలిసి మిరాయ్ ను చేరుకోవాలి అంటూ కోరుకుంటుంది. ఈ “దునియాలో ఏది నీది కాదు భయ్యా.. అన్నీ అప్పే.. ఈరోజు నీ దగ్గర. రేపు నా దగ్గర” అంటూ తేజ డైలాగ్ ఆకట్టుకుంది. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాతో మంచు మనోజ్ మరింత హైలెట్ అయ్యేలా కనిపిస్తున్నారు. త్రేతా యుగం నాటి కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో శ్రియ శరన్, జగపతిబాబు తమ తమ గెటప్లతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోనున్నారు. ముఖ్యంగా ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లబోతున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ సినిమాతో ఒక కొత్త ప్రపంచంలోకి తేజా మనల్ని తీసుకు వెళ్ళబోతున్నారని చెప్పవచ్చు. సెప్టెంబర్ 12న చాలా గ్రాండ్గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.