Rose water : రోజ్ వాటర్ చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని తాజాగా, ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రోజ్ వాటర్‌లో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ గుణాలు చర్మ సమస్యలను తగ్గించి, సహజమైన గ్లోను అందిస్తాయి. దీనిని ప్రతిరోజూ వాడడం వల్ల చర్మానికి ఎన్నో లాభాలు ఉంటాయి.
రోజ్ వాటర్ వలన చర్మానికి కలిగే లాభాలు:
pH బ్యాలెన్స్: చర్మం యొక్క pH బ్యాలెన్స్‌ను రోజ్ వాటర్ సమతుల్యం చేస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ: రోజ్ వాటర్ వాపులను, ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది. మొటిమలు, చర్మంపై దద్దుర్లు ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
మాయిశ్చరైజర్: రోజ్ వాటర్ చర్మానికి తేమను అందిస్తుంది, ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
వృద్ధాప్య లక్షణాల నివారణ: రోజ్ వాటర్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు, సన్నని గీతలు రాకుండా నివారిస్తాయి.
రోజ్ వాటర్‌ను వాడే పద్ధతులు:
1. రోజూ వాడే క్లెన్సర్‌గా:
ఒక కాటర్ బాల్ తీసుకుని రోజ్ వాటర్‌లో ముంచి, దానితో ముఖాన్ని సున్నితంగా తుడిస్తే చర్మంపై ఉన్న దుమ్ము, నూనె, ఇతర మలినాలు తొలగిపోతాయి. ఇది చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేస్తుంది.
2. టోనర్‌గా:
ముఖం కడిగిన తర్వాత.. రోజ్ వాటర్‌ను ఒక స్ప్రే బాటిల్‌లో నింపుకుని ముఖంపై స్ప్రే చేసుకోవచ్చు లేదా కాటన్ తో రాసుకోవచ్చు. ఇది చర్మ రంధ్రాలను బిగుతుగా చేసి, చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. మేకప్ వేసుకునే ముందు టోనర్‌గా వాడితే, మేకప్ ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది.
3. మేకప్ రిమూవర్‌గా:
రోజ్ వాటర్, కొబ్బరి నూనెను సమపాళ్లలో కలిపి.. పత్తి సహాయంతో మేకప్‌ను సులభంగా.. సున్నితంగా తొలగించుకోవచ్చు.
4. ఫేస్ మాస్క్‌లలో:
రోజ్ వాటర్‌ను వివిధ ఫేస్ మాస్క్‌లలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు.. ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే, అది చర్మంలోని అధిక నూనెను గ్రహించి, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
5. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్‌కు:
రెండు కాటర్ బాల్‌ను రోజ్ వాటర్‌లో ముంచి, కళ్ళు మూసుకుని వాటిపై పది నిమిషాలు ఉంచితే కళ్ళ కింద అలసట, వాపు తగ్గుతాయి.
6. స్కిన్ మిస్ట్‌గా:
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచుకోవడానికి ఒక స్ప్రే బాటిల్‌లో రోజ్ వాటర్ నింపుకుని, తరచూ ముఖంపై స్ప్రే చేసుకోవచ్చు. ఇది చర్మాన్ని చల్లగా, తేమగా ఉంచుతుంది.
మార్కెట్‌లో లభించే కృత్రిమ రోజ్ వాటర్‌కు బదులుగా, సహజమైన, స్వచ్ఛమైన రోజ్ వాటర్‌ను ఎంచుకోవడం ముఖ్యం. రోజ్ వాటర్‌ను ఒకే రాత్రిలో గ్లో కోసం వాడకుండా, ప్రతిరోజూ ఒక అలవాటుగా చేసుకుంటే దీర్ఘకాలంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీరు మీ చర్మ సంరక్షణలో రోజ్ వాటర్‌ను చేర్చుకుని.. దాని అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.