BigTV English

NC24: నాగచైతన్య సినిమాలో లపతా లేడీస్ హీరో.. బాగా గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారే

NC24: నాగచైతన్య సినిమాలో లపతా లేడీస్ హీరో.. బాగా గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారే
Advertisement

NC24: తండేల్ సినిమాతో పాన్ ఇండియా ప్రపంచంలోకి అడుగుపెట్టాడు అక్కినేని నాగ చైతన్య. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో  వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య నటిస్తున్న చిత్రాల్లో NC24. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని BVSN ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చై సరసన మీనాక్షీ చౌదరి నటిస్తోంది. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.


విరూపాక్ష సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు కార్తీక్ దండు. ఆ సినిమా తరువాత దానికి మించి భయపెట్టడానికి భారీ ప్లాన్ తోనే  వస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలోకి బాలీవుడ్ నటుడిని దింపాడు కార్తీక్ దండు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన లపతా లేడీస్ సినిమా గురించి అందరికి తెల్సిందే. ఆస్కార్ నామినేషన్స్ లో ఈ సినిమా ఉండడంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా దానివైపు చూసింది.

ఆమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోగా నటించి మెప్పించిన స్పర్ష్ శ్రీవాస్తవ  ఇప్పుడు టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. స్పర్ష్.. NC24 లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. నేడు అతని పుట్టినరోజు కావడంతో మేకర్స్ స్పర్ష్ ని చిత్రంలోకి అధికారికంగా ఆహ్వానిస్తూ బర్త్ డే విషెస్ తెలిపారు.” ఇప్పటివరకు ఈ ప్రపంచం అతని అందమైన ముఖాన్నేచూసింది. ఇప్పుడు మునుపెన్నడూ చూడని అవతారాన్ని చూడబోతుంది. హ్యాపీ బర్త్ డే స్పర్ష్ శ్రీవాస్తవ. NC24 ప్రపంచంలోకి స్వాగతం” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.


ఇక  లపతా లేడీస్ హీరోను రంగంలోకి దింపేసరికి ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువ అయ్యాయి. మొదటి నుంచి హర్రర్ సినిమాలు అంటే చైకు భయం.  అసలు చూసేవాడు కాదని ఆయనే ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. కానీ, డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను మెప్పించడానికి చై ఆ భయాన్ని కూడా పక్కనపెట్టి ఇలాంటి కథలను చేస్తున్నాడు. ఇక పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తుండడంతో బాలీవుడ్ లో మార్కెట్ కోసం స్పర్ష్ లాంటివారిని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఈసారి చై బాగా గట్టిగా చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో చై తండేల్ విజయాన్ని కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.

Related News

Pawan Kalyan: పవన్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన దిల్ రాజు .. ఫస్ట్ టైం ఆ పాత్రలో పవర్ స్టార్?

Samantha -Raj Nidumori: డైరెక్టర్ రాజ్ పోస్ట్ పై సమంత కామెంట్స్.. రిలేషన్ బయట పెట్టినట్టేనా?

Mass Jathara: మాస్ జాతర టైటిల్ ఆలోచన అతనిదేనా.. ఈ టాలెంట్ కూడా ఉందా బాసు?

Nani Sujeeth : నాని సరసన పూజ హెగ్డే, సెంటిమెంటును ఛాలెంజ్ చేస్తున్న సుజీత్ 

Raviteja-Sreeleela: శ్రీ లీల నటన పై రవితేజ కామెంట్స్.. ఇంకా బయట పెట్టలేదంటూ!

Prabhas: ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రానున్న అప్డేట్స్ , సుకుమార్ కల నెరవేరినట్లే

Akhanda 2 : అఖండ 2 టీం కు జియో హాట్ స్టార్ కండిషన్స్, మరి ఇంతలో ఇన్వాల్వ్ అవుతారా?

Suriya 46 : అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన మాస్ మహారాజా కొడుకు, యాక్టింగ్ కు దూరమైనట్లేనా? 

Big Stories

×