BigTV English

Telangana Politics: పొన్నం టార్గెట్ రీచ్ అవుతాడా?

Telangana Politics: పొన్నం టార్గెట్ రీచ్ అవుతాడా?

Telangana Politics: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోకస్ పెట్టారట.. సిద్దిపేట జిల్లాతో పాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ సెగ్మెంట్లో మెజార్టీ స్థానాలు గెలుచుకోవడంపై దృష్టి సారిస్తున్నారంట. విజయావకాశాలపై సర్వేలు చేయించుకుంటూ ఆ దిశగా పావులు కదుపుతున్నారంట. సర్వే నివేదిక రాగానే లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిచే నేతలు, వారికి ఉన్న బలం బలహీనతలపై కార్యకర్తలతో సమావేశానికి సిద్ధం అవుతున్నరాట.


సిద్దిపేట జిల్లాలో తనదైన ప్రత్యేక చాటుకుంటున్న హుస్నాబాద్

సిద్దిపేట జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో హుస్నాబాద్ నియోజకవర్గానిది ఒక ప్రత్యేక చరిత్ర.. జిల్లాలో మరెక్కడా లేని విధంగా అక్కడ కొత్తగా వచ్చిన నేతలను అక్కున చేర్చుకుంటారు హుస్నాబాద్ ఓటర్లు. ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా తెరపైకి వచ్చినవారే అక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచి రాజకీయాల్లో ఫోకస్ అవుతుంటారు. అలాంటి నాయకుడే రాష్ట్ర బిసి సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.


సెప్టెంబరు నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు

హుస్నాబాద్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాదు తన కంచుకోటగా మార్చుకోవడానికి మంత్రి పొన్నం అదే పనిగా శ్రమిస్తున్నారట. సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు హైకోర్టు ఆదేశించడంతో అన్ని పార్టీల శ్రేణుల్లో జోష్ పెరిగింది. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ అంతకు ముందే స్థానిక సంస్థ ఎన్నికల రంగంలోకి దిగి కసరత్తు మొదలుపెట్టారంట. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉన్నారంట.. పార్టీ కోసం కష్టపడ్డ వారికే టికెట్లు ఇవ్వాలని.. ఇవ్వలేని పక్షంలో నామినేటెడ్ పదవులను జిల్లా స్థాయిలో కట్టబెట్టాలంటూ సీఎం సూచించారు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ వెనువెంటనే కార్యాచరణకు పదును పెట్టి ఆచరణకు పూనుకున్నారట.

దశాబ్దంగా హుస్నాబాద్‌లో పట్టు కోల్పోయిన కాంగ్రెస్

హుస్నాబాద్ నియోజకవర్గంలో దశాబ్దకాలంగా పట్టును కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం సాధించే దిశగా పొన్నం ప్రభాకర్ కసరత్తు మొదలు పెట్టారంట . ప్రత్యర్థుల కంటే ముందే రంగంలోకి దిగి పార్టీ క్యాడర్‌ను అప్రమత్తం చేసి సన్నద్ధం చేయడం ద్వారా మరోమారు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్నే పునరావృతం చేయాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో ప్లాస్టిక్‌ను సమూలంగా లేకుండా చేయాలని స్టీల్ బ్యాంక్ పేరిట మహిళలను ఏకం చేస్తున్నారట.

రూ.2.5 కోట్లతో స్వశక్తి సంఘాలకు ఉచితంగా స్టీల్ బ్యాంకు

ఇటీవలే తన తండ్రి పేరిట రూ. 2.5 కోట్లతో కోహెడ మండలం లో స్వశక్తి సంఘాలకు ఉచితంగా స్టీల్ బ్యాంకు అందజేశారు. ఎన్నికల్లో మహిళా ఓట్లు చీలిపోకుండా గ్రామ గ్రామానికి స్టీల్ బ్యాంక్ అందజేస్తూ మహిళలను స్థానిక ఎన్నికల్లో నిలబెట్టేందుకు వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, బీమాదేవరపల్లి, ఎల్కతుర్తి, సైదాపూర్, చిగురుమామిడి,ల్లో వరుసగా పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మొట్టమొదట సారిగా నోటిఫికేష్‌కు ముందే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను ఎన్నికలకు సంసిద్ధం చేస్తున్నారట.

గ్రామీణ ప్రజల సమస్యల పరిష్యారానికి చొరవ

స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేయడం… ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో పార్టీ యంత్రాంగం తీసుకోవల్సిన చొరవ గురించి దిశానిర్దేశం చేసి పార్టీ క్యాడర్‌ను మంత్రి పొన్నం అలెర్ట్ చేస్తున్నారంట. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి పొన్నం పోటీ చేసి విజయం సాధించారు. ఆ వెంటనే జరిగిన లోక్ సభఎన్నికల్లోనూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మిగతా సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ రెండోస్థానంలో నిలిచినా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కంటే అధికంగా మెజారిటీ లభించింది.

లోకల్ బాడీ ఎలక్షన్స్ పై ముందుగానే అప్రమత్తమైన పొన్నం

మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యూహాత్మకంగా మొదటి నుంచి పావులు కదిపి గ్రామస్థాయి నుంచి పార్టీ యంత్రాంగాన్ని రంగంలోకి దింపడం వల్లే రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు హుస్నాబాద్ నియోజకవర్గంలో మాత్రం పట్టు చిక్కకుండాపోయింది. ఆ క్రమంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా మంత్రి పొన్నం ముందస్తుగానే అప్రమత్తయ్యారట.

Also Read: అమెరికా 50% పన్ను ప్రభావం.. 40 దేశాల్లో స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తోన్న భారత్

ఆయన కృషితో దశాబ్దకాలం తర్వాత స్థానిక సంస్థల పదవులపై కాంగ్రెస్ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత పదేళ్లుగా దాదాపు పదవులన్నీ బీఆర్ఎస్ ఖాతాలోనే పడటంతో పార్టీ నేతలు, కార్యకర్తలు పదవుల కోసం అవురవురామన్నట్టు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సర్పంచు, ఎంపీటీసీ, జడ్బీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా గ్రామస్థాయి నుంచి పట్టును మరింతగా పెంచుకోవాలనే దిశగా మంత్రి పొన్నం ప్రభాకర్ మండలాల వారీగా నేతలకు గైడ్ చేస్తున్నారు. మరి విజయమే లక్ష్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో అన్ని స్థానాలు కైవసం చేసుకోవాలనే మంత్రి సంకల్పం నెరవేరుతుందా ? కాంగ్రెస్ శ్రేణుల ఆశలు నెరవేరుతాయా చూడాల్సిందే..

Story By Ajay Kumar, Bigtv

Related News

Kothagudem Congress: కొత్తగూడెంలో కాంగ్రెస్‌కు కష్టాలు తప్పవా?

Jani Master: బిగ్ బాస్‌లోకి జానీ మాస్టర్ అసిస్టెంట్… ఇక హౌజ్‌లో రచ్చ రచ్చే

AP Politics: కొత్త కార్యచరణతో దూకుడు పెంచాలని చూస్తున్న జగన్.. ఎందుకంటే!

BJP Politics: ముగ్గురూ ముగ్గురే.. ముఖం చాటేస్తున్న లీడర్లు

AP Politics: టీడీపీకి పిల్లి సత్తిబాబు రాజీనామా.. కారణం ఇదేనా?

Big Stories

×