Manchu Manoj: మంచు మోహన్ బాబు చిన్న కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు మంచు మనోజ్. వరుస సినిమాలు చేస్తూ వస్తూనే సడెన్ గా ఇండస్ట్రీ నుంచి కొంతకాలం దూరమయ్యాడు. ఫ్యామిలీ సమస్యలు, రెండో పెళ్లి..అన్న విష్ణుతో ఆస్తి గొడవలు ఇలా ఎన్ని ఉన్నా తన కెరీర్ ను మళ్లీ సెట్ చేసుకొనే పనిలో పడ్డాడు. ఈ ఏడాది భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కొద్దిపాటి విలనిజాన్ని చూపించిన మనోజ్.. మిరాయ్ తో తనలోని నట విశ్వరూపాన్ని చూపించడానికి సిద్దమవుతున్నాడు.
తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మిరాయ్. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే మనోజ్ క్యారెక్టర్ కు సంబంధించిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో మనోజ్ విలనిజం ఒక రేంజ్ లో ఉండబోతుందని హింట్ ఇచ్చారు. సినిమాకు మనోజ్ నే హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. నా గతం నక్షత్రం.. నా ప్రస్తుతం ఊహాతీతం అంటూ చెప్పే డైలాగ్ తోనే విలన్ గా మనోజ్ ఎలా ఉండబోతున్నాడో అర్ధమవుతుంది. ఆ లుక్, ఆ గాంభీర్యం.. ఆ బేస్ వాయిస్.. పర్ఫెక్ట్ విలన్ గా సెట్ అయ్యాడు.
కథను బట్టి.. మనోజ్ ఒక అతీంద్ర శక్తులు ఉన్న మాంత్రికుడు. ప్రపంచాన్ని మొత్తం తన గుప్పిట్లో పెట్టుకోవాలని క్షుద్ర పూజలు చేస్తూ.. తొమ్మిది గ్రంధాలను చేజిక్కించుకొని మిరాయ్ ను సొంతం చేసుకొని ఈ లోకానికి రాజు అవ్వాలనే దురాశ కలిగినవాడు. దానికోసం ఎంతమందిని అయినా చంపడానికి సిద్ధపడతాడు. అతడిని ఆపడానికి ఒక యోధుడు పుడతాడు. ఆ యోధుడుకి అండగా శ్రీరాముడు నిలబడతాడు. త్రేతాయుగంలో మంచి- చెడుల మధ్య జరిగే యుద్ధమే మిరాయ్. మొదటి షాట్ లోనే మనోజ్ బట్టలు లేకుండా పూజలు చేస్తున్నట్లు చూపించారు. దాంతోనే అర్ధమవుతుంది మనోజ్ ఈ సినిమా కోసమా ఎంత కష్టపడ్డాడో అని. ఈ సినిమా కనుక హిట్ అయితే మనోజ్ కు మంచి భవిష్యత్ ఉందని చెప్పొచ్చు.
సెప్టెంబర్ 12 న మిరాయ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ ను బట్టి ఈ సినిమాకు హైలైట్ అంటే మనోజ్ అని చెప్పొచ్చు. కొద్దిగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా అది మనోజ్ కి మంచి గుర్తింపును తీసుకొస్తుంది అని చెప్పొచ్చు. ఈమధ్య హీరోల కంటే ఎక్కువ నెగిటివ్ రోల్స్ చేస్తున్నవారే హైలైట్ గా నిలుస్తున్నారు. ఇప్పుడు వారికే ఎక్కువ డిమాండ్ ఉంది. మిరాయ్ కనుక హిట్ అయితే నెక్స్ట్ కుర్ర విలన్ గా మనోజ్ సెటిల్ అవుతాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి మిరాయ్ తరువాత మనోజ్ విలన్ గానే కంటిన్యూ అవుతాడా.. ? లేక హీరోగా కూడా చేస్తాడా.. ? అనేది తెలియాలి. ప్రస్తుతానికి మిరాయ్ కాకుండా మనోజ్ హీరోగా రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అందులో ఒకటి డేవిడ్ రెడ్డి. మరి ఇందులో మంచు వారసుడు హీరోనా.. ? విలనా.. ? అనేది చూడాలి.