BigTV English

Khaidi Remake : ఇంటర్నేషనల్ రేంజ్‌కి లోకేష్ మూవీ… ఆ దేశంలో ఖైదీ రీమేక్..

Khaidi Remake : ఇంటర్నేషనల్ రేంజ్‌కి లోకేష్ మూవీ… ఆ దేశంలో ఖైదీ రీమేక్..

Khaidi Remake : తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అంటే వినిపించే పేరు లోకేష్ కనకరాజు.. ఇటీవల ఈయన సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమా ఒకవైపు మిక్స్డ్ టాక్ ని అందుకున్న సరే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఇప్పటికీ కలెక్షన్ల మోత మోగిస్తుంది. లోకి డైరెక్షన్లో వచ్చిన ఖైదీ, విక్రమ్, మాస్టర్, లియో సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచాయి. ఈ డైరెక్టర్ తో సినిమాలు చేసేందుకు తమిళ స్టార్ హీరోలు మాత్రమే కాదు.. ఇటు తెలుగు స్టార్ హీరోలు కూడా ఆసక్తి కనపరుస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ తమిళ హీరో కార్తీ కాంబినేషన్లో వచ్చిన ఖైదీ మూవీకి సీక్వెల్ గా మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.. ఈ చిత్రానికి తాజాగా టైటిల్ ఫిక్స్ చేసినట్లు కోలీవుడ్ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది..


కార్తీ- లోకీ మూవీ టైటిల్ ఫిక్స్.. 

డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, తమిళ హీరో కార్తీ తో చేసిన ‘ఖైదీ’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు.. ఆ మూవీ వచ్చి కూడా చాలా కాలం అవుతుంది. అయితే ఇన్నాళ్లకు ఈ మూవీకి సీక్వెల్ గా మరో మూవీ రాబోతుంది. ఈ ఏడాది చివరి నుండి షూటింగ్ మొదలు అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మూవీ కన్నా ముందు మరో మల్టీ స్టార్ అని మూవీ ని తెరకెక్కించబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అని తర్వాత ఖైదీకి సీక్వెల్ కి రాబోతున్న సినిమాని పట్టాలెక్కించే అవకాశం ఉందని కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్.. ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీకి టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ – కార్తీ మూవీ ఖైదీని మలేషియాలో రీమేక్ చేస్తున్నారు. దానికి బందువాన్ అనే టైటిల్ పెడుతున్నారని సమాచారం. త్వరలోనే దీనిపై మూవీ టీమ్ అనౌన్స్ చెయ్యనున్నారు.


Also Read : భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న హీరో మాధవన్.. టెన్షన్ లో ఫ్యాన్స్..!

స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా.. 

తమిళ స్టార్ హీరోలైన రజినీకాంత్, కమల్ హాసన్ లతో లోకేష్ కనకరాజు సినిమా చేయబోతున్నట్లు గత కొద్దిరోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇద్దరు వయసు మళ్లిన గ్యాంగ్‌స్టర్ల కథ అని తెలుస్తుంది. హీరోల ఇమేజ్‌కు తగ్గట్టుగా లోకేష్ కనగరాజ్ ఈ కథను సిద్ధం చేశాడని.. ఈ కథకు ఇద్దరు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించబోతుందని సమాచారం. అటు హీరో కార్తీ ప్రస్తుతం సర్దార్‌-2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదేవిధంగా మార్షల్‌ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. కల్యాణి ప్రియదర్శన్‌ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి తమిళ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీని తర్వాత సుందర్‌ సి నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ చిత్ర షూటింగ్‌ డిసెంబర్‌లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది..

Related News

‎NBK 111: గోపీచంద్ – బాలయ్య మూవీ పై బిగ్ అప్డేట్.. చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుందంటూ!

Rishab Shetty: హ్యట్సాఫ్ రిషబ్‌ శెట్టి.. క్లైమాక్స్‌ సీన్‌ కోసం ఇంతలా కష్టపడ్డారా?

Raviteja: ఆ హీరో బయోపిక్ ఆలోచనలో రవితేజ..సాధ్యం అయ్యేనా?

‎Pradeep Ranganathan: ఫౌజీ సినిమా పై టంగ్ స్లిప్ అయిన ప్రదీప్ రంగనాథన్..ఇలా చెప్పాడేంటీ?

Salman Khan: అందుకే సికిందర్‌ కంటే మదరాసి బ్లాక్‌బస్టర్‌.. డైరెక్టర్‌ మురుగదాస్‌కి సల్మాన్‌ కౌంటర్‌!

SSMB 29: మార్కెట్లోకి SSMB 29 పెండెంట్స్..ఒక్క పోస్టర్ తో భారీ హైప్.. ఇదెక్కడి క్రేజ్ రా బాబు!

‎Mouli Tanuj: లిటిల్ హార్ట్స్ ఎఫెక్ట్.. రూ. కోటి రెమ్యూనరేషన్..మౌళి రియాక్షన్ ఇదే?

Raashii Khanna: అది బూతు అని నాకు తెలియదు, రాశి ఖన్నా కంప్లీట్ క్లారిటీ

Big Stories

×