Akhanda 2:నటసింహ నందమూరి బాలకృష్ణ.. ఒకవైపు హీరోగా.. మరొకవైపు రాజకీయ నాయకుడిగా.. ఇంకొక వైపు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ బిజీగా మారిపోయారు. అంతేకాదు తన తల్లి పేరు మీద ‘బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్’ నిర్మించి ఎంతోమందికి ఉచితంగా వైద్యం కూడా అందిస్తున్నారు బాలయ్య. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ మంచి మనసున్న వ్యక్తిగా పేరు సొంతం చేసుకున్న ఈయన ఏడుపదుల వయసులో కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ప్రతి సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటూ ఎంతోమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన నటిస్తున్న చిత్రం అఖండ 2. గతంలో వచ్చిన అఖండ సీక్వెల్ గా రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
వినాయక చవితి స్పెషల్.. అఖండ 2 నుండి నో అప్డేట్..
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి మొదట్లో సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘ఓజీ’ సినిమాకు పోటీగా విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ షూటింగ్ వాయిదా పడడంతో డిసెంబర్ లో విడుదల చేస్తారని వార్తలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇప్పుడు మరొకసారి ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఏదైనా పండుగ వచ్చింది అంటే స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్ ను సోషల్ మీడియాలో వదులుతారు. పైగా నిన్న వినాయక చవితి.. చాలామంది హీరోలు తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వదిలారు. కానీ అఖండ 2 నుంచి ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు.
ఆ విషాదమే కారణమా?
దీంతో ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఇప్పుడు కూడా వాయిదా పడడం లాంఛనంగా మారిపోయిందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి అప్డేట్ రాకపోవడానికి కారణం నందమూరి కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం కూడా ఒక కారణమని సమాచారం. ఇటీవలే స్వర్గీయ నందమూరి తారక రామారావు(Sr NTR) పెద్ద కొడుకు నందమూరి జయకృష్ణ (Nandamuri Jaya Krishna), పద్మజ దగ్గుబాటి (Padmaja Daggubati) గత వారం క్రితం అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మరణంతో నందమూరి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. పైగా ఆమె అంత్యక్రియల్లో బాలయ్య పాల్గోనడమే కాకుండా ఆమె పాడే మోసి ఋణం తీర్చుకున్నారు. అటు ఒకవైపు వదిన మరణించిన విషాదంలో మునిగిపోయిన బాలయ్య.. అందుకే షూటింగ్ లకి కూడా హాజరు కాలేదని తెలుస్తోంది.
సినిమా కూడా వాయిదా పడనుందా?
ఈ క్రమంలోనే వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ విడుదల చేయకపోవడం గమనార్హం. ఏది ఏమైనా బాలయ్య మూవీ నుంచి అప్డేట్ వస్తుందని ఎదురుచూసిన అభిమానులకు నిరాశ మిగలడమే కాకుండా.. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోవడం.. విడుదల తేదీ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలిసి అభిమానులు మరింత నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:Mirai Trailer: మిరాయ్ ట్రైలర్ రిలీజ్.. సరికొత్త ప్రపంచంలోకి అడుగు!