Gold Rate Hikes: బంగారం ధరలు తగ్గడం పక్కన పెడితే రోజు రోజుకు మరింత పెరుగుతూ పోతుంది. పసిడి ప్రియులపై బంగారం ధరలు పగబట్టినట్టుగా దూసుకెళుతుంది. బుధవారం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,02,440 ఉండగా.. గురువారం 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,600 వద్ద కొనసాగుతోంది. అలాగే బుధవారం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.93,900కాగా.. గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 94,050 వద్ద పలుకుతోంది. అంటే తులం బంగారం పై రూ.160 పెరిగింది.
పగబట్టిన పసిడి..
ప్రస్తుతం పండుగల వేళ కావడంతో బంగారం ధరలు పరిగెడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయందోళనకు గురవుతున్నారు. బంగారం కొనాలంటేనే ప్రజలు బయపడుతున్నారు. అయితే బంగారం ధరలు సెప్టెంబర్ నెల వరకు 75 వేలు అవుతది అని అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. కాని 75 వేలు పక్కన పెడితే.. లక్ష నుంచి దిగడమే చాలా కష్టంగా ఉంది. ఇక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఆ తండ్రి ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. అన్నట్టుగా ఉంది ప్రస్తుత ఆడపిల్ల తండ్రి పరిస్థితి..
బంగారం ఇంతలా పెరగడానికి అసలు కారణం ఏంటి?
బుధవారం నుంచి స్టార్ట్ అయిన ట్రంప్ 50 శాతం సుంకాల వల్ల బంగారం రేటు మరింత పెరుగుతుంది. ముఖ్యంగా రూపాయి విలువ తగ్గడం వల్ల కూడా బంగారం ధరలు పెరగడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
పలు ప్రాంతాల్లో నేటి బంగారం ధరలు
హైదరాబాద్ నేటి బంగారం ధరలు
హైదరాబాద్‌లో బుధవారం రోజు బంగారం ధరలతో, గురువారం బంగారం ధరలతో పోల్చగా.. రూ.160 పెరిగింది. అంటే నేడు 10 గ్రాముల తులం బంగారం ధర రూ.1,02,600 వద్ద పలుకుతోంది. అలాగే నేడు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 94,050 వద్ద ఉంది.
విశాఖపట్నం బంగారం ధరలు
విశాఖలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,02,600ఉండగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 94,050 వద్ద పలుకుతోంది.
విజయవాడలో బంగారం ధరలు
విజయవాడలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,02,600 కాగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర తులం బంగారం ధర రూ.94,050 వద్ద కొనసాగుతోంది.
ముంభై బంగారం ధరలు
ముంభైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,02,600 ఉండగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.94,050 వద్ద పలుకుతోంది.
ఢీల్లీ బంగారం ధరలు
ఢీల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,02,750 కాగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.94,200 వద్ద ఉంది.
Also Read: డేంజర్‌లో పోచారం డ్యామ్.. 10 ఊర్లు ఖతమ్..!
నేటి సిల్వర్ ధరలు..
బంగారం రేటు పెరిగిన సిల్వర్ రేట్లు మాత్రం కాస్త నిశ్చల స్థితిలోనే ఉన్నాయి. నేటి కేజీ సిల్వర్ రేటు రూ.1,30,000 వద్ద ఉంది. అలాగే కలకత్తా, ఢీల్లీ, ముంభై లో కేజీ సిల్వర్ రేటు రూ.1,20,000 వద్ద కొసాగుతుంది.