Disaster OG: పవన్ కళ్యాణ్ సినిమా అంటే హిట్, ప్లాప్ అనేది ఉండదు. ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు అంతే. పవన్ కు హిట్ రావడం వలన ఫ్యాన్స్ ఎక్కువ అవ్వరు.. ప్లాప్ రావడం వలన తక్కువా అవ్వరు. ఖుషీ నుంచి ఓజీ వరకు పవన్ కు ఆ ఫ్యాన్స్ బేస్ ఎప్పుడు సమానంగానే ఉంటారు. పవన్ కళ్యాణ్ గురించి ఎవరు ఎంత నెగిటివ్ గా చెప్పినా ఆయనకు ఒరిగేది లేదు.. తరిగేది లేదు. ప్రస్తుతం ఇదే మాట పవన్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. దానికి కారణం ఓజీ సినిమాపై పలువురు నెగిటివ్ ప్రచారం చేయడమే.
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఓజీ. ఎన్నో అంచనాల నడుమ నిన్న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో పాటు రికార్డ్ కలక్షన్స్ ను రాబట్టింది. ఒక్కరోజులోనే దాదాపు రూ. 135 కోట్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. అసలు ఓజీలో పవన్ నటన, ఆ స్వాగ్, స్టైలిష్ లుక్.. అబ్బబ్బా ఆ క్యారెక్టర్ గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే.
ఎన్నో ఏళ్ళ తరువాత పవన్ సినిమా విజయం సాధించడం.. పవన్ అభిమానులు సంబురాలు చేసుకోవడం కొంతమందికి గిట్టడం లేదు. అందుకే సోషల్ మీడియాలో #DisasterOG పేరుతో ట్రెండ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సినిమా బాలేదని, రొట్ట కథ అని.. బాలు, పంజా సినిమాలు రెండు మిక్స్ చేసి తీసిన సినిమాకు ఇంత బిల్డప్ ఎందుకు అని చెప్పుకొస్తున్నారు.
ఓజీ డిజాస్టర్ అని, సుజీత్ మరోసారి దెబ్బేసాడని, పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇంకో డిజాస్టర్ యాడ్ అయ్యిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ట్రెండ్ పై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మా హీరో హిట్ కొట్టాడని ఓర్వలేక కొందరు ఇలాంటి ట్రెండ్ సృష్టిస్తున్నారు. వాళ్ళు అసలు సినిమా చూసారా.. సినిమాలో ఏది నచ్చలేదో చెప్పమనండి. లోపల సినిమా నచ్చినా పైకి మాత్రం నెగిటివ్ ట్రెండ్ సృష్టిస్తూ పవన్ ను నెగిటివ్ చేయాలని చూస్తున్నారు. కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా. పవన్ పై నెగిటివ్ చేస్తే ఆయనకు ఏమి కాదు అంటూ చెప్పుకొస్తున్నారు.