E-Paper
Advertisement

ఆఫీస్ vs వర్క్ ఫ్రమ్ హోమ్.. డబ్బు ఆదాకు ఏది బెస్ట్? ChatGPT షాకింగ్ రిపోర్ట్!

ఆఫీస్ vs వర్క్ ఫ్రమ్ హోమ్.. డబ్బు ఆదాకు ఏది బెస్ట్? ChatGPT షాకింగ్ రిపోర్ట్!
Advertisement

OFFICE vs WFH: మారుతున్న కాలంతో పాటు ఉద్యోగ శైలి కూడా పూర్తిగా మారిపోయింది. కోవిడ్ తర్వాత మొదలైన ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) సంస్కృతి ఇప్పటికీ ఐటీ ఉద్యోగాల్లో కొనసాగుతూనే ఉంది. అయితే ‘ఇంటి నుండి పని చేయడం వల్ల ఎక్కువ డబ్బు ఆదా అవుతుందా? లేదా ఆఫీసుకు వెళ్లి పని చేయడం వల్లనా?’ అని ఒక నెటిజన్ ఏఐ బాట్ ‘చాట్ జీపీటీ’ (ChatGPT)ని ప్రశ్నించాడు. దీనిపై చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానం, అందించిన విశ్లేషణ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

దేని ఖర్చు ఎంత?

నెటిజన్ అడిగిన ప్రశ్నకు చాట్ జీపీటీ లోతైన సమాధానాన్ని అందించింది. కేవలం పైపైన కనిపించే ప్రయాణ ఖర్చులే కాకుండా మనిషి రోజువారీ జీవితంలో పెట్టే ప్రతి చిన్న ఖర్చును కూడా లెక్కగట్టింది. చాట్ జీపీటీ విశ్లేషణ ప్రకారం.. పెట్రోల్ లేదా క్యాబ్ ఛార్జీలు, ఆఫీస్ వేర్ దుస్తులు, బయట తినే లంచ్, స్నాక్స్, వీకెండ్ లో తోటి ఉద్యోగులతో పార్టీలను.. ఆఫీసు ఖర్చుల కింద చాట్ జీపీటీ లెక్కగట్టింది. మరోవైపు కరెంటు బిల్లు, ఇంటర్నెట్ బిల్లులు, ఇంట్లోని తినే స్నాక్స్, టేబుల్ – కుర్చీ కొనుగోలును వర్క్ ఫ్రమ్ హోమ్ ఖర్చు కింద పరిగణలోకి తీసుకుంది.

డబ్బు ఆదా పరంగా..

Advertisement

చాట్ జీపీటీ లెక్కల ప్రకారం.. సాధారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) ద్వారానే ఎక్కువ డబ్బు ఆదా కానుంది. ప్రయాణ ఖర్చులు, రోజువారీ బయటి ఆహారం తగ్గడం వల్ల నెలకు గణనీయమైన మొత్తాన్ని పొదుపు చేయవచ్చని ఏఐ స్పష్టం చేసింది. అయితే ఇక్కడే చాట్ జీపీటీ ట్విస్ట్ ఇచ్చింది. కొందరు ఉద్యోగులు ఇంట్లో ఉంటే ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తారని లేదా స్విగ్గీ, జొమాటోల్లో ఫుడ్ ఆర్డర్లు పెంచుతారని పేర్కొంది. ఒకవేళ ఈ అలవాట్లు ఉంటే WFHలో కూడా జేబు ఖాళీ అవ్వడం ఖాయమని హెచ్చరించింది.

మనీ vs మెంటల్ హెల్త్

ఆర్థిక లెక్కలు తేల్చిన అనంతరం.. చాట్ జీపీటీ సదరు నెటిజన్‌కు ఒక ఊహించని ప్రశ్న వేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ vs ఆఫీసులో కేవలం డబ్బును మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకూడదని సూచిస్తూ.. ఆలోచింపజేసే విశ్లేషణను అతడి ముందు ఉంచింది. డబ్బు ఆదాను పక్కన పెడితే.. మానసిక ప్రశాంతత, ఎదుగుదలకు ఆఫీసుకు వెళ్తేనే మంచిందని చాట్ జీపీటీ అభిప్రాయపడింది. ఆఫీస్‌కు వెళ్లడం వల్ల సహోద్యోగులతో పరిచయాలు, టీం బిల్డింగ్, వ్యక్తిగత ఎదుగుదల ఉంటాయని పేర్కొంది. ఇంట్లో ఉంటే ఒంటరితనం వేధించవచ్చని పేర్కొంది. ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత కూడా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’నే ఎంచుకుంటారా? అని నెటిజన్ ను ఏఐ బాట్ ప్రశ్నించింది.

Advertisement

Also Read: ఏసీ బాక్స్‌పై బకెట్ వాటర్‌.. నిజంగా కూలింగ్ పెరుగుతుందా? నిపుణులు చెప్పేది వింటే..!

నెటిజన్ల రియాక్షన్ ఇదే

ఏఐ కేవలం ఒక యంత్రంలా కాకుండా మనిషి మానసిక స్థితిని కూడా పరిగణనలోకి తీసుకుని ప్రశ్న అడగడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘కేవలం డబ్బులే కాదు. ఆఫీస్ వాతావరణం కూడా ముఖ్యమే అని ఏఐ చెప్పడం నిజంగా గ్రేట్’ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ‘డబ్బులు మిగిలితే చాలు బాస్. ఆఫీస్ ఒత్తిడి కంటే ఇంట్లో ఒంటరితనమే నయం’ అని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా చాట్ జీపీటీ చేసిన ఈ విశ్లేషణ ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో పెద్ద చర్చకే దారితీసిందని చెప్పవచ్చు.

Also Read: జియో బంపరాఫర్.. రూ.448 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ.. మరెన్నో బెనిఫిట్స్!

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×