E-Paper
Advertisement

అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడిన మంటలు

అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడిన మంటలు
Advertisement

Anakapalli: అనకాపల్లి జిల్లాలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు ఆకాశమంతటా దట్టమైన నల్లటి పొగ అలుముకోవడంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డు కూడలిలో ఉన్న ఒక ప్రముఖ పెయింట్స్ అండ్ హార్డ్‌వేర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. హార్డ్‌వేర్ షాపు కావడం, అందులో భారీగా పెయింట్స్, థిన్నర్లు, ఇతర కెమికల్స్ నిల్వ ఉంచడంతో మంటలు క్షణాల వ్యవధిలోనే దుకాణం మొత్తానికి వ్యాపించాయి. కెమికల్స్ డబ్బాలు పేలడంతో మంటలు మరింత ఉధృతంగా ఎగసిపడ్డాయి.

Advertisement

ప్రమాదం జరిగిన సమయంలో షాపులో ఉన్నవారు, ఖాతాదారులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగ కిలోమీటరు దూరం వరకు వ్యాపించడంతో రహదారిపై వెళ్లే వాహనదారులు, స్థానిక వ్యాపారులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయల విలువైన హార్డ్‌వేర్, పెయింట్ సామాగ్రి పూర్తిగా బూడిదైనట్లు అంచనా వేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఇంట్లోకి చొరబడి.. మాజీ మంత్రి ముఖంపై కోడిగుడ్లతో దాడి.. ఆ వెంటనే అర్ధరాత్రి అరెస్ట్!

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×