Mohan Sri Vathsa: ప్రతి దర్శకుడికి తాను రాసుకున్న కథ మీద ఒక విపరీతమైన నమ్మకం ఉంటుంది. ఆ విపరీతమైన నమ్మకం ఉండడం వలన చాలా ప్రయత్నాలు చేసి దర్శకత్వ అవకాశం దక్కించుకుంటాడు. అయితే ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అవుతుంది, ఏ సినిమా ఫెయిల్ అవుతుంది అనే విషయాన్ని ఎవరు ఊహించలేరు. ఒకవేళ అదే విషయం ఊహకు అందితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అన్ని సక్సెస్ఫుల్ సినిమాలు మాత్రమే వస్తాయి.
అయితే కొన్ని సినిమాలను విపరీతమైన నమ్మకంతో మొదలుపెట్టి ఈ కథ అందరికీ నచ్చుతుంది అనే ఉద్దేశంతో చేస్తారు. కానీ అది బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించుకోలేవు. అసలు ఈ రోజుల్లో పెద్ద సినిమా విడుదల అయితే కానీ ప్రేక్షకులు థియేటర్ కు రాని పరిస్థితి ఏర్పడింది. ఇన్ని రోజులు ఎదురు చూసాము కదా ఇంకో నెల రోజులు ఎదురు చూస్తే డైరెక్ట్ గా సినిమా ఓటీటీ లోకి వచ్చేస్తుంది అనే నమ్మకంతో చాలామంది ప్రేక్షకులు థియేటర్ కు రావడం మానేశారు.
చెప్పుతో కొట్టుకున్న డైరెక్టర్
సత్యరాజ్, యాంకర్ ఉదయభాను ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ సినిమా అబౌవ్ యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కూడా, ప్రేక్షకుల ఆదరణ కరువైంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన దర్శకుడు మోహన్ శ్రీవత్స, ప్రేక్షకులు సినిమా చూడకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాకు ముందు “నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటా” అని ఛాలెంజ్ చేసిన ఆయన, తాజాగా చెప్పుతో కొట్టుకుంటూ బాధపడ్డారు.
సినిమా చూస్తేనే కదా అది బాగుందో లేదో తెలిసేది అంటూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే సినిమా చూడాలి అన్నా కూడా థియేటర్లు కూడా అవైలబుల్ గా ఉండాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో స్టార్ కాస్ట్ ఉన్న సినిమా వస్తే కానీ థియేటర్లు దొరకని పరిస్థితి. ఒక విధంగా ఇది కూడా ఒక ప్రాబ్లం అనే చెప్పాలి.
ఇలాంటి పరిస్థితులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి వీటన్నిటిని తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న పెద్దలు దృష్టిలో పెట్టుకొని ఏవైనా నిర్ణయాలు తీసుకొని సరైన మార్పులు జరిగిస్తే గాని తెలుగు సినిమాకు పూర్వ వైభవం రాదు.
Also Read: Anirudh: ఈ యంగ్ డైరెక్టర్స్ కు అనిరుధ్ ప్రాజెక్ట్స్ సెట్ చేస్తున్నాడు