E-Paper
Advertisement

BCCI : రూ. 452 కోట్లకు టీమిండియా జెర్సీ స్పాన్సర్ షిప్.. బీసీసీఐ అదిరిపోయే స్కెచ్?

BCCI : రూ. 452 కోట్లకు టీమిండియా జెర్సీ స్పాన్సర్ షిప్.. బీసీసీఐ అదిరిపోయే స్కెచ్?
Advertisement

BCCI :  భారత ప్రభుత్వం ప్రమోషన్ బిల్లు రెగ్యులేషన్ ఆఫ్ ఆన్ లైన్ గేమింగ్ బిల్లు-2025 అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ తమ జట్లకు స్పాన్సర్ గా ఉన్న ప్రధాన గేమింగ్ ప్లాట్ ఫామ్ డ్రీమ్ 11 తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో టీమిండియా క్రికెట్ జట్ల జెర్సీలకు అధికారికంగా స్పాన్సర్ లేకుండా పోయింది. మరోవైపు సెప్టెంబర్ 09న ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ప్రారంభం కానుంది. అయితే టీమిండియా ఆసియా కప్ లో స్పాన్సర్ జెర్సీ లేకుండానే బరిలోకి దిగుతుందని కొందరూ చెబుతుంటే.. మరికొందరూ టీమిండియా కొత్త స్పాన్సర్ తోనే బరిలోకి దిగుతుందని మరికొందరూ పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ వాటిలో ఇప్పటివరకు ఏ ఒక్కటి కూడా ఫైనల్ కాలేదు.

Also Read : David Warner : మహేష్ బాబు-రాజమౌళి సినిమాలో విలన్ గా ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్?

Advertisement

బీసీసీఐ భారీ స్కెచ్.. 

ముఖ్యంగా రోజుకొక కొత్త పేరు తెర మీదికి రావడం గమనార్హం. ఇటీవలే విమల్ పాన్ మసాలా టీమిండియా కి 2028 వరకు స్పాన్సర్ గా ఉంటుందని.. మరోవైపు టయోటా మోటార్ కార్పొరేషన్ కూడా ఆసక్తి చూపిస్తుందని వార్తలు వచ్చాయి. తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రూ.452 కోట్లకు జెర్సీ స్పాన్సర్ షిప్ చేయనున్నట్టు బీసీసీఐ స్కెచ్ వేసినట్టు సమాచారం. 2025 నుంచి 2028 వరకు మొత్తం మూడు సంవత్సరాలకు రూ.452 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. వీటిలో ఎక్కువగా టెస్లా కంపెనీ పేరు వినిపిస్తోంది. టీమిండియా కోసం స్పాన్సర్ షిప్ చేసేందుకు ఎలన్ మస్క్ ఇంట్రెస్ట్ పెట్టినట్టు సమాచారం. ముఖ్యంగా డ్రీమ్ 11తో బీసీసీఐ ఎప్పుడైతే ఒప్పందాన్ని రద్దు చేసుకుందో అప్పటి నుంచే పలు కంపెనీల పేర్లు ప్రచారం జరిగాయి. కానీ చివర్లో టెస్లా పేరు వినిపించడం విశేషం.

Advertisement

ఆసియా కప్ లోపు స్పాన్సర్ డీల్ కుదిరేనా..? 

టెస్లా మాత్రమే కాకుండా టాటా గ్రూపు, రిలియన్స్, అదానీ వంటి గ్రూపులు కూడా ఆసక్తి ఉన్నట్టు బీసీసీఐ (BCCI) కి వెల్లడించాయి. కానీ జెర్సీ స్పాన్సర్ షిప్ ని అధికారిక టెండర్ ప్రక్రియ ద్వారా నిర్ణయిస్తారు. ఈ ప్రక్రియ ఇప్పటి వరకు ఇంకా ప్రారంభం కాలేదు. సెప్టెంబర్ 09నే ఆసియా కప్ ప్రారంభం కానుంది. 2023లో రూ.358 కోట్లతో మూడేళ్లకు డ్రీమ్ 11తో ఒప్పందంతో కుదుర్చుకుంది. కానీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో మధ్యలోనే అగ్రిమెంట్  రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే టీమిండియాకి  టెస్లా కంపెనీ, టాటా గ్రూపు, రిలియన్స్, అదానీ, విమల్ పాన్ మసాలా వంటి కంపెనీలు రేసులోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  ఈ తరుణంలోనే రూ.452 కోట్లకు స్పాన్సర్ షిప్ తీసుకోవాలని కంపెనీలకు బీసీసీఐ బంఫర్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఈ కంపెనీలలో ఏ కంపెనీ స్పాన్సర్ షిప్ దక్కించుకుంటుందో వేచి చూడాలి మరీ. ముఖ్యంగా ఆసియా కప్ వరకు స్పాన్సర్ షిప్ డీల్ కుదురుతుందా..? లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారడం విశేషం.

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×