Indian Richest Spiritual Gurus:భారతదేశం ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులతో నిండి ఉంది. వారంతా లక్షలాది మంది అనుచరులతో గౌరవించబడుతున్నారు. అంతేకాదు, వారి మీద అపారమైన ప్రభావాన్ని చూపుతున్నారు. ఓవైపు ఆధ్యాత్మిక బోధనలు చేస్తూనే, మరోవైపు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. పెద్ద మొత్తంలో సంపద కూడబెట్టారు. ఇండియాలో ఆధ్యాత్మిక గురువులు కొనసాగుతున్న పలువురి ఆస్తుల విలువ ఎంతో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ సద్గురు జగ్గీ వాసుదేవ్: ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అయిన సద్గురు ఆధ్యాత్మికతను విస్తరించడంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఫౌండేషన్ యోగా కేంద్రాలు, విద్యాసంస్థలు, పర్యావరణ ప్రాజెక్టులను నిర్వహిస్తుంది. 2023 నాటికి ఆయన నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 18 కోట్లు.
⦿ శ్రీ శ్రీ రవిశంకర్: శాంతి, మానవతా ప్రయత్నాల పట్ల ఎంతో నిబద్దత కలిగిన వ్యక్తి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ స్థాపకుడు రవిశంకర్. ఆయన నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 1000 కోట్లు ఉంటుందని చెబుతారు. ఇందులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కేంద్రాలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి.
⦿ బాబా రాందేవ్: బాబా రాందేవ్ యోగా గురువుగా ప్రసిద్ధి చెందారు. ఆయన పతంజలి ఆయుర్వేదం దేశ వెల్ నెస్ పరిశ్రమలో ఒక ఊపును తెచ్చిపెట్టింది. 1995లో ఆయన దివ్య యోగ మందిర్ ట్రస్ట్ ను స్థాపించారు. ప్రస్తుతం పతంజలిని అద్భుతమైన బ్రాండ్ గా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఆయన నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 1600 కోట్లు.
⦿ మాతా అమృతానందమయి: అమ్మగా గుర్తింపు తెచ్చకున్న ఈమె, కేరళలో జన్మించించింది. ఆధ్మాత్మిక గురువుగా, మానవతావాదిగా గుర్తింపు తెచ్చుకుంది. అమృతానందమయి ట్రస్ట్ ను స్థాపించారు. ప్రస్తుతం ఆమెకు దాదాపు రూ. 1,500 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెబుతారు.
⦿ అవధూత్ శివానంద్ జీ: ధ్యాన కార్యక్రమాలను అందించే సంస్థ శివయోగ్ వ్యవస్థాపకుడు. ఆయన సామాజిక అభివృద్ధి కార్యకలాపాలలో ఎక్కువగా కూడా పాల్గొంటారు. ఆయన నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 43 కోట్లుగా చెప్తారు.
⦿ డాక్టర్ పాల్ దినకరన్: క్రైస్తవులలో ఆధ్యాత్మిక గురువుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ది జీసస్ కాల్స్ మినిస్ట్రీని స్థాపించారు. కారుణ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఛాన్సలర్ గా ఉన్నారు. ఆయన నికర విలువ దాదాపు రూ. 45 కోట్లు ఉంటుందని అంచనా.
⦿ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్: 1990 నుండి డేరా సచ్చా సౌధా నాయకుడుగా కొనసాగుతున్నారు. రామ్ రహీమ్ కు హరిజనులు, దళితుల నుంచి అపారమైన మద్దతు ఉంది. ఆయన నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 1,455 కోట్లు ఉంటుందని అంచనా.
⦿ ఆశారాం బాపు: ఈయన బాల సంస్కార్ కేంద్రాలను స్థాపించారు. దాదాపు 400 ఆశ్రమాలను కలిగి ఉన్నారు. వీటి విలువ దాదాపు రూ. 5000 కోట్లు ఉంటుందని అంచనా.
⦿ స్వామి నిత్యానంద: నిత్యానంద ధ్యానపీఠం స్థాపకుడు. ఇది అనేక దేశాలలో దేవాలయాలు, గురుకులాలు, ఆశ్రమాలను కలిగి ఉన్నది. అతడి నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 10,000 కోట్లుగా అంచనా వేయబడింది.
Read Also: యూట్యూబ్ ద్వారా కళ్లు చెదిరే ఆదాయం.. సింపుల్ గా ఈ టిప్స్ పాటిస్తే చాలు!