The Paradise: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నేచురల్ స్టార్ నాని (Nani)ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రయాణం మొదలుపెట్టిన నాని అనంతరం హీరోగా సినిమా అవకాశాలను అందుకుంటు ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ అందుకోవడమే కాకుండా నిర్మాతగా మారి నిర్మాతగా కూడా సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈయన హీరోగా నిర్మాతగా వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక నాని త్వరలోనే ది ప్యారడైజ్ (The Paradise)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
గ్లోబల్ రేంజ్ లో ది ప్యారడైజ్ …
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా మొదటి నుంచి కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల చేయాలన్న ఉద్దేశంతో అదే స్థాయిలో సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా కేవలం నేషనల్ లెవెల్ లో మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ లో విడుదల చేయాలని ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ప్రముఖ హాలీవుడ్ ఏజెన్సీ (Hollywood Agency) తో చిత్ర బృందం కోలాబరేట్ అవుతూ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
హాలీవుడ్ ఏజెన్సీ తో చర్చలు..
ఈ సినిమాని ఇతర భాషలలో కూడా విడుదల చేయబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగానే హాలీవుడ్ ఇండస్ట్రీలోని కనెక్ట్మోబాసెన్స్ క్రియేటివ్ కంటెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండ్రాను కలిసి ప్రమోషన్ల విషయంలో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఇక ఈ ప్రయత్నాలు కనుక సక్సెస్ అయితే నాని ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్లో తన సత్తా ఏంటో నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారని చెప్పాలి. ఇక ఈ విషయం తెలిసిన నాని అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విభిన్నమైన లుక్ లో నాని…
ఇదివరకే నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో దసరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నాని మరోసారి ఈయనకు అవకాశం ఇవ్వడమే కాకుండా ఈయన డైరెక్షన్లో చిరంజీవి హీరోగా చేయబోయే సినిమాకు నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ది ప్యారడైజ్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా నుంచి ఇదివరకే విడుదల చేసిన గ్లింప్ వీడియో, యాక్షన్ సీక్వెన్స్ పూర్తి కావడంతో అందుకు సంబంధించిన ఒక వీడియోని కూడా విడుదల చేశారు. ఇక ఈ అప్డేట్స్ మాత్రం సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమాలో నాని లుక్ కూడా ఎంతో విభిన్నంగా ఉండబోతోంది. రెండు జడలు వేసుకుని నాని విభిన్నంగా కనిపించబోతున్నారని చెప్పాలి. మరి ఈ సినిమా ద్వారా నాని బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తారో తెలియాల్సి ఉంది.
Also Read: Ghaati Pre Release: ఘాటీ ప్రమోషన్లకు అనుష్క అవసరం లేదు… క్రిష్ షాకింగ్ కామెంట్స్!