Apple iPhone 17 Launching: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా కొత్త సిరీస్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. సెప్టెంబర్ 9న ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచింగ్ కు సన్నాహాలు చేస్తోంది. అదే సమయంలో పాత సిరీస్ తయారీని కూడా నిలిపివేయబోతున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ తో సహా నాలుగు కొత్త ఐఫోన్ 17 మోడళ్లను ప్రకటించే అవకాశం ఉన్నది. అటు కొన్ని ఐఫోన్లు, ఆపిల్ వాచ్ లతో సహా కనీసం ఆరు ఉత్పత్తులను దాని స్టోర్ నుండి సైలెంట్ గా తొలగించనున్నట్లు తెలుస్తోంది.
కొత్తవి విడుదల, పాతవి తొలగింపు
కొత్త ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్ ఆపిల్ స్టోర్ లోకి అడుగు పెట్టిన తర్వాత ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మాక్స్ ఫోన్లను నిలిపివేయనున్నట్లు టెక్ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఆపిల్ రెండు ప్రో జెనరేషన్స్ మొబైల్స్ ను కలిసి అమ్మదు. గతంలో ఐఫోన్ 16 సిరీస్ విడుదల అయిన తర్వాత ఐఫోన్ 15 ప్రో సిరీస్ తయారీని నిలిపివేసింది. క్యారియర్లు, రిటైలర్ల దగ్గర కొంత మిగిలిపోయిన స్టాక్ ఉండవచ్చు. కానీ, సరఫరా ఎక్కువ కాలం ఉండదు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్, బ్లాక్ ఫ్రైడే లాంటి షాపింగ్ ఈవెంట్లలో తాత్కాలిక డిస్కౌంట్ల కింది వీటిని అమ్మే అవకాశం ఉంటుంది.
ఐఫోన్ 15 సిరీస్ పరిస్థితి ఏంటి?
నాన్-ప్రో మోడల్స్ సాధారణంగా ధర తగ్గింపులతో ఎక్కువ కాలం ఉంటాయి. అంటే ఐఫోన్ 17 విడుదల తర్వాత ఐఫోన్ 16, 16 ప్లస్ తక్కువ ధరకు అమ్ముతారు. అయితే, ఐఫోన్ 15, 15 ప్లస్ లను వెంటనే నిలిపివేయాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రిటైలర్లు డిమాండ్‌ను బట్టి అధిక ధరలకు తగ్గట్టుగా మిగిలిన యూనిట్లను తరువాత క్లియర్ చేసే అవకాశం ఉంది. అయితే, అవి ఇకపై ఆపిల్ అధికారిక కేటలాగ్ లో భాగం కావు.
Read Also: 2 జీబీ డేటా.. 28 రోజుల వ్యాలిడిటీ.. మరీ ఇంత తక్కువ ధరకా?
ఆపిల్ వాచ్ లైనప్ లో మార్పులు
ఇక ఆపిల్ 17 సిరీస్ లాంచింగ్ ఈవెంట్ లో ఆపిల్ స్మార్ట్ వాచ్ సెగ్మెంట్ కోసం కొత్త మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నారు. ఆపిల్ వాచ్ సిరీస్ 10 స్థానంలో కొత్త సిరీస్ 11 వచ్చే అవకాశం ఉంది. ఆపిల్ వాచ్ అల్ట్రా 3 కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆపిల్ వాచ్ SE పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. అమ్మకంలో ఉన్నా, అంతగా ప్రయారిటీ ఉండబోదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత సంవత్సరం ఆపిల్ వాచ్ ను ఇప్పటికీ పరిశీలిస్తున్న కొనుగోలుదారులకు, ఆపిల్ నుంచి నేరుగా వాటిని పొందేందుకు ఇదే చివరి అవకాశం కావచ్చు. రిటైల్ అవుట్ లెట్లు పరిమిత కాల ఒప్పందాలను అందించే అవకాశం ఉంది. కానీ, స్టాక్ త్వరగా అయిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆపిల్ దృష్టి ఐఫోన్ 17 లైనప్, కొత్త ఆపిల్ వాచ్ సిరీస్ 11 ను ప్రమోట్ చేయడంపై పెట్టింది. అదే సమయంలో 6 పాత డివైజ్ లను శాశ్వతంగా తన స్టోర్ నుంచి తొలగించే అవకాశం ఉంది.