BigTV English

OTT Movie : భర్త పట్టించుకోవట్లేదని మరొకడితో… డైరెక్ట్ గా మొగుడికే చెప్పే ఇల్లాలు… అతనిచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : భర్త పట్టించుకోవట్లేదని మరొకడితో… డైరెక్ట్ గా మొగుడికే చెప్పే ఇల్లాలు… అతనిచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ వైపే చూస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఓటీటీ ఒక వేదికగా మారిపోయింది. ఎలాంటి జానర్ కావాలన్నా, ఒక్క క్లిక్ తో కళ్ళముందు వాలిపోతున్నాయి. అయితే గత ఏడాది ఓటీటీలోకి వచ్చిన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకుల మైండ్ ని బెండ్ చేస్తోంది. ఈ సినిమా వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడే ఒక జంట చుట్టూ తిరుగుతుంది. కపుల్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘డెమన్స్’ (Demons) 2024లో విడుదలైన హిందీ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. ఇది రోహిత్ మిట్టల్ దర్శకత్వంలో, హుమారా మూవీ బ్యానర్‌పై రూపొందింది. ఇందులో స్వాతి సెమ్వాల్ (మేఘా), వినయ్ శర్మ (వినయ్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 ఏప్రిల్ 19న జీ5లో అందుబాటులోకి వచ్చింది. 95 నిమిషాల నిది ఉన్న ఈ చిత్రం, IMDbలో 6.1/10 రేటింగ్ పొందింది.


కథలోకి వెళ్తే

వినయ్, మేఘా అనే భార్యాభర్తల వైవాహిక సంబంధం ప్రస్తుతం విచ్ఛిన్న దశలో ఉంటుంది. బయటి నుండి సంతోషంగా కనిపించినప్పటికీ, లోపల ఆందోళన, నమ్మకం లేకపోవడంతో ఈ బంధం సమస్యల్లో పడుతుంది. ఒక రాత్రి ఒక పార్టీ నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, మేఘా వినయ్‌తో సన్నిహితంగా ఉండాలని కోరుకుంటుంది. కానీ వినయ్ ఆసక్తి చూపడు. దీనితో వారి మధ్య గొడవ మొదలవుతుంది. వేరే వాళ్ళతో వ్యవహారం నడుపుతానని చెప్పి మరీ వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం మేఘా తను వినయ్‌ను మోసం చేసినట్లు ఒప్పుకుంటుంది. ఇది వారి సంబంధాన్ని మరింత దిగజార్చే ఒక విషాదకర ఘట్టంగా మారుతుంది. దీంతో ఇది తీవ్రమైన విషాదకరమైన గొడవలకు దారితీస్తుంది.

ఈ గొడవలు మరింత తీవ్రమవుతాయి. వినయ్, మేఘా ఒకరినొకరు నిందించుకుంటూ, తమ లోపాలు, అభద్రతాభావాలను బయటపెడతారు. ఈ సంబంధంలోని ప్రతి చిన్న విషయం, ఒక విషపూరిత వాతావరణంగా మారుతుంది. కథ మానసిక, శారీరక హింస వైపు సాగుతుంది. ఒక షాకింగ్ ట్విస్ట్‌తో క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. ఇది వీళ్ళ వివాహంలో క్షమాపణ లేని గాయాలను మిగులుస్తుంది. ఇక ఈ జంట కలసి ఉండగలుగుతారా ? విడిపోతారా ? మేఘా నిజంగానే వేరే వ్యక్తితో వ్యవహారం నడిపిందా ? అనే విషయాలను ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.

Read Also : మూవీలో ఆ సీన్స్ ఉండాలని పట్టుబట్టే అమ్మాయి… సమ్మర్ హాలీడేస్ లో సినిమా ప్లాన్… ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి బుర్రపాడు

Related News

OTT Movie : వీడియో కాల్ లో అన్నీ విప్పి పాడు పనులు… ప్రేమించిన అమ్మాయిని వదిలేసి ఆమె వలలో… అబ్బాయిలు మస్ట్ వాచ్

OTT Movie : ల్యాబ్ లో అమ్మాయిల అస్థి పంజరాలు… కపుల్ ను కలవనివ్వని దెయ్యం… రాత్రిపూట సింగిల్ గా చూశారో ఫసక్

OTT Movie : పాపులర్ అవ్వడానికి ఎంతకైనా తెగించే జంట… వెంటాడే మిస్టీరియస్ వ్యక్తి… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : 2 ఓటీటీల్లోకి 105 కోట్ల రివేంజ్ డ్రామా… ఆ సీన్లు కూడా… ఒక్కో ట్విస్టుకు మైండ్ బ్లాక్

Akhanda2 Ott Deal: రికార్డు స్థాయిలో బాలయ్య ఆఖండ2 ఓటీటీ డీల్!

Big Stories

×