Ghaati Pre Release: డైరెక్టర్ క్రిష్(Krish) దర్శకత్వంలో అనుష్క(Anushka) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఘాటీ(Ghaati). ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. యు.వి క్రియేషన్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఇదివరకే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ సెప్టెంబర్ 5వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోని చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడమే కాకుండా చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్వీటీ పర్ఫామెన్స్ చాలు..
ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన అనుష్క ప్రమోషన్లకు దూరంగా ఉండటం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు దర్శకుడు క్రిష్ సమాధానం చెబుతూ.. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అనుష్క తాను ప్రమోషన్లకు రానని తెలియజేశారు. తన అలా చెప్పడంతో మేమందరం కూడా ఆమె నిర్ణయానికి చాలా రెస్పెక్ట్ ఇచ్చాము అసలు స్వీటీ అంటే ఎవరు? తను మన ఇంట్లో అమ్మాయిలాగా కలిసిపోతుంది. తను ఈ ప్రమోషన్లకు రాకూడదనుకుంది. ఓకే రావద్దు.. ఈ సినిమాకు స్వీటీ గారి పర్ఫామెన్స్ చాలు ఆమె ప్రమోషన్లు కూడా అవసరం లేదు అంటూ డైరెక్టర్ క్రిష్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మీడియా ముందుకు రాని అనుష్క…
ఇక అనుష్క ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్న నేపథ్యంలో ఈ విషయం గురించి పదేపదే దర్శక నిర్మాలకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే అనుష్క ఎందుకు ప్రమోషన్లకు దూరంగా ఉన్నారు? ఎందుకు ఆమె మీడియా ముందుకు రావడానికి ఇష్టపడట్లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో అనుష్క భారీగా శరీర బరువు పెరిగిపోయిన నేపథ్యంలో పూర్తిగా బొద్దుగా మారిపోయింది. అందుకే ఆమె మీడియా ముందుకు రావడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదనే వాదన కూడా వినపడుతోంది. ఇందులో భాగంగానే ప్రమోషన్లకు కూడా దూరంగా ఉంటున్నానని తెలియజేశారు.
వేశ్య పాత్రలో అనుష్క…
ఇక అనుష్క ఇదివరకే డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వేదం(Vedam) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది .ఇక ఈ సినిమాలో అనుష్క ఒక వేశ్య పాత్రలో నటించి సందడి చేశారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తిరిగి మరోసారి క్రిష్ దర్శకత్వంలో ఘాటీ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేశారు. ఇక ఇటీవల కాలంలో అనుష్క చాలా తక్కువ సంఖ్యలో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి.. మిస్టర్ పోలీ శెట్టి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక త్వరలోనే ఘాటీ సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేయబోతున్నారు.
Also Read: Krish -HHVM: వీరమల్లు నుంచి అందుకే తప్పుకున్నా… ఇన్నాళ్లకు అసలు విషయం చెప్పిన క్రిష్!