Ustaad Bhagat Singh Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. ప్రస్తుతం ఆయన చేతిలో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలకు ఉన్న బజ్ అంతా ఇంత కాదు. హరి హర వీరమల్లు నిరాశ పరచడంతో అభిమానులంతా ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఈ రెండు సినిమాలకు విపరీతమైన బజ్ నెలకొంది. ఇప్పటికే ఓజీ విడుదలకు సిద్దమౌతోంది. సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్. ప్రస్తుతం సెట్‌పై ఉన్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ని జరుపుకుంటోంది. ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాల షూటింగ్స్‌తో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు పవన్.
ఓజీ, ఉస్తాద్ బజ్
ఇక ఓజీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం, సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు ఉండటంతో అభిమానులంత సినిమాల అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. తాజాగా ఉస్తాద్ నుంచి ఫుల్ మీల్ అందించబోతున్నామంటూ భగత్ సింగ్ పోస్టర్‌తో పూనకాలు తెప్పించాడు. ఇది ఫ్యాన్స్ అంతా సర్‌ప్రైజ్ అవుతున్నారు. రేపు సాయంత్రం 4:40 నిమిషాలకు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ రాబోతోందని తాజాగా మూవీ టీం ప్రకటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అంటే అభిమానులకు పండగే. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున్న ఆయన బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటారు అభిమానులు. ఇక ఆయన చిత్రాల నుంచి వచ్చే అప్‌డేట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
రేపు ఫుల్ మీల్
సినిమా ఏదైనా.. పవన్ కళ్యాణ్ అప్‌డేట్ అంటే పండగలా ఉంటుంది. ఇక ఆయన బర్త్‌డే అంటే ఆ సెలబ్రేషన్స్ మరింత డబుల్ అవుతాయి. ఈసారి ఆయన పుట్టిన రోజు సెలబ్రేషన్స్‌ని ఒక రోజు ముందుగానే ప్రారంభం కానున్నాయి. రేపు(సెప్టెంబర్ 1న) ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ రాబోతోంది. ఈ మేరకు మూవీ టీం విడుదల చేసిన పవన్ పోస్టర్.. ఫ్యాన్స్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో పవర్ స్టార్ వింటేజ్ లుక్‌లో కనిపించాడు. ఇందులో ఆయన మాస్ స్టైల్, ఎనర్జీ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించేలా ఉంది. ప్రీ లుక్‌కే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తే.. రేపు విడుదల కాబోయే ఫుల్ మీల్ కి ఇంకేంత రెస్పాన్స్ వస్తుందో ఊహించుకోండి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ పెంచుతోంది.
Also Read: Vishal-Sai Dhanshika: విశాల్, సాయి ధన్సిక ఆస్తుల విలువెంతో తెలుసా? వీరిద్దరికి కలిపి..
కాగా దర్శకుడు హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబో అంటేనే మాస్ బ్లాక్‌బస్టర్. వీరిద్దరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో పవన్ స్టైల్, గ్రేస్ థియేటర్లల్లో ఫ్యాన్స్ చేత ఈళలు వేయించింది. ఇక ఈ కాంబోలో మరో మూవీ వస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం ప్రకటనతో హైప్ క్రియేట్ అయినా.. ఈ మూవీ అప్‌డేట్స్ అంతకు మించి అనేలా ఉన్నాయి. ఇక ఈ చిత్రం అభిమానులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రేపు విడుదల కాబోయే ఫుల్ మీల్ ఏ రేంజ్ బజ్ పెంచుతుందో చూడాలి. కాగా ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
https://twitter.com/harish2you/status/1962121886894297321