Tamanna Comments on Vijay Varma: ప్రస్తుతం మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ ఫుల్ బిజీ అయిపోయింది. ఇటూ సినిమాలు, అటూ స్పెషల్ సాంగ్స్ లో నటిస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది. మొన్నటి వరకు తమన్నా కెరీర్ స్లోగా ఉంది. రజనీకాంత్ జైలర్ మూవీ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ పాట భారీ విజయం సాధించింది. దీంతో ఆమె కెరీర్ గాడిలో పడింది. వరుస స్పెషల సాంగ్ లో నటిస్తూ.. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంది. భారీ బడ్జెట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్ అంటే దర్శక నిర్మాతలంతా తమన్నా పేరునే సజెస్ట్ చేస్తున్నారు.
విజయ్ వర్మతో బ్రేకప్..
ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీ అయిపోయిన తమన్నా.. ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమెకు తన మాజీ ప్రియుడు విజయ్ వర్మ గురించి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మొన్నటి వరకు తమన్నా, విజయ్ వర్మలు చెట్టపట్టాలేసుకుని తిరిగిన సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ల పాటు వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారు. ఇక ఈ ఏడాది పెళ్లి కబురు చెబుతారనుకుంటే బ్రేకప్ చెప్పుకుని ఫ్యాన్స్ కి షాకిచ్చారు. ప్రస్తుతం వీరిద్దరు ఎవరి లైఫ్ వారిదే అన్నట్టు ఉన్నారు.
తమన్నా అసహనం
పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో.. తమన్నా విజయ్ వర్మకి బ్రేకప్ చెప్పినట్టు ఇన్ సైడ్ సినీ సర్కిల్లో టాక్. ప్రస్తుతం విజయ్ వర్మకు దూరంగా సింగిల్ ఉంది. కానీ, విజయ్ వర్మ మాత్రం ఈ మధ్య ఓ బాలీవుడ్ నటితో క్లోజ్ గా ఉంటున్నాడట. బి టౌన్ లో ఆ నటి చెట్టపట్టేలేసుకుని తిరుగుతున్నాడట. ఇది విషయాన్ని తమన్నాని ప్రశ్నించగా.. తాను ఎవరితో ఉంటే అని అసహనం చూపించింది. ఎవరి జీవితం వారిది.. ఎవరికి నచ్చినట్టు వారు జీవించే హక్కు ఉంటుంది. నేను విజయ్ వర్మ ప్రస్తుతం విడిపోయాం. మేం బ్రేకప్ చెప్పుకుని చాలా రోజులు అవుతోంది.
ఆ నటితో విజయ్ రిలేషన్?
కాబట్టి అతను ఎవరితో తిరిగితే నాకేంటి. అది తన స్వంత్ర్యం. ఎవరు, ఎవరుతో ఉంటే ఏంటీ? అని ఘాటుగా స్పందించింది. ప్రస్తుతం తమన్నా కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కాగా విజయ్ వర్మ ఇటీవల దంగల్ బ్యూటీ, నటి ఫాతిమా సనాతో క్లోజ్ ఉంటున్నాడు. వీరిద్దరు జంటగా విందు వినోదాలు, మూవీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ముంబై రోడ్లపై తరచూ వీరిద్దరు జంటగా కనిపిస్తుండటంతో వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారా? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం తమన్నా.. డూ యూ వన్నా పార్ట్ నర్ అనే వెబ్ సిరీస్ తో బిజీగా ఉంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీలో విడుదల కానుంది. చివరిగా ఓదెల 2లో లేడీ అఘోరగా కనిపించింది తమన్నా. ఇందులో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కానీ, ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో తమన్నా ఆశలన్ని నిరాశలయ్యాయి.