BigTV English

Anirudh: ఈ యంగ్ డైరెక్టర్స్ కు అనిరుధ్ ప్రాజెక్ట్స్ సెట్ చేస్తున్నాడు

Anirudh: ఈ యంగ్ డైరెక్టర్స్ కు అనిరుధ్ ప్రాజెక్ట్స్ సెట్ చేస్తున్నాడు
Advertisement

Anirudh: తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడుగా మంచి పేరును సంపాదించుకున్నాడు అనిరుద్. త్రీ సినిమాతో సంగీత దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన అనిరుద్ నేడు సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్. కేవలం తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఒక సినిమా స్థాయిని పెంచగలడు. అద్భుతమైన ఎలివేషన్స్ క్రియేట్ చేయగలడు.


తమిళ యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా అనిరుత్త్వం మ్యూజిక్ చేయించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అనిరుద్ కూడా తన సినిమాల కోసం అలానే కష్టపడతాడు. అనిరుద్ చేసిన ఆల్బమ్స్ లో కచ్చితంగా ఒక సాంగ్ అయినా కూడా బీభత్సమైన వైరల్ గా మారుతుంది. అయితే మ్యూజిక్ చేయడం మాత్రమే కాకుండా చాలామంది యంగ్ డైరెక్టర్స్ కు ప్రాజెక్ట్స్ సెట్ చేస్తాడు.

అనిరుద్ సెట్ చేసిన ప్రాజెక్ట్ 


కొలమావు కోకిల సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు నెల్సన్. నయనతార నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. నెల్సన్ ఈ సినిమా చేయడానికి అంటే ముందు శింబు హీరోగా సినిమా మొదలైంది. ఈ సినిమాలో హన్సిక హీరోయిన్. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా అప్పట్లో ఆగిపోయింది. ఆ సినిమా ఆగిపోయిన ఆరు సంవత్సరాల తర్వాత వరకు మరో ప్రాజెక్ట్ డైరెక్టర్ గా చేయలేదు నెల్సన్. మొత్తానికి అనిరుద్ ప్రాజెక్ట్ సెట్ చేయడం వలన దర్శకుడుగా నెల్సన్ మొదటి సినిమా విడుదలైంది. అలానే రీసెంట్ గా లోకేష్ కనగరాజ్ దగ్గర మంచి కథ ఉంది అని రజనీకాంత్ కి మెసేజ్ చేసింది కూడా అనిరుద్. ఈ విషయాన్ని స్వయంగా కూలీ ఆడియో లాంచ్ లో చెప్పారు.

విజయ్ సేతుపతితో నెల్సన్. 

నెల్సన్ జైలర్ సినిమాకు మంచి పేరుతో పాటు ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి. అయితే విజయ్ సేతుపతి నెల్సన్ గురించి మాట్లాడారు. నెల్సన్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది అంటూ చెప్పారు. అయితే మరోవైపు నెల్సన్ కూడా విజయ్ సేతుపతి అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పాడు. తన ప్రతి సినిమాలో విజయ్ సేతుపతి చేస్తే బాగుంటుంది అని అనుకున్నాడు కానీ అది జరగలేదు. అయితే ఒక తరుణంలో అనిరుద్ కూడా విజయ్ సేతుపతితో నువ్వు సినిమా చేస్తే బాగుంటుంది అని నెల్సన్ తో చెప్పాడట. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు అంతా సార్ చేతిలో ఉంది అని నెల్సన్ మాట్లాడాడు. నెల్సన్ , శివ కార్తికేయన్, అనిరుద్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. కొన్ని సినిమా సాంగ్స్ కి సంబంధించిన వీరి అనౌన్స్మెంట్ వీడియోస్ చాలా ఫన్నీగా ఉంటాయి.

Also Read : Pawan Kalyan: ఓజి సినిమాతో పాటు, ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్. కాంపిటీషన్ కాదు సెలబ్రేషన్

Related News

Siddu Jonnalagadda: పది సంవత్సరాల తర్వాత మేమే తోపులం, నవీన్ పోలిశెట్టి, శేష్ లపై సిద్దు ఆసక్తికర కామెంట్

NTR: ఊసరవెల్లి లాంటి సినిమా తీద్దాం, ఇదెక్కడి డెసిషన్ తారక్?

Govardhan Asrani: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత!

Sreeleela: ఉస్తాద్ భగత్ సింగ్ పై అప్డేట్ ఇచ్చిన శ్రీలీల..పవర్ ప్యాకెడ్ అంటూ!

Ajmal Ameer: సె** ఆడియో చాట్ పై స్పందించిన నటుడు.. నన్నేం చేయలేవంటూ కామెంట్స్!

Chiranjeevi: మెగా ఇంట దీపావళి.. ఒకే ఫ్రేమ్ లో స్టార్ హీరోస్..ఫోటోలు వైరల్!

Ayan Mukerji: వార్ 2 ఎఫెక్ట్ ధూమ్ 4 నుంచి డైరెక్టర్ ఔట్…ఆశలు మొత్తం ఆ సినిమాపైనే?

Mari Selvaraj: నేను నీకు మద్యం ఇవ్వడం లేదు, నా సినిమా అలా చూడకు

Big Stories

×