BigTV English

Credit Card Limit: క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామనే ఆఫర్ చూసి ఆశపడుతున్నారా…అయితే ఇది మీ కోసం…

Credit Card Limit: క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామనే ఆఫర్ చూసి ఆశపడుతున్నారా…అయితే ఇది మీ కోసం…

మార్కెట్లో క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామని అనేకం ఆఫర్లు మనల్ని ఊరిస్తూ ఉంటాయి. . క్రెడిట్ కార్డు అంటేనే ఒక కత్తి మీద సాము అని చెప్పవచ్చు. క్రెడిట్ కార్డును సరిగా ఉపయోగించుకుంటే అంతకన్నా లాభసాటి ఆర్థిక ఒప్పందం మరొకటి లేదు అని చెప్పవచ్చు. అదే క్రెడిట్ కార్డును సక్రమంగా వాడుకోకపోతే అప్పుల పాలవడం మాత్రం ఖాయమని చెప్పవచ్చు. ప్రస్తుతం క్రెడిట్ కార్డ్ లిమిట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డును మీరు వాడిన తర్వాత దాని లిమిట్ పెంచుకునే వెసులుబాటు కల్పిస్తాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచడం వల్ల కలిగే లాభాలు, అలాగే నష్టాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకంటే క్రెడిట్ కార్డు ఎంత లాభం చేకూరుస్తుందో అంతే నష్టాన్ని కూడా చేకూరుస్తుంది.


క్రెడిట్ కార్డు లిమిట్ పెంచడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డ్ లిమిట్ పెరిగినప్పుడు మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో తగ్గిపోతుంది. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు లిమిట్ 25 వేల రూపాయలు అనుకుందాం. మీరు ప్రతి నెల క్రెడిట్ కార్డు ద్వారా దాదాపు 15 వేల రూపాయల బిల్ చేస్తున్నారు అనుకుందాం. అలాంటప్పుడు మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో ప్రతినెల 60% గా ఉంటుంది. ఇలా ఉండటం వల్ల మీ సిబిల్ స్కోర్ దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా క్రెడిట్ కార్డులో 30% కన్నా తక్కువ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో ఉండాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఒకవేళ క్రెడిట్ కార్డు లిమిట్ 50 వేల రూపాయలకు పెంచినట్లయితే, మీ క్రెడిట్ యుటిలైజేషన్ లిమిట్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది.


అలాగే అత్యవసర పరిస్థితుల్లో కూడా క్రెడిట్ కార్డు లిమిట్ పెంచడం ద్వారా మీకు డబ్బు ఖర్చు చేయడానికి వెసులుబాటు లభిస్తుంది. దీనికి తోడు మీరు ఏదైనా ఖరీదైన వస్తువులు షాపింగ్ చేయడానికి కూడా ఈ క్రెడిట్ కార్డు లిమిట్ పెంపుదల అనేది ఉపయోగపడుతుంది.

క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం

క్రెడిట్ కార్డు లిమిట్ పెరగడం వల్ల మీరు ఖర్చులు ఎక్కువగా పెంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది తద్వారా అధిక అప్పుల ఊబిలో పడే ఉంటుంది. తిరిగి బిల్లులను చెల్లించడానికి ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అలాగే లిమిట్ పెరిగింది కదా అని మీరు ఖర్చు పెంచుకొని ఆ తర్వాత వచ్చిన బిల్లును ఈఏంఐ రూపంలోకి మార్చుకున్నట్లయితే, మీకు వడ్డీ భారం పెరిగిపోతుంది. అలాగే లిమిట్ పెరిగినప్పుడల్లా యాన్యువల్ ఫీజు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటు క్రెడిట్ కార్డు లిమిట్ పెరగడం వల్ల కలిగే మరో ప్రధానమైన నష్టం ఒకవేళ కార్డు గనుక హ్యాకింగ్ గురైన, క్లోనింగ్ గురైనా మీరు ఎక్కువ మొత్తంలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కనుక ఎప్పటికప్పుడు ఈ ప్రమాదాలను గుర్తించి జాగ్రత్తగా క్రెడిట్ కార్డు విషయంలో నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అలాగే క్రెడిట్ కార్డు బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించడం ద్వారా మీరు భవిష్యత్తులో ఇబ్బందుల పాలు కాకుండా ఉండవచ్చు.

Related News

Richest Spiritual Gurus: పేరుకు ఆధ్యాత్మిక గురువులు, ఆస్తులు చూస్తే షాకవ్వాల్సిందే!

BSNL Plan: 2 జీబీ డేటా.. 28 రోజుల వ్యాలిడిటీ.. మరీ ఇంత తక్కువ ధరకా?

BSNL Double Offers: BSNL డబుల్ ధమాకా.. పాత ధరకే సూపర్ బెనిఫిట్స్!

UPI Money Transfer: యూపీఐ నుంచి వేరే నెంబర్‌కు డబ్బు పంపించారా? ఈ ఒక్క స్టెప్‌తో మీ డబ్బు సేఫ్

RBI to Banks: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఇకపై ఏటీఎంలో ఆ నోట్లు తప్పనిసరి

Big Stories

×