E-Paper
Advertisement

హాస్పిటల్ నుండి డిస్చార్జ్ అయిన పవన్ కళ్యాణ్.. ఎమోషనల్ నోట్ పంచుకున్న అన్నా!

హాస్పిటల్ నుండి డిస్చార్జ్ అయిన పవన్ కళ్యాణ్.. ఎమోషనల్ నోట్ పంచుకున్న అన్నా!
Advertisement

Pawan Kalyan:టాలీవుడ్ పవర్ స్టార్, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితం ముంబై కోకిలబెన్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన సతీమణి అన్నా కొణిదెల పంచుకుంటూ ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. గత కొంత కాలంగా భుజాల నొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ డాక్టర్ డిన్ షా పార్థివాలా నేతృత్వంలో కుడి భుజానికి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శించారు కూడా.. ఇక బుధవారం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా తనకు ఆపరేషన్ చేసిన డాక్టర్ డిన్ షా పార్థివాలాను కలసి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన చిత్రపటం కూడా బహుకరించారు. మరొకవైపు పవన్ కళ్యాణ్ సర్జరీకి అయిన ఖర్చులు ప్రభుత్వం కాకుండా ఆయనే సొంతంగా భరిస్తున్నట్లు జనసేన పార్టీ స్పష్టం చేసింది.

డిస్చార్జ్ అయిన పవన్ కళ్యాణ్..

ఇకపోతే పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్ అయిన సందర్భంగా డాక్టర్ తో దిగిన కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ నోట్ పంచుకుంది. చివరికి ఈ రోజు మేము హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాము. మా హృదయం కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. నా భర్త పై అసాధారణమైన శ్రద్ధ తీసుకొని , తన శస్త్ర చికిత్స అత్యున్నత స్థాయిలో నైపుణ్యం, ప్రొఫెషనల్ తో చేసినందుకు ఈ అద్భుతమైన వైద్య బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

ఉత్తముల చేతుల్లో ఉన్నాడని తెలుసు – అన్నా..

Advertisement

నా భర్త ఉత్తముల చేతుల్లో ఉన్నాడని మాకు తెలుసు.. అది మా కుటుంబానికి వెల కట్టలేని ఏదో మనశ్శాంతిని ఇచ్చింది. వీరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ నైపుణ్యతకు మాత్రమే కాదు ఈ ప్రయాణంలో మీ దయ, అంకిత భావం, కరుణకి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అంటూ కోకిలబెన్ హాస్పిటల్ లో పనిచేస్తున్న నిపుణులు ఆర్థ్రోస్కోపీ సర్జన్ డాక్టర్ దిన్షా పార్థివాలా, సీనియర్ అనెస్టిస్ట్ డాక్టర్ శ్యాంసుందర్ గాంకర్ , అసిస్టెంట్ డాక్టర్ – డాక్టర్ హితేష్ యాదవ్, అసిస్టెంట్ డాక్టర్ – డాక్టర్ అర్పిత్ మూత లను అన్నా ప్రత్యేకంగా యాడ్ చేస్తూ వీరికి కృతజ్ఞతలు షేర్ చేశారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా డిశ్చార్జ్ అవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ALSO READ:సునయన ప్రేమ, పెళ్లిలో ఇన్ని ట్విస్టులా..ఈమె భర్త బ్యాక్ గ్రౌండ్ చూసారా?

నాలుగు నెలల సమయం..

Advertisement

ఇకపోతే పవన్ కళ్యాణ్ నేడు నేరుగా హైదరాబాదులోని తన నివాసానికి చేరుకుంటారు. అలాగే మూడు వారాల తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ కి వైద్యులు ఫిజియోథెరపీ ప్రారంభించనున్నారు. వైద్యుల సమక్షంలో ఈ ఫిజియోథెరపీ జరగనున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ చేసిన కుడి భుజం సాధారణ స్థితికి చేరుకోవడానికి మరో నాలుగు నెలల సమయం పడుతుందని , కోకిలబెన్ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. ఇక ఈ భుజం పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన ఎడమ భుజానికి పరీక్షలు నిర్వహించి , అవసరమైతే దానికి కూడా సర్జరీ చేయనున్నట్లు సమాచారం.

Related News

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

మరో రికార్డు కొల్లగొట్టిన ఇరుముడి… దండయాత్ర కొనసాగిస్తున్న రవన్న!

డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొత్త చర్చలు.. సుమలత గద్దె దిగబోతోందా?

మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!

Big Stories

Advertisement
×