Priyanka Chopra:ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా గ్లోబల్ లెవెల్లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజువల్ వండర్ ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో తాను ఎంతగా ఇన్వాల్వ్ అయిందో చెప్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలు చూద్దాం..
తాజా ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం తాను గత 14 నెలలుగా నాన్‌స్టాప్‌గా వర్క్ చేస్తున్నట్లు రివీల్ చేసింది. “దర్శకుడు రాజమౌళి సినిమాను పర్‌ఫెక్ట్‌గా తెరకెక్కించడానికి చాలా సమయం తీసుకుంటారు. ఇక ఆయన ప్రతి సీన్‌ను, ప్రతి చిన్న విషయాన్ని ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తారు” అని జక్కన్న వర్కింగ్ స్టైల్‌ను పొగిడేసింది. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం తాను పడిన కష్టం, పెట్టిన టైమ్ తన కెరీర్‌లోనే చాలా ప్రత్యేకం అని చెప్పుకొచ్చింది.
సినిమాలో తన క్యారెక్టర్ గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంటూ.. తాను ఈ మూవీలో మందాకిని అనే పాత్రలో కనిపిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా, స్క్రీన్‌పై విజువల్స్ అద్భుతంగా రావడం కోసం తాను చాలా స్లో మోషన్ జంప్స్ అలాగే భారీ యాక్షన్ స్టంట్స్ చేశానని చెప్పింది. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో వారణాసి చాలా డిఫరెంట్ అని, ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ సీక్రెట్స్ బయటపెట్టలేనని నవ్వేసింది.
also read:RGV: సెన్సార్ బోర్డుపై రాంగోపాల్ వర్మ సంచలన పోస్ట్..!
మరోవైపు ఈ సినిమా కథా నేపథ్యంపై కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఆఫ్రికా దట్టమైన అడవులు, అంటార్కిటికా మంచు కొండలు, రామాయణ ఇతిహాసాలు, ప్రకృతి విపత్తులు వంటి భారీ ఫాంటసీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఉండబోతోంది. ఇక ఇందులో మహేశ్ బాబు శ్రీరాముడు, రుద్రుడిగా రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో మెరవనుండగా, విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.
ఇప్పటివరకు కేవలం టైటిల్ గ్లింప్స్ మాత్రమే రావడంతో ఫ్యాన్స్ కొంచెం నిరాశలో ఉన్నారు. కానీ ఆగస్ట్ 9న మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా వారణాసి టీం నుంచి ఒక బిగ్ ట్రీట్ ఉంటుందని గట్టిగా ఆశిస్తున్నారు. కాగా, ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇక సెప్టెంబర్ లేదా అక్టోబర్ తో పూర్తి షూటింగ్ ముగించి, వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ప్రియాంక చోప్రా ఇచ్చిన అప్‌డేట్‌తో వారణాసి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. రాజమౌళి విజన్, మహేశ్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ కలబోసి రాబోతున్న ఈ విజువల్ వండర్ ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.