E-Paper
Advertisement

 సూపర్ హీరో సినిమా తీయాలని కుర్రాళ్ల ఆరాటం… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్

 సూపర్ హీరో సినిమా తీయాలని కుర్రాళ్ల ఆరాటం… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్
Advertisement

Malayalam Adventure: సినిమా పిచ్చి మరీ ఎక్కువగా ఉన్నవాళ్ళు చిన్నప్పటి నుంచే ఇండస్ట్రీ గురించి కలలు కంటూ బతుకుతారు. ఏదో ఒకరోజు పెద్ద స్టార్ అనిపించుకోవాలి అని ఉవ్విళ్లూరుతూ, అందుకు తగ్గ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మరికొందరు ఫిల్మ్ మేకింగ్ పై దృష్టి పెడతారు. అలా ఓ కుర్రాళ్ల గ్యాంగ్, ఒక సూపర్ హీరో సినిమాను తీయాలి అనుకుని ఎలాంటి పాట్లు పడిందో చూడాలంటే ‘రివాల్వర్ రింకో’ (Revolver Rinko)పై ఒక లుక్కేయాల్సిందే. ఈ మలయాళ అడ్వెంచర్ కామెడీ డ్రామా చిత్రం ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? తెలుగులో ఉందా ? అనే వివరాల్లోకి వెళ్ళే ముందు స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సినిమా కథ కోజికోడ్ పరిసరాల్లోని ఒక చిన్న గ్రామీణ ప్రాంతంలో ఉంటుంది. ఆ ఊరిలో ఉండే కొంతమంది పిల్లలకు సూపర్ హీరోలంటే పిచ్చి ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా మలయాళ సూపర్ హీరో సినిమా ‘మిన్నల్ మురళి’ అంటే ఆ పిల్లలకు ప్రాణం. ఆ పిల్లల గ్రూప్‌లోని ఒక అబ్బాయి జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంటుంది. ఆ బాధలో ఉన్న ఆ అబ్బాయిని ఎలాగైనా సంతోషపెట్టాలని అతని స్నేహితులు అనుకుంటారు.

Advertisement

బాధలో ఉన్న తన స్నేహితుడి కోసం పిల్లలందరూ కలిసి సొంతంగా ఒక అద్భుతమైన లో-బడ్జెట్ సూపర్ హీరో సినిమా తీయాలని డిసైడ్ అవుతారు. దానికి ఆ ఊరిలోనే ఉండే ‘ప్రియేష్’ అనే వ్యక్తి సహాయం తీసుకోవాలని ప్లాన్ చేస్తారు. ప్రియేష్ అప్పటికే మ్యూజిక్ ఆల్బమ్స్, చిన్న చిన్న హోమ్ మూవీస్ డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. పిల్లల కోరిక మేరకు ప్రియేష్ తన ఫ్రెండ్స్ టీం… లాలు అలెక్స్, విజిలేష్, సంజు శివరామ్ కూడా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇస్తారు.

‘రివాల్వర్ రింకో’ అనే పేరుతో ఒక ఇండిపెండెంట్ సూపర్ హీరో సినిమాను నిర్మించడానికి ఈ చిన్న పిల్లలు, పెద్దలు కలిసి సినిమా జర్నీని స్టార్ట్ చేస్తారు. అసలు సినిమా ఫీల్డ్ గురించి ఏమాత్రం అవగాహన లేకపోవడం, బడ్జెట్ కొరత, సినిమా తీయడానికి పరికరాలు లేకపోవడం, లోకల్ గా వచ్చే సమస్యల వల్ల షూటింగ్ సమయంలో వీళ్ళకు ఎన్నో సవాళ్లు, ఆటంకాలు ఎదురవుతాయి. కానీ ఆ సవాళ్లన్నింటినీ దాటుకుని క్రియేటివ్ ఐడియాస్ తో వాళ్ళు ఆ సినిమాను ఎలా కంప్లీట్ చేశారు ? అనుకున్న విధంగా ఆ చిన్నారి స్నేహితుడి మొఖంలో చిరునవ్వు వచ్చేలా చేశారా ? అనేదే ఈ సినిమా కథాంశం.

ఏ ఓటీటీలో ఉందంటే ?

Advertisement

‘రివాల్వర్ రింకో’ మూవీ Sun NXT, Saina Play ఓటీటీలలో మలయాళ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ లో-బడ్జెట్ చిత్రం 2026 మేలో థియేటర్లలో విడుదలైంది. విష్ణు ఉన్నికృష్ణన్, లాలు అలెక్స్, విజిలేష్, సంజు శివరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగులో ఇంకా స్ట్రీమింగ్ లోకి అందుబాటులోకి రాలేదు.

Read Also: అపర కుబేరుడితో పెళ్లి… భర్తకు తెలియకుండా మరొకరితో… స్వీట్ రివేంజ్ డ్రామా

Tags

Related News

వయసు 50 దాటినా యాక్షన్‌లో తగ్గేదేలే… పాత గూఢచారులు మళ్లీ రంగంలోకి… అదిరిపోయే కొరియన్ యాక్షన్ కామెడీ సిరీస్

కాబోయే భార్యకు కుక్కలంటే అలర్జీ… ప్రాణంగా పెంచుకున్న పెట్‌ను ఏం చేశాడంటే ? డాగ్ లవర్స్ డోంట్ మిస్

గ్రామంపై భారీ కొండచిలువ దాడి.. దాన్ని చంపేందుకు 3 రోజుల డెడ్‌లైన్… చైనీస్ మాన్‌స్టర్ థ్రిల్లర్ తెలుగులో

గతం మర్చిపోయిన సూపర్ హీరో… పట్టిస్తే భారీ నజరానా… ఈ సిరీస్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు

వందల అడుగుల ఎత్తులో ప్రాణాలతో పోరాటం… ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెడితే ఇదా బహుమతి ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ నెక్స్ట్ లెవల్

ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

Big Stories

Advertisement
×