E-Paper
Advertisement

పోసాని భార్యను రోజూ బ్రతిమిలాడిన త్రివిక్రమ్.. ఆ రోజూల్లో ‘గురూజీ’ పడ్డ కష్టాలు ఇవే!

పోసాని భార్యను రోజూ బ్రతిమిలాడిన త్రివిక్రమ్.. ఆ రోజూల్లో ‘గురూజీ’ పడ్డ కష్టాలు ఇవే!
Advertisement

Trivikram Struggles:త్రివిక్రమ్ శ్రీనివాస్.. పరిచయం అక్కర్లేని పేరు ఇది.తనదైన పంచు డైలాగ్స్ తో సినిమా రచన స్థాయిని మరో మెట్టు ఎక్కించిన క్రియేటివ్ డైరెక్టర్.ఆయన దర్శకత్వంలో వచ్చిన అతడు’ (2005), ‘జల్సా’ (2008), ‘అత్తారింటికి దారేది’ (2013), ‘అల వైకుంఠపురములో’ (2020)వంటి  సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో  చెప్పక్కర్లేదు.

ఇక ప్రస్తుతం ఒక్కో సినిమాకి కోట్ల రూపాయలపారితోషికం అందుకుంటున్న  ఈ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో కష్టాలు కన్నీళ్లు ఉన్నాయి.ఇదే విషయమై సీనియర్ రచయిత నటుడు పోసాని కృష్ణ మురళి ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ గురించి పలు విషయాలు చెప్పుకొచ్చాడు.

Advertisement

పోసాని భార్యను కలిసి బతిమిలాడిన త్రివిక్రమ్ 

ఆ రోజుల్లో పోసాని రచయితగా వరుస సినిమాలతో తీరిక లేనంత బిజీగా ఉండేవారు.త్రివిక్రమ్ ఎలాగైనా ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేరాలని ప్రతిరోజు పోసాని ఇంటికి వెళ్లేవారట .కానీ పోసాని ఎప్పుడు వర్క్ టెన్షన్లో ఉదయాన్నే బయటికి వెళ్లిపోయేవాడు. దాంతో త్రివిక్రమ్ ప్రతిరోజు పోసాని భార్యను కలిసి బతిమిలాడే వాడట. త్రివిక్రమ్ తన పేరు ఆకెళ్ళ శ్రీనివాస్ అని తను పోసానికి చాలా పెద్ద ఫ్యాన్ అని చెబుతూ ఎలాగైనా ఒక అవకాశం ఇప్పించాలని కోరాడట త్రివిక్రమ్ .  ఇక త్రివిక్రమ్ పట్టుదల చూసిన పోసాని భార్య ఆ కుర్రాడు రోజు వస్తున్నాడు కనీసం ఏదో ఒకటి చెప్పండి అంటూ పోసానికి సిఫార్సు చేసిందట.

Advertisement

 బంగారు బ్రాస్ తీసి డబ్బులు ఇచ్చిన గౌతమ్ రాజు

ఇక అదే సమయంలో ప్రముఖ కమెడియన్ గౌతమ్ రాజు కూడా పోసాని కి త్రివిక్రమ్  గురించి ప్రత్యేకంగా చెప్పాడట .ఈ అబ్బాయి చాలా టాలెంటెడ్ అని, కానీ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నాడని వివరించారట. దాంతో పోసాని త్రివిక్రమ్ తో తాను సినిమా పనిమీద పది పదిహేను రోజులు చెన్నైలో ఉంటానని అక్కడికి వస్తే మాట్లాడుకుందాం అని చెప్పాడట.కానీ అప్పట్లో హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లడానికి కనీసం రైల్వే టికెట్ కొనేంత  డబ్బులు కూడా త్రివిక్రమ్ వద్దలేవట .ఇది తెలుసుకున్న గౌతమ్ రాజు తన చేతికున్న బంగారు బ్రాస్ లేట్ ని  ఒక మార్వాడి షాప్ లో కేవలం 1000 రూపాయలకు తాకెట్టు పెట్టి మరి ఆ డబ్బుని త్రివిక్రమ్ చేతిలో పెట్టాడట .

తనకంటూ ఒక సొంత గుర్తింపు తెచ్చుకున్న గురూజీ 

అలా గౌతమ్ రాజు ఇచ్చిన డబ్బుతో మద్రాసు వెళ్లి పోసాని దగ్గర అసిస్టెంట్ గా చేరి ఆ తర్వాత స్టార్ రైటర్ గా ఎదిగాడు.త్రివిక్రమ్ 1999 లో వచ్చిన స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.తరుణ్, రీచాల కాంబోలో విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వే కావాలి ఇప్పటికి ఒక ట్రెండ్ సెట్టర్ .

also read :దళపతి విజయ్ ఆఖరి వేట: ‘జన నాయగన్’ రిలీజ్ డేట్ లాక్ ?

ఇక అదే విజయ భాస్కర్ దర్శకత్వంలో 2001లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ ,2004 లో వచ్చిన మల్లీశ్వరి సినిమాలతో ఇండస్ట్రీలో త్రివిక్రమ్. రచయితగా తనకంటూ ఒక సొంత గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెల్సిందే.అలా చేతిలో డబ్బులు లేని సమయంలో తనకి డబ్బులు ఇచ్చి ఆదుకున్నాడు కాబట్టే గౌతం రాజు కి తన ప్రతీ సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ ఇస్తుంటాడు మన గురూజీ !ఇక ప్రస్తుతం వెంకీ మామతో ఆదర్శ కుటుంబం చేస్తున్న ఈ మాటల మాంత్రికుడు తారక్ తో గాడ్ ఆఫ్ వార్ ని అనౌన్స్ చేసిన సంగతి తెల్సిందే .

Related News

వారణాసిపై ప్రియాంక చోప్రా బిగ్ అప్డేట్.. 14 నెలలుగా అదే పని అంటూ!

‘రావు బహదూర్’ని లేపడానికి వంగా తాపత్రయం… వర్కవుట్ అవుతుందా బాసూ?

RGV: సెన్సార్ బోర్డుపై రాంగోపాల్ వర్మ సంచలన పోస్ట్..!

హాస్పిటల్ నుండి డిస్చార్జ్ అయిన పవన్ కళ్యాణ్.. ఎమోషనల్ నోట్ పంచుకున్న అన్నా!

సునయన ప్రేమ, పెళ్లిలో ఇన్ని ట్విస్టులా..ఈమె భర్త బ్యాక్ గ్రౌండ్ చూసారా?

దళపతి విజయ్ ఆఖరి వేట: ‘జన నాయగన్’ రిలీజ్ డేట్ లాక్ ?

ఆ క్షణం కోసం పరితపించాను – సమంత

Big Stories

Advertisement
×