E-Paper
Advertisement

సునయన ప్రేమ, పెళ్లిలో ఇన్ని ట్విస్టులా..ఈమె భర్త బ్యాక్ గ్రౌండ్ చూసారా?

సునయన ప్రేమ, పెళ్లిలో ఇన్ని ట్విస్టులా..ఈమె భర్త బ్యాక్ గ్రౌండ్ చూసారా?
Advertisement

Sunaina Badam:సునైనా బాదం.. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ను మొదలుపెట్టి, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా సత్తాచాటిన ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఈమెను ప్రతి ఒక్కరు ‘అమ్మోరు’ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గానే గుర్తుపెట్టుకున్నారు. పెద్దపెద్ద కళ్ళు వేసుకొని, తన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది సునైనా.. 1995లో వచ్చిన అమ్మోరు సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచి, ఇప్పటికీ ఆ సినిమా అంటే అటు సౌందర్యతో పాటు సునైనా పేరు కూడా ప్రథమంగా వినిపిస్తుంది. అంతలా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది సునైన.

తొలిసారి ప్రేమ, పెళ్లిపై ఊహించని కామెంట్లు చేసిన సునైనా బాదం..

అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సునైన.. 2019లో నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత లీడ్ రోల్ పోషిస్తూ వచ్చిన ఓ బేబీ చిత్రంలో రాజేంద్రప్రసాద్ కూతురిగా.. పెళ్లికాని 34ఏళ్ల అమ్మాయిగా నటించి, తన ఫ్రస్టేషన్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఎక్కువగా ఫ్రస్టేషన్ ఉమెన్ పేరిట పలు వీడియోలు చేస్తూ అటు యూట్యూబ్ లో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది సునైనా.. ఇకపోతే ఈ మధ్యకాలంలో చురుకుగా అవకాశాల అందుకుంటూ దూసుకుపోతున్న సునైన.. ఓం భీమ్ బుష్, సుందరకాండ వంటి చిత్రాలలో గుర్తుండిపోయే పాత్రలు పోషించింది.. ఇకపోతే ప్రస్తుతం ‘హ్యాపీ జర్నీ’ అనే సినిమాలో నటిస్తున్న ఈమె.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని.. తొలిసారి తన ప్రేమ, పెళ్లి గురించి కామెంట్లు చేసింది. అంతేకాదు తన భర్త బ్యాక్ గ్రౌండ్ గురించి కూడా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. మరి సునైన భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో? వీరి ప్రేమ వివాహం ఎలా జరిగిందో ? ఇప్పుడు చూద్దాం.

Advertisement

ALSO READ:ఆ క్షణం కోసం పరితపించాను – సమంత

సుమోలు, ఎండుమిరపకాయలు లేవలేదంతే..

సునైనా బాదం మాట్లాడుతూ..” కాలేజీలో మాస్టర్స్ ఎంబీఏ చేస్తున్న సమయంలో నేను ఫస్ట్ సెమిస్టర్.. ఆయన థర్డ్ సెమిస్టర్.. అసలు నేను ఒక ఆర్టిస్ట్ అనే విషయం కూడా ఆయనకు తెలియదు. కాకపోతే నన్ను ఇష్టపడ్డాక తన ఫ్రెండ్స్ ద్వారా నేను ఆర్టిస్టుని అనే విషయం తెలుసుకున్నారు. అయినా సరే నన్ను పెళ్లి చేసుకుంటానని డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చి మా అమ్మని అడిగారు. అయితే అలా అడగడానికి కూడా కారణం నేనే.. నీకు దమ్ము ధైర్యం వుంటే వెళ్లి మా అమ్మని అడుగు అని చెప్పాను. అలా రెచ్చగొట్టడం వల్లే ఆయన నేరుగా మా ఇంటికొచ్చి మా అమ్మను పెళ్లి చేసుకుంటానని అడిగారు. అయితే మూడేళ్ల తర్వాత మా పెళ్లి జరిగింది. మా అత్త వాళ్ళ ఇంట్లో అడ్జస్ట్ అవ్వడానికి కూడా నాకు చాలా సమయం పట్టింది. ఒకరకంగా చెప్పాలి అంటే మా ప్రేమ కథ చాలా పెద్దది.. సుమోలు ఎండుమిరపకాయలు లేవలేదు అంతే అంటూ కామెంట్లు చేసింది.

సునైనా బాదం భర్త బ్యాక్ గ్రౌండ్..

Advertisement

“మా ఆయన చాలా మంచివారు.. ఓపిక ఎక్కువ. అయితే పెళ్లి జరిగిన తర్వాత మూడు సంవత్సరాల పాటు ఎడమొహం పెడమొహంగానే మా అత్తమామలు ఉండేవాళ్లు. పైగా వాళ్ల ఇంటికి మా ఆయన పెద్దమనవడు. ఇక నేను కూడా ఒక కొడుకు జన్మనిచ్చిన తర్వాత వారి ఎమోషన్స్ ని అర్థం చేసుకున్నాను. భువనగిరిలో మా భర్త వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది. మా భర్త వాళ్ళ నాన్న, బాబాయ్ ల ఫ్యామిలీ ఒకే కుటుంబంలో ఇప్పటికీ కలిసే ఉంటున్నారు. అక్కడ వాసవి కన్యకా పరమేశ్వరి గుడి ఉంది. దాని బాధ్యత మొత్తం మా మామగారిదే.. నా భర్త తాతగారు ఇంకా ఉన్నారు. ఆయన అక్కడ పెద్ద జమీందారు. సిమెంటు, ఐరన్ బిజినెస్ లు వాళ్లకు బాగా ఉన్నాయి. యాదాద్రి దగ్గర ఉన్న భువనగిరి మొత్తంలో వీరు బాగా ఫేమస్” అంటూ తన భర్త బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం తన భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నట్లు కూడా సునైనా తెలిపింది.

Related News

వారణాసిపై ప్రియాంక చోప్రా బిగ్ అప్డేట్.. 14 నెలలుగా అదే పని అంటూ!

‘రావు బహదూర్’ని లేపడానికి వంగా తాపత్రయం… వర్కవుట్ అవుతుందా బాసూ?

RGV: సెన్సార్ బోర్డుపై రాంగోపాల్ వర్మ సంచలన పోస్ట్..!

పోసాని భార్యను రోజూ బ్రతిమిలాడిన త్రివిక్రమ్.. ఆ రోజూల్లో ‘గురూజీ’ పడ్డ కష్టాలు ఇవే!

హాస్పిటల్ నుండి డిస్చార్జ్ అయిన పవన్ కళ్యాణ్.. ఎమోషనల్ నోట్ పంచుకున్న అన్నా!

దళపతి విజయ్ ఆఖరి వేట: ‘జన నాయగన్’ రిలీజ్ డేట్ లాక్ ?

ఆ క్షణం కోసం పరితపించాను – సమంత

Big Stories

Advertisement
×