AI Smartphones: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ యుగంలో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) హవా నడుస్తోంది. ఒకప్పుడు కేవలం ప్రీమియం ఫోన్లకే పరిమితమైన ఈ ఏఐ ఫీచర్లు.. ఇప్పుడు మధ్యతరగతి వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. ఒక వేళ రూ. 30,000 లోపు బడ్జెట్‌లో అద్భుతమైన ఏఐ ఫీచర్లు, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఉన్న ఫోన్ కోసం ఎదురుచూస్తుంటే ఈ కథనం మీకోసమే. ప్రస్తుతం మార్కెట్లో ట్రెండ్ అవుతున్న టాప్ – 5 మెుబైల్స్, వాటిలోని ఏఐ ఫీచర్లు ఇప్పుడు చూద్దాం.
మోటోరోలా తన సరికొత్త ‘హలో యూఐ’ సాంకేతికతతో అదిరిపోయే ఏఐ ఫీచర్లను అందిస్తోంది. దాదాపు రూ. 27,999 ధరతో లభిస్తున్న ఈ ఫోన్.. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో ఉన్న స్మార్ట్ ఏఐ కెమెరా ఫీచర్లు, ఫొటో ఎడిటింగ్ టూల్స్ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇది స్లిమ్ డిజైన్, కర్వ్డ్ డిస్‌ప్లేతో పాటు అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కలిగి ఉంది.
శాంసంగ్ బడ్జెట్ విభాగంలో వచ్చి ఈ గెలాక్సీ ఫోన్.. ప్రస్తుతం విశేషంగా ఆకట్టుకుంటోంది. దీని ధర సుమారు రూ. 24,999 గా ఉంది. ఈ ఫోన్ ‘గూగుల్ జెమిని లైవ్’ వంటి లేటెస్ట్ AI ఫీచర్లతో వచ్చింది. అంతేకాకుండా ఇందులో 6000mAh బ్యాటరీ ఉండటం వల్ల గేమర్లకు, హెవీ యూజర్లకు బాగా ఉపయోగపడుతుంది. 6 ఏళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్స్ ఇస్తామని శాంసంగ్ ప్రకటించడం ఈ ఫోన్‌కు అతిపెద్ద అడ్వాంటేజ్.
అడ్వాన్స్డ్ ఫీచర్లతో రియల్ మీ తీసుకొచ్చిన ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 23,999. ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా ‘హైపర్‌విజన్ ప్లస్ ఏఐ’ (Hypervision+ AI) చిప్‌ను అమర్చారు. ఇది ఫొటోల క్వాలిటీని దానంతట అదే పెంచడంతో పాటు ఫోన్ పర్ఫార్మెన్స్‌ను స్మార్ట్‌గా మేనేజ్ చేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇందులో ఏకంగా 10,001mAh టైటాన్ బ్యాటరీ ఉండటం యూజర్లకు అతిపెద్ద ప్లస్ గా చెప్పవచ్చు.
వన్‌ప్లస్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో వచ్చిన ఈ ఫోన్.. ‘ఆక్సిజన్ ఓఎస్ 16’ తో పని చేస్తుంది. ఈ ఫోన్‌లో రోజువారీ పనులను మరింత తేలిక చేసేలా ఏఐ స్మార్ట్ టూల్స్ తీసుకొచ్చారు. అంతేకాకుండా 8,000mAh బ్యాటరీ, సూపర్ ఊక్ ఛార్జింగ్ సపోర్ట్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఈ ఫోన్ కలిగి ఉంది. తక్కువ ధరలో ప్రీమియం అనుభూతిని ఈ ఫోన్ అందిస్తుందని వన్ ప్లస్ వర్గాలు తెలిపాయి.
Also Read: ఛార్జింగ్ తిప్పలు లేని స్మార్ట్‌వాచ్‌లు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. వారాల పాటు తిరుగుండదు!
రూ. 30,000 లోపు బడ్జెట్ లో స్టైలిష్ లుక్, బెస్ట్ కెమెరా కోరుకుంటే ఈ వివో ఫోన్ ట్రై చేయండి. వివో తన ప్రత్యేకమైన ‘ఏఐ నైట్ పొర్ట్రెయిట్’, ‘ఏఐ సీన్ డిటెక్షన్’ ఫీచర్లను ఇందులో చేర్చింది. తక్కువ లైటింగ్ లో కూడా అద్భుతమైన ఫొటోలను తీయడానికి ఈ AI టెక్నాలజీ సహాయపడుతుందని వివో వర్గాలు చెబుతున్నాయి. అటు బ్యాటరీ, డిస్ ప్లే క్వాలిటీ పరంగానూ ఈ ఫోన్ యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Also Read: రూ. 5,000 లోపు బెస్ట్ బడ్జెట్ ఫోన్లు.. కాల్స్ కోసమే కాదు.. అంతకుమించి!