E-Paper
Advertisement

ఒకప్పుడు ఛాన్సుల కోసం.. ఇప్పుడు డేట్ల కోసం! కిరణ్ అబ్బవరం రేంజ్ మామూలుగా లేదుగా!

ఒకప్పుడు ఛాన్సుల కోసం.. ఇప్పుడు డేట్ల కోసం! కిరణ్ అబ్బవరం రేంజ్ మామూలుగా లేదుగా!
Advertisement

Kiran Abbavaram:కిరణ్ అబ్బవరం ..చిన్నచిన్న షార్ట్ ఫిలిమ్స్ తో సత్తా చాటిన ఈ కుర్ర హీరో రాజు గారు రాణి వారు అనే చిన్న సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తనదైన ముద్ర వేశాడు.ఆ తర్వాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణమండపం సాలిడ్ వసూల్లని  కొల్లగొట్టడంతో ప్రామిసింగ్ హీరోగా పాతుకుపోయాడు.మధ్యలో సెబాస్టియన్, సమ్మతమే వంటి సినిమాలు వచ్చి కిరణ్ కి పెద్ద షాక్ ఇచ్చాయి కూడా.ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వచ్చిన మీటర్ అనే సినిమా నెటిజన్లకి మంచి స్టఫ్ నిచ్చింది .కుదురుగా సాఫ్ట్ సినిమాలు చేసుకోకుండా ఇలా యాక్షన్ హీరోగా ఒకేసారి ఎదిగిపోవాలని ఇలాంటి రొడ్డ కొట్టుడు సినిమాలు చేయడం ఎందుకో అంటూ ఏకిపారేశారు నెట్టిజన్లు .

పోటీపడి ఏకంగా 50 కోట్లు కొల్లగొట్టిన ‘క ‘

Advertisement

ఆ తర్వాత వచ్చిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని,దిల్ రూబా వంటి సినిమాలు కూడా కిరణ్ అబ్బవరం ని సక్సెస్ ట్రాక్ లో పెట్టలేకపోయాయి .కానీ గతేడా దీపావళి సీజన్లో వచ్చిన క సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్ ని  ఒక్కసారిగా యూటర్న్ తిప్పేసింది .చిన్న సినిమాగా వచ్చి,అమరన్ వంటి సినిమాతో పోటీపడి ఏకంగా 50 కోట్లు కొల్లగొట్టడం అంటే మామూలు విషయం కాదు .ఇక తాజాగా వరుస సినిమాలతో  మోస్ట్ బిజీ అయిపోయిన కిరణ్ అబ్బవరం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా తాను నటించిన చెన్నై లవ్ స్టోరీ ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు.

ఐదేళ్లలో ఇండస్ట్రీలో నేను ఏం సంపాదించాను అంటే

Advertisement

ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో ఇండస్ట్రీలో నేను ఏం సంపాదించాను అంటే.. ప్రేక్షకుల నుంచి అపారమైన ప్రేమను సంపాదించాను”అంటూ కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చాడు . అయితే ఆ ప్రేమతో పాటే సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి కూడా ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేశాడు.ఐదేళ్లలో నన్ను తిట్టారు, పొగిడారు, కొట్టారు ,తన్నారు ..అన్ని జరిగాయి కానీ ఇవాళ ఎక్కడో ఒకచోట కిరణ్ అబ్బవరం అనే పేరు గురించి డిస్కషన్ జరుగుతుందంటే అది నా అదృష్టం .నేను సాధించిన సక్సెస్ అని చెప్పుకుంటూ మురిసిపోయాడు ఈ కుర్ర హీరో .

అంటే పొగిడినా, తిట్టినా మీమర్స్ దయ వల్ల మొత్తానికి ట్రెండింగ్‌లో అయితే ఉంటున్నా అనే సాటిస్ఫాక్షన్ మనోడి మాటల్లో క్లియర్ గా కనిపించింది.ఇక సినిమా పిచ్చితో నిద్రలేచినప్పటి నుంచి మంచి సినిమా చేయాలని తాపత్రయమే ఈ స్థానంలో నిలబెట్టింది అని  చెప్పుకొచ్చాడు కిరణ్.మొత్తంగా ఒకప్పుడు ఛాన్సుల కోసం తిరగగా ఇపుడు నా డేట్ల కోసం వెయిట్ చేస్తున్నారంటూ ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ వదిలాడన్న మాట .

దర్శకత్వంలో ఎలాంటి సంచనాలు సృష్టిస్తాడో

అయితే కేవలం నటనతోనే ఆగకుండా మెగా ఫోన్ పట్టి దర్శకత్వం కూడా చేస్తానంటూ మనసులోని మాటని ఇన్ డైరెక్ట్ గా బయటపెట్టాడు.చూడాలి మరి మంచి సినిమాలతో ప్రామిసింగ్ హీరోగా ఎదిగిన కిరణ్ అబ్బవరం దర్శకత్వంలో ఎలాంటి సంచనాలు సృష్టిస్తాడో !

also read :‘రావు బహదూర్’ని లేపడానికి వంగా తాపత్రయం… వర్కవుట్ అవుతుందా బాసూ?

Related News

‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

గ్లామర్ డోస్ పెంచేసిన దురంధర్ బ్యూటీ.. ఫ్యాన్స్‌కు కనువిందే!

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

RC 17 షూటింగ్ పై సుకుమార్ బిగ్ అప్డేట్… ప్రయాణం ప్రారంభం!

బ్లూ శారీలో అదరగొట్టిన ప్రీతి ముఖుందన్.. అందం మామూలుగా లేదుగా!

మళ్లీ లాయర్‌గా కీర్తి సురేష్.. ఈసారి అయినా హిట్ కొడుతుందా?

చిరుత హీరోయిన్ అందాల విందు.. ఇన్‌స్టాలో హాట్ టాపిక్!

హైందవ టీజర్ రిలీజ్…విగ్రహాల చోరీ వెనుక రహస్యం ఏంటీ!

Big Stories

Advertisement
×