E-Paper
Advertisement

GPS: ఆ శ్వాస.. గర్జన కన్నా భయంకరంగా! తరుణ్ భాస్కర్ ‘GPS’కు అర్థమిదే..

GPS: ఆ శ్వాస.. గర్జన కన్నా భయంకరంగా! తరుణ్ భాస్కర్ ‘GPS’కు అర్థమిదే..
Advertisement

GPS: కొన్ని టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘GPS అంటే ఏమిటి?’ అనే ప్రశ్న బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అసలు GPS అంటే ఏమిటో తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) చెబుతారు అంటూ గురువారం ఓ పోస్ట్ బాగా వైరల్ అయింది. ఆ పోస్ట్‌లో చెప్పినట్లే GPS అంటే ఏంటో రివీలైంది. అంతకు ముందు చాలా మంది GPS అంటే ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ అనేలా కామెంట్స్ చేశారు. కానీ, GPS‌కు KGF డైలాగ్‌ని లింక్ చేస్తూ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. దర్శకుడిగానే కాకుండా నటుడిగా డిఫరెంట్ ఎంటర్‌టైనర్స్‌తో అలరిస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ఓ యూనిక్ మూవీతో రాబోతున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పవన్ సాధినేని (Pavan Sadineni) సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై.. కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర టైటిల్‌ని మేకర్స్ రివీల్ చేశారు.

Also Read- Nagabandham: ‘నాగబంధం’లో బాలీవుడ్ ‘ఫైటర్’ ఫేమ్ రిషబ్ సాహ్నీ.. ఫస్ట్ లుక్ అరాచకం!

నవ్వకండి! ఇది చాలా సీరియస్ మేటర్!

Advertisement

ఈ సినిమా టైటిల్ GPS‌కు అర్థం ఏంటంటే.. ‘గాయపడ్డ సింహం’ (Gaayapadda Simham). ఈ టైటిల్‌‌ని అనౌన్స్ చేస్తూ ఆసక్తికరమైన పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ సినిమా మూడ్, నేపథ్యాన్ని ప్రజెంట్ చేస్తోంది. అమెరికన్ శైలిలో ఉన్న ఎరుపు-తెలుపు రంగుల బొమ్మలతో నిండిన ఈ పోస్టర్ డిజైన్‌లో, అమెరికా జెండాను గుర్తు చేసే నక్షత్రాలు, నిలువు గీతల నేపథ్యంలో దూసుకుపోతున్న విమానం కనిపిస్తుంది. పాస్‌పోర్ట్ స్టాంప్ ఒక సాహసోపేతమైన, సెటైరికల్ కథనాన్ని తెలియజేస్తోంది. రివాల్వర్, డొనాల్డ్ ట్రంప్‌ను పోలి ఉన్న క్యారికేచర్, అలాగే నటరాజ కాంపస్ బాక్స్ ఇవన్నీ పోస్టర్‌లో చాలా ఆసక్తికరంగా వున్నాయి. ఇవన్నీ ఈ సినిమా ఒక పొలిటికల్ సెటైర్, క్రైమ్, హాస్యం కలగలిసిన ఎంటర్‌టైనర్ అనే విషయాన్ని సూచిస్తున్నాయి. ‘నవ్వకండి! ఇది చాలా సీరియస్ మేటర్!’ అనే ట్యాగ్‌లైన్ మరింత హిలేరియస్‌గా వుంది. ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నామని మేకర్స్ తెలియజేశారు.

Also Read- Balakrishna: చరణ్ ట్విన్స్ కోసం బాలయ్య స్పెషల్ గిఫ్ట్స్.. మురిసిపోతున్న ఫ్యాన్స్!

గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస..

Advertisement

ఈ పోస్టర్‌ వదులుతూ.. ‘‘గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస.. గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది’’ అని కెజియఫ్ డైలాగ్‌ని మేకర్స్ పోస్ట్ చేయడం చూసి, ఇదేదో యాక్షన్ ఫిల్మ్ అని అంతా అనుకున్నారు. కానీ, ఈ పోస్టర్ చూస్తుంటే, సరదాగా ఎంటర్‌టైన్ చేసే చిత్రమని అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ సరసన ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా.. విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తయిందని, కేవలం ఒక పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని మేకర్స్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ సినిమాకు స్వీకర్ అగస్తి సంగీతాన్ని అందిస్తున్నారు. ఫిబ్రవరి 9న వచ్చే టీజర్‌తో ఈ సినిమాలో ఉన్న మ్యాటరేంటనేది మరింత క్లారిటీ రానుంది.

Also Read- Maa Vande: ప్రధాని మోదీ బయోపిక్ ‘మా వందే’.. తాజా అప్డేట్ ఏంటంటే?

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×