E-Paper
Advertisement

Supreme Court: బీఆర్ఎస్ పార్టీకి సుప్రీం కోర్టులో షాక్​.. ఆ వ్యవహారంలో స్పీకర్​ నిర్ణయమే ఫైనల్​

Supreme Court: బీఆర్ఎస్ పార్టీకి సుప్రీం కోర్టులో షాక్​.. ఆ వ్యవహారంలో స్పీకర్​ నిర్ణయమే ఫైనల్​
Advertisement

Supreme Court: ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి సుప్రీం కోర్టులో షాక్​ తగిలింది. దీంట్లో స్పీకర్​ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం విచారణను ముగిస్తున్నట్టుగా పేర్కొంది. క్రితంసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ బీ ఫాంపై నెగ్గిన పదిమంది ఎమ్మెల్యేలు ఆ తరువాత కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారని పేర్కొంటూ వారిపై అనర్హత వేటు వేయాలని మాజీ మంత్రి కేటీఆర్​, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. స్పీకర్ కు కూడా ఫిర్యాదులు చేశారు. కాగా, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి తగు చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్ కు ఆదేశాలు జారీ చేసింది.

Also Read: KGBV Admissions: టెన్త్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. ఇంటర్ ప్రవేశాలకు కేజీబీవీ నుంచి నోటిఫికేషన్ విడుదల

పది మంది ఎమ్మెల్యేలకు క్లీన్​ చిట్

Advertisement

ఈ క్రమంలో విచారణ ముగించిన స్పీకర్ మొత్తం పది మంది ఎమ్మెల్యేలకు క్లీన్​ చిట్ ఇచ్చారు. వాళ్లు పార్టీ మారారనటానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. కాగా, బీఆర్​ఎస్ నాయకులు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్​ సంజయ్ కరోల్, జస్టిస్​ అగస్టీన్​ జార్జ్​ మసీహ్ లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా స్పీకర్ తరపున వాదనలు వినిపించిన అభిషేక్​ సింఘ్వీ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఇప్పటికే విచారణ ముగిసినట్టు చెప్పారు.

ఇక విచారణ జరపాల్సిన అవసరం లేదు 

దీంట్లో వెల్లడైన వివరాల ఆధారంగా స్పీకర్​ తగు నిర్ణయం కూడా తీసుకున్నారని చెప్పారు. పిటిషన్లను స్పీకర్ కార్యాలయం పరిష్కరించిందన్నారు. ఈ వాదనలతో సుప్రీం కోర్టు ఏకీభవించిందవి. స్పీకర్ ఈ అంశంలో ఇప్పటికే తుది నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇక విచారణ జరపాల్సిన అవసరం లేదని అభిప్రాయ పడింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ ముగిసినట్టేనని పేర్కొంది. స్పీకర్​ తన తీర్పును రెండు రోజుల్లో అధికారికంగా వెలువరించి ప్రతులను ఫిర్యాదుదారులకు అంద చేయాలని సూచించింది.

Advertisement

Also Read: RTC Workers Issues: రిటైర్డ్ ఉద్యోగుల సొమ్ముపై రేవంత్ సర్కార్ కన్ను? హరీశ్ రావు సంచలన కామెంట్స్!

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×