E-Paper
Advertisement

Deewana Teaser: అది నా పిల్ల.. అది ఇది అని నేనంటా!.. ‘దీవాన’ టీజర్ ఎలా ఉందంటే?

Deewana Teaser: అది నా పిల్ల.. అది ఇది అని నేనంటా!.. ‘దీవాన’ టీజర్ ఎలా ఉందంటే?
Advertisement

Deewana Teaser: ‘శుభం’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న యంగ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి (Harshith Reddy) హీరోగా నటిస్తున్న సినిమా ‘దీవాన’ (Deewana). ఈ సినిమాతో స్మేహ మణిమేగలై (Smeha Manimegalai) హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్న ఈ సినిమాను ఈ వేసవికి థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో చిత్ర టీజర్‌ని గురువారం (మార్చి 12) విడుదల చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా చెప్పాలంటే ఈ టీజర్ (Deewana Teaser) చూస్తుంటే మణిరత్నం సినిమా ఫీల్‌ని ఇస్తోంది.

Also Read- Anant Sriram: టాలీవుడ్‌లో సరస్వతీ పుత్ర వివాదం.. అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు వైరల్..!

‘దీవాన’ కాన్సెప్ట్ తెలిసిపోతుంది

Advertisement

టీజర్‌‌ని గమనిస్తే.. ఒక పెళ్లి వేడుకలో హీరోయిన్‌ని చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు ప్రేమలో పడతాడు హీరో. అప్పటి నుంచి ఆ అమ్మాయే లోకంగా బతుకుతుండగా.. ఆ అమ్మాయి తరుపు వాళ్లతో ప్రమాదమని స్నేహితులు చెబుతుంటారు. అయినా సరే హీరో వినిపించుకోడు. ఆ అమ్మాయే సర్వస్వం అనేలా జీవిస్తుంటాడు. ఆ అమ్మాయి కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. మరి అతని ప్రేమ ఆ అమ్మాయికి తెలిసిందా? ఆ అమ్మాయి ప్రేమ అతనికి దక్కిందా? లేదా? అనేదే ఈ సినిమా అనేది ఈ టీజర్ తెలియజేస్తోంది. ‘చస్తావా రా దాని కోసం’ అని స్నేహితుడు అంటే.. ‘అది ఇది అని అనవద్దు.. అది నా పిల్ల.. నేను మాత్రమే అనాలి’ అని హీరో చెప్పడం ‘అర్జున్ రెడ్డి’ని తలపిస్తుంది.

Also Read- Youth First Look: ‘యూత్’ ఫస్ట్ లుక్ వదిలిన యంగ్ హీరో.. మరో లిటిల్ హార్ట్స్!

టీజర్‌ హైలెట్స్ ఇవే..

Advertisement

ఇంకా ఈ టీజర్‌లో ‘ఇది ప్రేమ ఇది ప్రేమ గుండెల్లోన సడిరేపేదే ప్రేమ…’ అనే సాంగ్ బీజీఎం హార్ట్ టచింగ్‌గా ఉంది. టీజర్ చివరలో.. ‘ఎంత అందంగా ఉంటే అంత సతాయిస్తర్ర ఈ పోరీలు, అది నీ పానం పీక్కతినకపోతే నన్ను అడుగురా..’ అనే డైలాగ్స్ ఈ టీజర్‌కే హైలెట్ అనేలా ఉన్నాయి. మొదటి నుంచి, ఇందులోని డైలాగ్స్‌ సినిమాపై స్పెషల్ అటెన్షన్‌ని తీసుకువస్తున్నాయి. ఇందులో ఒక ఇంటెన్స్ బ్యూటిఫుల్ మ్యూజికల్ లవ్ స్టోరీ ఉన్నట్లుగా టీజర్‌ అయితే క్లారిటీ ఇచ్చేస్తోంది. యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉన్నట్లుగా ఈ టీజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. టీజర్‌లో ప్రతి సన్నివేశం, విజువల్స్.. రియలెస్టిక్‌గా, బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. హీరో హీరోయిన్స్ జంట ఫ్రెష్‌గా కనిపిస్తోంది. టాలీవుడ్‌లో మంచి హిట్ అయ్యే లక్షణాలు ఈ సినిమాకు ఉన్నట్లుగా తెలియజేయడంలో ఈ టీజర్ 100 శాతం సక్సెస్ అయిందని మాత్రం చెప్పుకోవచ్చు.

Also Read- Harish Shankar: రాశీ ఖన్నాతో కలిసి డ్యాన్స్.. గత్తర లేపిన హరీష్ శంకర్!

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×