Kamran Akmal: బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ( Bangladesh vs Pakistan) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ లోనే పాకిస్తాన్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో దారుణంగా ఓడిపోయింది పాకిస్తాన్. అయితే పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోవడంపై ఆ జట్టుకు సంబంధించిన మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ( kamran akmal) స్పందించాడు. పాకిస్తాన్ జట్టును ఓడించేందుకు బీసీసీఐ కుట్రలు చేసిందని సీరియస్ అయ్యాడు. బంగ్లాదేశ్ లోని దాకా పిచ్ మొత్తం బీసీసీఐ మార్చేసినట్లు ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో కలిసి ఈ కుట్ర బీసీసీఐ ( BCCI ) చేసిందని మండిపడ్డారు.
టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంటులో ( T20 World Cup 2026 tournament ) సూపర్ 8 దాకా వచ్చి, ఇంటి దారి పట్టిన పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ గడ్డపై 3 వన్డేలు ఆడేందుకు వెళ్లిన పాకిస్తాన్ … మొదటి మ్యాచ్ లోనే ఓడిపోయింది. బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ( Bangladesh vs Pakistan) మధ్య ఢాకా లోని షేర్ బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం ( Shere Bangla National Stadium, Dhaka ) వేదికగా అంతర్జాతీయ వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇందులో పాకిస్తాన్ మొదటి బ్యాటింగ్ చేసి 30.4 ఓవర్లు ఆడింది. ఈ సందర్భంగా 114 పరుగులు సాధించింది పాకిస్తాన్ క్రికెట్ జట్టు. అయితే ఈ 115 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15 ఓవర్లలో ఊది పారేసింది బంగ్లాదేశ్. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించడం జరిగింది. 3 వన్డేల సిరీస్ లో 1-0 తేడాతో బంగ్లాదేశ్ ముందంజలోకి వచ్చింది.
బంగ్లాదేశ్ చేతిలో 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓడిపోయిన సందర్భంగా ఆ జట్టుకు సంబంధించిన మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢాకా స్టేడియంలో పిచ్ మొత్తం మార్చేసింది బీసీసీఐ అంటూ ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో చేతులు కలిపి బీసీసీఐ ఈ పని చేసిందని మండిపడ్డారు. అలాగే బంగ్లాదేశ్ బౌలర్లు వేసే బంతుల్లో చిప్ లు కూడా పెట్టారని షాకింగ్ ఆరోపణలు చేశారు కమ్రాన్ అక్మల్. మొత్తం బంగ్లాదేశ్ మ్యాచ్ గెలిచేలా భారత్ క్రికెట్ నియంత్రణ మండలి కుట్రలకు తెరలేపిందని బాంబు పేల్చారు కమ్రాన్ అక్మల్. దీనిపై ఐసీసీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పాకిస్తాన్ మొత్తం వన్డే సిరీస్ ను కోల్పోయే ప్రమాదం ఉందని వెల్లడించారు.
🚨Pakistan got all-out on just 114 against Bangladesh 🚨
What's yhe excuse now?
– Is ICC favouring BCB?
– Did BCCI changed the pitch?
– Did BCCI placed the chips in the balls?
– Did BCCI bought the umpires?What's your take 😅 pic.twitter.com/Q0viJhNDAe
— Indian Cricket (@IPL2025Auction) March 12, 2026