Tollywood : సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం అంత ఈజీ కాదు.. అందం, అభినయం ఉన్నా కూడా ఆవగింజంత అదృష్టం లేకుంటే మాత్రం అవకాశాలు అందని ద్రాక్షలాగ మారుతాయి.. ఈ మధ్య స్టార్ హీరోయిన్ల పరిస్థితి కూడా దారుణంగా మారింది.. ఎంతోమంది సినీ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చెయ్యడమో లేక, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్లు ఇండస్ట్రీని వదిలేసి ఉద్యోగాలు చేస్తున్నారు. లేదంటే వ్యాపారాలు చేస్తున్నారు. ఇండస్ట్రీకి దూరమై ఉద్యోగాలు చేస్తున్న యంగ్ బ్యూటిస్ ఎవరు? ప్రస్తుతం వాళ్లు ఎలాంటి ఉద్యోగాలు చేస్తున్నారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసింది ఢిల్లీ బ్యూటీ దీక్షా సేథ్.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోల అందరితో నటించింది. తెలుగు, హిందీలో వరుసగా మూవీస్ చేసింది. వేదం, మిరపకాయ్, వాంటెడ్, నిప్పు, ఊకోడతార ఉలిక్కిపడతారా, రెబల్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈమె మిస్ ఇండియా అందాల పోటీలో కూడా పాల్గొన్నది. తన అందంతో కుర్రాళ్లకు కునుకు చేసింది. అప్పటిలో ఈమె చేసిన ప్రతి మూవీ మంచి క్రేజ్ ను అందుకున్నాయి. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఈమె సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం ఈమె యూరప్ లోని ఓ ప్రముఖ గెమింగ్ కంపెనీలో కీలక బాధ్యతలను నిర్వహిస్తుంది. ఇక సినిమాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని క్లియర్ గా అర్థం అయ్యింది.. ఏది ఏమైన ఈమె లాంటి బ్యూటిఫుల్ హీరోయిన్ ను ఇండస్ట్రీ మిస్ అయ్యింది. ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందేమో చూడాలి..
ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మెగాస్టార్ చిరంజీవి 2001 లో నటించిన సినిమా ‘డాడీ’.. ఈ మూవీలో అక్షయ పాత్రలో నటించింది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉన్న రోల్ తో అందరిని ఆకట్టుకుంది.. ఈ మూవీ చేస్తున్న సమయంలో ఆమె వయసు 4 ఏళ్లు.. ఇప్పుడు 30 ఏళ్లు ఉంటుంది.. చిన్నప్పుడు ఎలాగైతే అందంగా క్యూట్ గా ఉందో.. ఇప్పుడు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ముంబైలో జన్మించిన ఆమె, ప్రస్తుతం ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్లో ఉంటోంది.. అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం మంచి ఉద్యోగం చేస్తుంది.. ఇప్పుడు సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. అవి నెట్టింట క్షణాల్లోనే వైరల్ అవుతాయి.
వీళ్లు మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు సినిమాలకు దూరం అయ్యారు. హీరోలు కూడా కొందరు సినిమాలకు దూరం అయ్యారు. కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొంతమంది బిజినెస్ లు చేస్తూ బిజీగా ఉన్నారు..